Just LifestyleLatest News

Porcelain Cups : పింగాణీ కప్పులకూ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా?

Porcelain Cups : పింగాణీ కప్పుల ద్వారా సీసం బాడీలోకి చేరడం వల్ల బీపీ పెరగడం, కిడ్నీలు పాడవటం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Porcelain Cups

మార్నింగ్ లేవగానే వేడివేడి టీ లేదా కాఫీతో డేని స్టార్ట్ చేయడం చాలామందికి అలవాటు. మార్కెట్‌లో దొరికే అందమైన రంగురంగుల సిరామిక్, పింగాణీ కప్పులను ముచ్చటపడి కొనుక్కుని వాడుతుంటాం. అయితే మనం తినే ఫుడ్, వాడే మెడిసిన్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉన్నట్లే.. మనం రోజూ టీ,కాఫీ తాగే పింగాణీ కప్పులకు(Porcelain Cups) కూడా ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందనే విషయం మాత్రం మనలో చాలామందికి తెలీదు.

ఈ కప్పులపై ఎటువంటి ఎక్స్‌పైరీ డేట్ కనిపించదు కదా మరి ఎలా తెలుస్తుంది అని చాలామందికి డౌట్ వస్తుంది. ఎప్పుడైనా సరే పాతబడిపోయిన, గీతలు పడిన, పగుళ్లు వచ్చిన కప్పులను వాడటం మానేయాలి. ఇలాంటి వాటిని వాడటం అంటే మన బాడీలోకి మనమే విషపూరిత కెమికల్స్‌ను ఆహ్వానించడమేనని నిపుణులు అంటున్నారు.

పోర్సిలైన్ కప్పులను బయటకు మెరిసిపోయేలా, రంధ్రాలు లేకుండా అందంగా మార్చడానికి తయారీ సమయంలో విట్రిఫైడ్ గ్లేజింగ్ అనే ప్రత్యేక కోటింగ్ వేస్తారు. ఈ కోటింగ్ తయారీలో, కలర్స్‌లో సీసం (Lead), కాడ్మియం వంటి అత్యంత ప్రమాదకరమైన భారలోహాలను ఉపయోగిస్తారు.

వాడేకొద్దీ కప్పులు పాతబడటం వల్ల కానీ, పాత్రలు తోమేటప్పుడు పడే స్క్రాచెస్ వల్ల పైన ఉన్న రక్షణ పొర మెల్లగా దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్న కప్పులలో వేడి టీ, కాఫీ పోసినప్పుడు, ఆ వేడికి గ్లేజింగ్‌లోని కెమికల్స్ కరిగి వాటిలో కలిసిపోయి మన పొట్టలోకి చేరతాయి.

ఇది మాత్రమే కాదు, పగుళ్లు పడిన పింగాణీ కప్పుల(Porcelain Cups) వల్ల బ్యాక్టీరియా ముప్పు కూడా పొంచి ఉంటుంది. కప్పుల లోపల లేదంటే అడుగున కంటికి కూడా కనిపించని అతి చిన్న పగుళ్లలో టీ, పాలు, తేమ ఇంకిపోతాయి. మీరు ఎంత క్లీన్ చేసినా ఆ రంధ్రాలలోని తడి పోదు. మెల్లగా అక్కడ ఫంగస్, డేంజరస్ బ్యాక్టీరియా పెరిగిపోయి జీర్ణకోశ సమస్యలు, కడుపులో ఇన్ఫెక్షన్లు, వాంతులు, విరేచనాలకు దారితీస్తాయి.

Porcelain Cups
Porcelain Cups

మెయిన్‌గా ఈ కప్పుల ద్వారా సీసం (లెడ్) బాడీలోకి చేరడం వల్ల బ్లడ్ ప్రెజర్ (బీపీ) పెరగడం, కిడ్నీలు పాడవటం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. చిన్న పిల్లలు ఇలాంటి కప్పులలో డైలీ వేడి పాలు తాగితే వారి ఇంటలెక్చువల్ డెవలప్మెంట్‌ పైన, మైండ్ పవర్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది.

అయితే మీ కప్పులను ఎప్పుడు పడేయాలో ఎలా గుర్తించాలనే దానిపై నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. కప్పు అంచులకు చిన్న పగుళ్లు వచ్చినా, ముక్క ఊడిపోయినా, కప్పు లోపలి భాగాన షైనింగ్ తగ్గిపోయి గీతలు స్పష్టంగా కనిపిస్తున్నా, టీ మరకలు ఎంత రుద్దినా పోకపోయినా .. ఇక వాటికి బై బై చెప్పే టైమ్ వచ్చిందని అర్థం.

Apple Pay : డిజిటల్ మార్కెట్లోకి యాపిల్ పే ఎంట్రీ.. ఫోన్‌పే, గూగుల్ పే యాప్‌లకు చెక్ తప్పదా?

Related Articles

Back to top button