Just LifestyleLatest News

Narcissism :అహంకారానికి పరాకాష్ట నార్సిసిజం..తమను తామే అతిగా ప్రేమించుకునేవారు మీ సర్కిల్‌లోనూ ఉన్నారా?

Narcissism : నార్సిసిస్ట్ పైకి ఎంతో కాన్పిడెంట్‌తో, అహంకారంతో కనిపిస్తున్నా.. లోపల మాత్రం వీరికి తీవ్రమైన ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది.

Narcissism

మన చుట్టూ ఉండే వాళ్లలో కొంతమంది ఎప్పుడూ తమ గురించి తామే గొప్పలు చెప్పుకోవడం, తానే అందరికంటే అందంగా, తెలివిగా ఉన్నానని ఫీల్ అవ్వడం చూస్తూనే ఉంటాం. ఎదుటివారిని తక్కువ చేసి చూడటమే కాకుండా, అందరూ తనను మాత్రమే మెచ్చుకోవాలని ఆశించే ఈ విచిత్రమైన మనస్తత్వాన్ని సైకాలజీలో నార్సిసిజం అని పిలుస్తారు.

తెలుగులో దీనిని ఆత్మవ్యామోహం లేదా తమను తామే అతిగా ప్రేమించుకోవడమని అనొచ్చు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారిని నార్సిసిస్ట్(Narcissism) అని అంటారు. అయితే ఈ అలవాటు కేవలం వారి స్వభావం మాత్రమే కాదు.. ఇది ముదిరితే ఒక మానసిక సమస్యగా కూడా మారుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.

ఈ నార్సిసిజం(Narcissism )మెంటాలిటీ ఉన్నవాళ్లను గుర్తుపట్టడం చాలా ఈజీ. వీరు ఎక్కడికి వెళ్లినా తననే అందరూ చూడాలని, తనకే అంతా ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటారు.వీరు ఏ తప్పు చేసినా అస్సలు ఒప్పుకోరు. పైగా ఆ తప్పును ఎదుటివారిపైకి తోసేయడంలో వీరు మహా దిట్ట.

అవతలి వ్యక్తి ఎంత బాధలో ఉన్నా వీరు అస్సలు పట్టించుకోరు. అంటే వీరిలో సానుభూతి లేదా ఎంపతీ అనేది అస్సలు కనిపించదు. కేవలం తమ స్వార్థం కోసం, తమ పనులు ముగించుకోవడం కోసం ఎదుటివారిని చాలా ఈజీగా వాడుకోవడం వీరికి బాగా అలవాటు. ఎవరైనా తమను విమర్శిస్తే అస్సలు తట్టుకోలేరు, వెంటనే వారిపై తీవ్రమైన కోపాన్ని లేదా పగను పెంచుకునే మనస్తత్వం వీరికి ఎక్కువ.

సైకాలజీ ప్రకారం ఈ నార్సిసిజం వెనుక ఒక ఆసక్తికరమైన నిజం దాగి ఉంది. పైకి వీరు ఎంతో కాన్పిడెంట్‌తో, అహంకారంతో కనిపిస్తున్నా.. లోపల మాత్రం వీరికి తీవ్రమైన ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. తమను ఎక్కడ ఎవరైనా తక్కువ చేసి చూస్తారేమోననే భయాన్ని కప్పిపుచ్చుకోవడానికే వీరు బయటకు బాగా బిల్డప్ ఇస్తుంటారు.

చిన్నతనంలో తల్లిదండ్రులు పిల్లలను మితిమీరి పొగడటం వల్ల కానీ అస్సలు పట్టించుకోకుండా వదిలేయడం వల్ల కానీ ..పెద్దయ్యాక ఇలాంటి విచిత్రమైన మనస్తత్వం అలవాటు అయ్యే అవకాశం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Narcissism
Narcissism

ఇలాంటి నార్సిసిస్ట్ వ్యక్తులు మన ఇంట్లో కానీ స్నేహితులలో కానీ ఉంటే వారితో వేగడం చాలా నరకంగా మారుతుంది. ఎందుకంటే వీరెప్పుడూ అవతలి వ్యక్తి కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తూ, వారిని తక్కువ చేసి చూస్తూ ఆనందిస్తుంటారు. ఇలాంటి వారి ప్రవర్తన వల్ల బంధాలు త్వరగా ముక్కలైపోతాయి.

వీరిని మార్చడం ఎవరివల్లా కాదు. ఎందుకంటే తమలో లోపం ఉందనే విషయాన్ని వీళ్లు ఎట్టి పరిస్థితులలోనూ ఒప్పుకోరు. అందుకే ఇలాంటి మనస్తత్వం ఉన్నవారిని త్వరగా గుర్తించి.. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా వారికి దూరంగా ఉంటే ఎదుటి వ్యక్తి మానసిక ప్రశాంతతకు అంత మంచిది.

Pawan Kalyan :తెలంగాణలో పవన్ కళ్యాణ్,లోకేష్ స్కెచ్..జూన్ 2న జనసేనాని మీటింగ్‌తో సమీకరణాలు మారతాయా?

Related Articles

Back to top button