Just LifestyleLatest News

Projection : మనం ఎదుటివారిలో చూసే తప్పు.. మన మనసులోని అసంతృప్తికి అద్దం అట..

Projection : మనసు ఎప్పుడూ ఇతరుల ప్రవర్తనను గమనిస్తూ, వారిపై కోపాన్ని, అసూయను పెంచుకోవడం వల్ల బాడీలో స్ట్రెస్‌ను పెంచే హార్మోన్లు రిలీజవుతాయి.

Projection

మన చుట్టూ ఉన్నవారిలో కొంతమందికి ఎప్పుడూ ఇతరులలో లోపాలను, తప్పులను వెతకడమే పనిగా ఉంటుంది. ఎవరు ఏం చేసినా అందులో ఏదొక వంక పెట్టడం, ఎదుటివారి బలహీనతలను ఎత్తిచూపడం వీరికి అలవాటుగా మారుతుంది. ఈ విధమైన ప్రవర్తనను కేవలం ఒక సాధారణ అలవాటుగా కొట్టిపారేయలేమని మానసిక నిపుణులు అంటున్నారు.

సైకాలజీలో ప్రొజెక్షన్ (Projection) అనే ఒక థియరీ ఉంది. దీని ప్రకారం.. ఒక వ్యక్తి తనలో ఉన్న లోపాలను, అసంతృప్తిని కానీ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌ను కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడనప్పుడు ఆ లోపాలను ఎదుటివారిలో వెతకడానికి ట్రై చేస్తాడు.

అంటే తమను తాము తక్కువగా అంచనా వేసుకునేవారు కానీ జీవితంలో ఏదొక విషయంలో అసంతృప్తితో ఉన్నవారు కానీ ఇలా చేస్తారన్న మాట. ఆ నెగిటివిటీని పక్కవారిపై చూపిస్తారు. ఇతరుల తప్పులను ఎత్తిచూపడం ద్వారా తాము వారి కంటే గొప్పవారమనే ఒక అబద్ధపు గర్వాన్ని (False Superiority) వారు పొందుతారు. కానీ నిజానికి ఇది వారి ఇంటర్నల్ వీక్నెస్‌కు నిదర్శనం.

ఎప్పుడూ ఇతరుల తప్పుల మీదే దృష్టి పెట్టే వారి మైండ్ సెట్ చాలా నారోమైండ్‌గా మారుతుంది. మెదడు ఎప్పుడూ నెగిటివ్ విషయాలను వెతకడంలోనే బిజీగా ఉండటం వల్ల.. సొంతంగా ఎదగడానికి లేదా కొత్త విషయాలను నేర్చుకోవడానికి కావాల్సిన క్రియేటివిటీ (Creativity) నశిస్తుంది. దీనిని సైకాలజీలో కాగ్నిటివ్ బయాస్ (Cognitive Bias) అంటారు. అంటే వీరు ఎక్కడా కూడా మంచిని అస్సలు చూడలేరు. కేవలం చెడును మాత్రమే ఫిల్టర్ చేసి చూస్తారు.

ఈ అలవాటు వల్ల జరిగే మరో పెద్ద నష్టం ఏంటంటే.. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఖరికి లైఫ్ పార్ట్‌నర్ కూడా వీరికి దూరమవుతారు. ఎప్పుడూ తప్పులు పట్టే వ్యక్తితో మాట్లాడటానికి , టైం స్పెండ్ చేయడానికి ఎవరూ ఇష్టపడరు. మెల్లగా వీరి చుట్టూ ఉన్నవారంతా మెల్లగా డిస్‌కనెక్ట్ అయిపోతారు. బంధాలలో గౌరవం, నమ్మకం పోయి ఒంటరితనం మిగులుతుంది. ఎంత చెప్పినా వినకుండా ఇతరులను విమర్శించే వారిని సొసైటీ కూడా మెల్లగా దూరం పెడుతుంది.

Projection
Projection

ఇంకా చెప్పాలంటే ఇతరుల లోపాలను(Projection) వెతకడమనే అలవాటు ఉండటం వల్ల అవతలి వారి కంటే.. ఆ పని చేసే వారికే ఎక్కువ నష్టం కలుగుతుంది. మనసు ఎప్పుడూ ఇతరుల ప్రవర్తనను గమనిస్తూ, వారిపై కోపాన్ని, అసూయను పెంచుకోవడం వల్ల బాడీలో స్ట్రెస్‌ను పెంచే హార్మోన్లు రిలీజవుతాయి. దీనివల్ల ప్రశాంతత కరవై, నిద్రలేమి, బీపీ , డిప్రెషన్ (Depression) వచ్చే ప్రమాదం ఉంది.

ఈ మెంటల్ స్థితి నుంచి బయటపడాలంటే మొదట మైండ్‌ఫుల్‌నెస్ (Mindfulness) అలవాటు చేసుకోవాలి. అంటే, మన దృష్టిని ఇతరుల నుంచి మళ్లించి మన సొంత ఆలోచనలపై పెట్టాలి. ఇతరులలోని మంచిని అభినందించడం (Appreciation) అలవాటు చేసుకుంటే, మనసు ప్రశాంతంగా మారడమే కాకుండా లైఫ్‌పై పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది.

Jack Fruit : పనస గింజల్లో దాగున్న పోషకాల సామ్రాజ్యం.. ఆ వ్యాధులకు చెక్ పెట్టే సూపర్ ఫుడ్

Related Articles

Back to top button