Time Management : అస్సలు టైమ్ సరిపోవడం లేదా? టైమ్ మేనేజ్‌మెంట్ మీ ప్లస్ పాయింట్ కావాలా?
Time Management : ఇప్పుడు ఎవరిని చూసినా అస్సలు టైమ్ సరిపోవడం లేదు బాబోయ్ అని చెప్పడం కామన్ అయిపోయింది
Time Management
ఇప్పుడు ఎవరిని చూసినా అస్సలు టైమ్ సరిపోవడం లేదు బాబోయ్ అని చెప్పడం కామన్ అయిపోయింది . నిజానికి అందరికీ ఉన్నవి రోజుకు 24 గంటలే కానీ.. కొంతమంది టైమ్ టు టైమ్ పని చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటే.. మరికొంత మంది మాత్రం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదొక పని చేస్తూనే ఉన్నా.. చేయాల్సిన పని మాత్రం పూర్తి కాదు. దీనివల్ల తెలియని ఒక రకమైన టెన్షన్, ఫ్రస్ట్రేషన్, ఆత్మన్యూనత వచ్చేస్తుంటాయి. మరి ఈ సమస్యను ఎలా ఓవర్ కమ్ చేయాలి? మన పనులను ఎలా ప్లాన్ చేసుకోవాలనే దానిపై నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.
చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే.. దీనిని మల్టీ టాస్కింగ్‌లో భాగంగా ఒకేసారి అన్ని పనులను తలకెత్తుకుంటారు . ఇది వినడానికి బాగుంటుంది కానీ, ప్రాక్టికల్‌గా దేనికీ న్యాయం చేయలేరు. టైమ్ మేనేజ్‌మెంట్(Time Management) వీక్నెస్ కాకూడదు అనుకుంటే రోజు మొదలవ్వకముందే ఒక చిన్న ‘టు-డూ లిస్ట్’ (To-Do List) రాసుకోండి. అంటే ఏ పని ముందు చేయాలో ఏ పని దాని తర్వాత చేయాలో ఒక చిన్న నోట్ అన్నమాట. ఇలా చేయడం వల్ల మైండ్‌కి ఒక క్లారిటీ రావడంతో పాటు.. మీకు ఏ పని ఎప్పుడు పూర్తి చేయాలో ఒక ఐడియా ఉంటుంది.
ఇక రెండోది, పనులను ప్రయారిటీ (Priority) బట్టి సెట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అంటే ఏది చాలా ఇంపార్టెంట్, ఏది తర్వాత చేసినా పర్వాలేదని ముందే ఫిక్స్ అవ్వాలి. బాగా కష్టంగా అనిపించే పనులన్నిటినీ మీ ఎనర్జీ లెవల్స్ ఎక్కువగా ఉన్న టైమ్‌లో అంటే సాధారణంగా ఉదయం పూట ఫినిష్ చేయడానికి రెడీ అవ్వండి. తక్కువ ఇంపార్టెంట్ ఉన్న పనులను మధ్యాహ్నం లేదా ఖాళీ టైమ్‌కి చేసేలా ప్లాన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల వర్క్ ప్రెజర్ చాలా వరకు తగ్గిపోతుంది.
టైమ్ మేనేజ్‌మెంట్(Time Management)లో చాలామందికి ఉండే పెద్ద మైనస్ ప్రొక్రాస్టినేషన్ (Procrastination). అంటే ఇప్పుడెందుకులే.. రేపు చూద్దాం లేదా కాసేపు ఆగాక చేద్దామని వాయిదా వేయడం అన్నమాట. ఈ అలవాటును జయించడానికి 5 మినిట్స్ రూల్ అనే ఒక ట్రిక్ ప్లే చేయడమే. అంటే ఏదైనా పని మొదలుపెట్టడానికి బద్ధకంగా అన్పిస్తే.. జస్ట్ ఒక ఐదు నిమిషాలు చేస్తాను.. కావాలంటే తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటానని మీ మైండ్‌ని ఒప్పించి పనిలోకి దిగండి. అలా ఒక్కసారి పని స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ పని పూర్తి అయిపోతుంది. అలాగే, పని మధ్యలో వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వంటి డిస్ట్రాక్షన్స్‌కు కాసేపు దూరంగా ఉండేలా అలవాటు చేసుకోండి.

చివరగా, టైమ్ మేనేజ్‌మెంట్(Time Management) అనేది మన లైఫ్ స్టైల్‌ని మార్చుకోవడమేనని గుర్తుపెట్టుకోవాలి. కావాలి అంటే పని మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం వల్ల మైండ్ ఫ్రెష్‌గా ఉండి మరింత స్పీడ్‌గా పని చేయగలుగుతారు. గుర్తుంచుకోండి.. టైమ్‌ని వేస్ట్ చేసేవాడిని టైమ్ ఎప్పుడూ క్షమించదు. ఒక ప్లాన్ ప్రకారం వెళ్లడం అలవాటు చేసుకుంటే.. 24 గంటలు మనకు చాలా ఎక్కువే అనిపిస్తుంది. సో.. ఇవాల్టి నుంచే మీ టైమ్‌ని మీరే మేనేజ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు సక్సెస్ వద్దన్నా మీ వెంటే వస్తుంది.
IPL Final : అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్..బెంగళూరుకు బీసీసీఐ షాక్




