Memories: జ్ఞాపకాల భారంలో వర్తమానం నలిగిపోతుందా? దీని నుంచి ఎలా బయటపడాలి?

Memories: గతంలో గడిపిన జీవితం మీద అతిగా ప్రేమ పెంచుకోవడం వల్ల మనిషి ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న మార్పులను అంగీకరించడానికి నిరాకరిస్తుంటాడు.

Memories

సాధారణంగా మనమంతా పాత రోజులను తలుచుకుని ఎప్పుడూ చాలా గొప్పగా ఫీలవుతుంటాం. గతం ఎప్పుడూ అందంగా, ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మనస్తత్వశాస్త్రం ప్రకారం, మనిషి మెదడుకు గతంలోని చేదు అనుభవాలన్నిటినీ వడపోసి, కేవలం మంచి జ్ఞాపకాలను(Memories )మాత్రమే పదే పదే గుర్తు చేసే ఒక వింత స్వభావం ఉంటుంది.

అయితే దీనివల్ల మనిషి ప్రస్తుతం తనకు ఎదురుగా ఉన్న అవకాశాలను గుర్తించకుండా, గడిచిపోయిన కాలం వైపు చూస్తూ నిట్టూరుస్తుంటాడు. ఈ స్థితిని నోస్టాల్జియా అంటారు. ఇది ఒక వ్యక్తి ఎదుగుదలకు కొన్నిసార్లు మానసిక అవరోధంగా మారుతుంది.

గతంలో గడిపిన జీవితం మీద అతిగా ప్రేమ పెంచుకోవడం వల్ల మనిషి ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న మార్పులను అంగీకరించడానికి నిరాకరిస్తుంటాడు. అప్పట్లో మనుషులంతా బాగుండేవారు, అప్పట్లో ఆహారం రుచిగా, ఆరోగ్యకరంగా ఉండేది వంటి ఆలోచనలు నిజమే అయినా అవి మనిషిని వెనక్కి లాగుతుంటాయి.

Memories

నిజానికి అప్పట్లో కూడా ప్రతీ ఒక్కరి జీవితంలో సమస్యలుండేవి. కానీ మెదడు వాటిని మరుగున పడేస్తుంది. దీనివల్ల ఇప్పుడున్న జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలు కూడా వారికి కొండంతలుగా కనిపిస్తాయి. అందుకే వర్తమానాన్ని ప్రేమించలేని వాడు భవిష్యత్తును ఏమాత్రం సరిగ్గా నిర్మించుకోలేడు.

ఈ మనస్తత్వం నుంచి బయటపడాలంటే, గతమనేది కేవలం ఒక పాఠం మాత్రమే అని ముందు గుర్తించాలి. జ్ఞాపకాలు ఎప్పుడూ కూడా మనకు ఓదార్పునివ్వాలి కానీ, అవే మన ప్రయాణానికి బేడీలు కాకూడదు. ఈ క్షణంలో మనం అనుభవిస్తున్న సౌకర్యాలతో పాటు, మనకున్న పరిచయాల విలువను కూడా గుర్తించినప్పుడే మనశ్శాంతి లభిస్తుంది.ఎప్పుడూ గతంలోనే జీవిస్తూ.. ఇప్పటి కాలాన్ని గతంతో పోల్చుకుంటూ కూర్చుంటే, రేపు ఈ రోజు కూడా ఒక అందమైన గతమే అయిపోతుందన్న విషయాన్ని గ్రహించాలి.

Modi : బంగారం కొనొద్దు..ప్రధాని మోదీ సంచలన పిలుపు

Exit mobile version