Just LifestyleJust SpiritualLatest News

Mirror:ఇంట్లో అద్దాల అమరిక వెనుక దాగున్న రహస్యాలు..ఏ దిశలో ఉంటే ఐశ్వర్యం వస్తుందంటే..

Mirror: వాస్తు ప్రకారం ఇంటి ఉత్తరం, తూర్పు దిశలో ఉన్న గోడలకు మాత్రమే అద్దాలను ఎప్పుడూ అమర్చాలి.

Mirror

వాస్తు శాస్త్రంలో అద్దాలకు (Mirrors) ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇవి శక్తిని ప్రతిబింబిస్తాయట. కాబట్టి, వీటిని సరైన దిశలో ఉంచకపోతే ఇంట్లో ప్రతికూలత పెరిగే అవకాశం ఉంటుందని అంటారు.

వాస్తు ప్రకారం ఇంటి ఉత్తరం, తూర్పు దిశలో ఉన్న గోడలకు మాత్రమే అద్దాలను ఎప్పుడూ అమర్చాలి. ఉత్తర దిశ కుబేరుడికి నిలయం కాబట్టి, అక్కడ అద్దం ఉండటం వల్ల ఇంట్లోకి సంపద పెరుగుతుందని వాస్తు పండితులు నమ్ముతారు. అలాగే తూర్పు దిశ నుంచి వచ్చే సానుకూల శక్తి ఇల్లంతా వ్యాపించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటారు.

అలాగే అద్దాలను ఎప్పుడూ కూడా దక్షిణం, పశ్చిమ దిశలో ఉంచకూడదట. దీనివల్ల ఇంట్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బెడ్ రూమ్ లో అద్దం అమర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

నిద్రపోతున్నప్పుడు మన శరీరం అద్దం(Mirror)లో కనిపించకుండా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ అలా పడుకున్నప్పుడు అద్దంలో మనం కనిపిస్తే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.అందుకే రాత్రి సమయంలో దానిపై చిన్న క్లాత్ అయినా కప్పేయాలి అని సూచిస్తారు

Mirror
Mirror

అంతేకాదు అద్దం పగిలిపోయినా లేదా మసకబారినా వెంటనే దానిని బయట పడేయాలి, ఎందుకంటే పగిలిన అద్దం దరిద్రానికి సూచికగా భావిస్తారు.

అలాగే డైనింగ్ టేబుల్ కి ఎదురుగా కనుక అద్దం ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ అన్నపానాదులకు కొరత ఉండదని, సంపద రెట్టింపు అవుతుందని వాస్తు శాస్త్రంలో ఒక నమ్మకం.

అద్దం పరిమాణం ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది, మీ ఇంటి అద్దాల స్థానాలను ఒకసారి సరిచూసుకుంటే, చిన్న మార్పుతోనే మీ ఇంట్లో అద్భుతమైన సానుకూల మార్పులను గమనించొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button