Just LifestyleLatest News

Mentality : నిన్న తిట్టి ఈరోజు పొగిడే మెంటాలిటీ.. మీ చుట్టూ ఉన్నవారిలో కూడా ఉందా?

Mentality :సైకాలజీ ప్రకారం మనుషుల్లో ఉండే ఈ డ్యుయెల్ మైండ్ సెట్ (ద్వంద్వ ప్రవృత్తి)ని స్ప్లిటింగ్ (Splitting) లేదా బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ (Black and White Thinking)అని పిలుస్తారు.

Mentality

మనుషులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. నిన్నటి దాకా ఒకరిని తిట్టిన వాళ్లే.. ఈరోజు వారు ఒక చిన్న హెల్ప్ లేదా ఫేవర్ చేయగానే అబ్బా.. అతనికంటే మంచివాడు ఇంకొకడు లేడని ఆకాశానికి ఎత్తేస్తారు.

అలాగే ఎన్నో ఏళ్లుగా ఎంతో మంచివాడని పేరు తెచ్చుకున్న వ్యక్తి, పొరపాటున అవతలి వాళ్లకు నచ్చని ఒక్క చిన్న పని చేస్తే చాలు.. అంతవరకూ చేసిన మంచి అంతా మర్చిపోయి వాడంత చెడ్డవాడు ప్రపంచంలోనే లేడన్నట్లు మాట్లాడటం స్టార్ట్ చేస్తారు.

సైకాలజీ ప్రకారం మనుషుల్లో ఉండే ఈ డ్యుయెల్ మైండ్ సెట్ (ద్వంద్వ ప్రవృత్తి)ని స్ప్లిటింగ్ (Splitting) లేదా బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ (Black and White Thinking)అని పిలుస్తారు.

దీనర్థం ఏంటంటే.. కొందరి మైండ్ ఒక మనిషిని లేదా ఒక సిట్యువేషన్‌ను కేవలం మంచి లేదా చెడు అనే రెండు కోణాల్లోనే చూస్తుంది తప్ప, ఆ రెండింటి మధ్య ఉండే గ్రే ఏరియా అంటే మధ్యస్థ వాతావరణాన్ని అర్థం చేసుకోలేదు.

వాళ్ల దృష్టిలో ఒక వ్యక్తి ఐతే పూర్తిగా మంచోడయిపోవాలి, లేదా పూర్తిగా చెడ్డోడు అయిపోవాలి. అవతలి మనిషిలో కూడా మనలాగే మంచి, చెడుల కలయిక ఉంటుందనే రియాలిటీని వాళ్ల బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేదు.

దీనికి తోడు సైకాలజీలో మరో రెండు ఇంట్రెస్టింగ్ రూల్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి రీసెన్సీ ఎఫెక్ట్’ (Recency Effect). దీని ప్రకారం మన బ్రెయిన్ ఒక వ్యక్తి గురించి ఆలోచించేటప్పుడు, ఆ వ్యక్తి గతంలో చేసిన పనుల కంటే.. అత్యంత రీసెంట్‌గా చేసిన పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది.

అందుకే అంతవరకూ నచ్చని మనిషి ఒక్క చిన్న ఫేవర్ చేయగానే, ఆ తాజా ఇంప్రెషన్‌తో పాత కోపమంతా మాయమైపోతుంది. అలాగే ఎంతో మంచివాడు ఒక్క తప్పు చేయగానే, ఆ లేటెస్ట్ తప్పు మాత్రమే మైండ్‌లో బలంగా నాటుకుపోయి పాత మంచితనాన్ని స్క్రీన్ లాగా కప్పేస్తుంది.

ఇది రాజకీయాల్లోనూ బాగా కనిపిస్తుంది. ఎన్నికల ముందు ప్రకటించే తాయిలాలు , ఎన్నికల ముందు చేసే మంచిపనులనే ఓటర్లు బాగా గుర్తు పెట్టుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే జనాల్లో ఉండే ఈ మైండ్ సెట్‌నే నాయకుల గెలుపోటములను డిసైడ్ చేస్తుంది.

ఇక రెండోది కన్ఫర్మేషన్ బయాస్ (Confirmation Bias), స్వార్థం . చాలా మంది ఇతరులను తమ అవసరాలను బట్టి, ఇష్టాయిష్టాల బట్టే జడ్జ్ చేస్తుంటారు. మనకు నచ్చినట్లు ఉంటే మంచివాడు, మనకు ఎదురు తిరిగితే చెడ్డవాడు అనుకుంటారు.

ఎవరైనా ఒకరు వారికి ఫేవర్ చేసినప్పుడు వారిలో ఉన్న ఈగో సాటిస్ఫై అవుతుంది. దాంతో అంతవరకూ వాళ్లపై ఉన్న నెగిటివిటీని పక్కన పెట్టి వాళ్లను ఓవర్‌గా పొగడటం స్టార్ట్ చేస్తారు. అదే కనుక ఒక వ్యక్తి వారికి నచ్చని పని చేసినప్పుడు, వారి ఈగో దెబ్బతిని వాళ్లలో ఉన్న నెగిటివ్ పాయింట్స్‌ అన్నింటిని వెతికి పట్టుకుని హైలైట్ చేస్తారు.

Mentality
Mentality

సింపుల్‌గా చెప్పాలంటే, ఈ డ్యుయెల్ మైండ్ సెట్ అనేది ఆ మనుషుల ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీని సూచిస్తుంది . నిజానికి ప్రతి మనిషిలోనూ ప్లస్‌లు ఉంటాయి, మైనస్‌లు కూడా ఉంటాయి. ఒకే ఒక్క ఇన్సిడెంట్‌ని బట్టి ఒకరి క్యారెక్టర్‌ను పర్మినెంట్‌గా డిసైడ్ చేయకూడదు.

ఎవరైతే అన్ని విషయాలను లోతుగా ఆలోచించగలరో, ఎవరికైతే పూర్తి మెచ్యూరిటీ ఉంటుందో.. వాళ్లు ఇతరులు చేసిన ఒక చిన్న తప్పుకో లేదా ఒక చిన్న ఫేవర్‌కో త్వరగా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వరు. అవతలి వ్యక్తిని లాజికల్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా అర్థం చేసుకుంటారు.

IND vs AFG : ధర్మశాలలో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్..తొలి వన్డేలో భారత్ ఘనవిజయం

Related Articles

Back to top button