Success : గమ్యం వైపు సాగండి.. విజేతలుగా మారడానికి వదులుకోవాల్సినవి ఇవే..
Success : తమ గురించి పదిమంది ఏమనుకుంటున్నారోనన్న ఆందోళనను వదిలేసినప్పుడే మనిషిలోని అసలైన క్రియేటివిటీ మేల్కొంటుంది.
Success
విజయ శిఖరాలను చేరుకోవడానికి ప్రతి ఒక్కరి ప్రయాణంలో ప్రయత్నం,పట్టుదల ఎంత ముఖ్యమో, మన మానసిక శక్తిని ఎక్కడ, దేనికోసం ఖర్చు చేస్తున్నామనే స్పృహ అంతకంటే ముఖ్యం అంటున్నారు మానసిక నిపుణులు.
చాలామంది తమ టార్గెట్ రీచ్ అవడానికి కష్టపడతారు. కానీ, అదే సమయంలో అనవసరమైన విషయాలకు రియాక్టవుతూ తమలోని అమూల్యమైన శక్తిని వేస్ట్ చేసుకుంటారు.
జీవితంలో ఎవరికైనా సరే నిజమైన గెలుపు అంటే.. మనం ఏం సాధించామనే దాని కంటే.. మన ఎదుగుదలకు అడ్డుపడే ఏయే అంశాలను వదిలించుకున్నామనే విషయం పైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. ఆ సమయంలో ఎదురయ్యే చిన్న చిన్న మనస్పర్థలు, అర్థం లేని వాదనలు మనల్ని గమ్యం వైపు సాగనివ్వకుండా వెనక్కి లాగుతుంటాయి.
విజయం(Success) సాధించిన వ్యక్తుల అంతర్గత సీక్రెట్ వారి ఏకాగ్రత మాత్రమే. ఇతరుల విమర్శలకూ, చిన్నపాటి వివాదాలకో వాళ్లు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వరు. తమ గురించి పదిమంది ఏమనుకుంటున్నారోనన్న ఆందోళనను వదిలేసినప్పుడే మనిషిలోని అసలైన క్రియేటివిటీ మేల్కొంటుంది.
మన విలువైన సమయాన్ని చాడీలు చెప్పేవారి మీదో, మనల్ని తక్కువ చేసే వారి మీదో, కించపరిచేవారి మీదో కోపగించుకోవడానికి ఉపయోగించకూడదు. అలా ఉపయోగిస్తే మనం సాధించాల్సిన కలలు ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి తప్ప గోల్ రీచవలేము.. కోపం చూపిస్తేనే గౌరవం దక్కుతుందని అనుకోవడం చాలా పెద్ద తప్పు. నిజానికి మౌనంగా ఉంటూ మన పని ద్వారా సమాధానం చెప్పినప్పుడే సొసైటీ మనల్ని గుర్తిస్తుంది.
మనల్ని విమర్శించే వారితో ఈక్వల్‌గా వారితో వాదించి మన లెవల్ని మనమే తగ్గించుకోవడం కంటే, వారి విమర్శల్లో నిజంగా లోపాలుంటే సరిదిద్దుకుని వారికి సమాధానంగా నిలవాలి. ఇతరుల మెప్పు కోసం కాకుండా, మన సెల్ఫ్ సాటిస్ఫేక్షన్ కోసం మనం చేసే ప్రయత్నం ఎప్పుడూ ఫెయిల్ అవదు.

మన దృష్టి కేవలం గోల్ మీద ఉన్నప్పుడు దారిలో ఎదురయ్యే అడ్డంకి కానీ, చిన్నా చితకా గొడవలు కానీ మనకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. మనస్సు పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడే కొత్త ఆలోచనలు పుడతాయి. ఆ ప్రశాంతతే మనకు అద్భుతమైన శక్తిని ఇస్తుంది. ఆ పవర్‌ను సరైన డైరెక్షన్లో మళ్లించిన రోజే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.
జీవితంలో ప్రతి సవాలుకూ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నింటిని మర్చిపోవడమే గొప్ప విజయానికి(Success) సంకేతం. మనలోని నెగిటివ్ ఆలోచనలతో, మన గ్రోత్‌కు అడ్డుపడే బలహీనతలతోనే మనం అసలైన పోరాటం చేయాలి. అనవసరమైన రోజువారీ వివాదాలకు బై బై పలికిన క్షణం నుంచే.. మన విజయ ప్రస్థానం స్టార్ట్ అవుతుంది. మీ ప్రయాణం నలుగురిలో కావాలి అంటే మీ ఆలోచనలు కూడా అంతకంటే గొప్పగా ఉండాలి.
Cool Drinks :కూల్ డ్రింక్స్ , చిప్స్ కాంబినేషన్ ఇష్టమా? సమ్మర్లో ఈ పొరపాటు అస్సలు చేయొద్దు..





