HealthLatest News

Ebola Virus : కాంగోను వణికిస్తున్న కొత్త ఎబోలా.. ఇండియాకు ఎఫెక్ట్ ఉందా ?

Ebola Virus : ఎబోలా వ్యాధి లక్షణాలు ఆలస్యంగా బయటపడటం, మొదట్లో మలేరియా అని టైఫాయిడ్‌ అని పొరబడటంతో చాలామంది ప్రాణాలు పోతున్నాయి.

Ebola Virus

మధ్య ఆఫ్రికా దేశం అయిన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను కొత్త ఎబోలా తీవ్రంగా వణికిస్తోంది. కాంగో ప్రభుత్వం రిలీజ్ చేసిన అఫీషియల్ అంచనాల ప్రకారం ఇప్పటివరకు 4,381 కేసులు నమోదు కాగా.. ఏకంగా 2,011 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 704 మంది బాధితులు ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

ఎబోలా మే 15న ఈ మహమ్మారి వ్యాప్తి చెందిందని కాంగో ప్రభుత్వం ప్రకటించినా, ఫిబ్రవరి నుంచే ఇది సైలెంట్‌గా వ్యాపిస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. మొదటి 1000 మంది మరణాల గురించి నమోదు కావడానికి 9 వారాలు పడితే, ఆ తర్వాత వైరస్ విశ్వరూపానికి కేవలం 3 వారాల్లోనే మరో 1000 మంది బలయ్యారు. 2014-16 నాటి పశ్చిమ ఆఫ్రికా విజృంభణ తర్వాత హిస్టరీలోనే ఇది రెండో అతిపెద్ద ఎబోలా సంక్షోభంగా నిలిచింది.

ఈసారి వ్యాపిస్తున్న రకం బుండిబుగ్యో అనే చాలా అరుదైన ఎబోలా. దీనికి ఎలాంటి టీకాలు కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో లేకపోవడమే అతిపెద్ద సమస్యగా మారింది. పాత ఎబోలా టీకాలు కానీ ఆ మందులు కానీ దీనిపై ఏమాత్రం పనిచేయడం లేదు.

ప్రస్తుతం ఇతురి ప్రాంతంలో క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నారు. ఎబోలా వ్యాధి లక్షణాలు ఆలస్యంగా బయటపడటం, మొదట్లో మలేరియా అని టైఫాయిడ్‌ అని పొరబడటంతో చాలామంది ప్రాణాలు పోతున్నాయి. దీనివల్ల మరణాల రేటు ఏకంగా 45.9 శాతానికి చేరింది.

తూర్పు కాంగోలో కంటెన్యూగా జరిగే తిరుగుబాటుదారుల ఘర్షణలు, హెల్త్ వర్కర్ల నిరసనలు, సిగ్నల్స్ లేకపోవడం వంటివి ఈ వైరస్ అడ్డుకట్టకు అడ్డంకిగా మారాయి. ఇదే సమయంలో తామంతా వైరస్ వెనక పరుగెడుతున్నామని.. కానీ వైరస్ అందరి కంటే కూబా చాలా వేగంగా ముందుకెళ్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు మరింత టెన్షన్ పుట్టిస్తుంది.

Ebola Virus
Ebola Virus

కాంగోలో ఎబోలా వైరస్(Ebola Virus) విజృంభించడం ఇది 17వ సారి అయినా సరే.. ఇంత భయంకర పరిస్థితి రావడం ఇదే తొలిసారి. ఇక ఇండియాకు ఈ మహమ్మారి వ్యాపించే ప్రమాదం ఉందా అంటే.. ప్రస్తుతం డైరెక్టుగా మన దేశానికి వచ్చే ముప్పు చాలా తక్కువగానే ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎబోలా అనేది కరోనా వైరస్ లాగా గాలి ద్వారా వ్యాపించదు. కేవలం బాధితుల బాడీలోని ద్రవాలను డైరెక్టుగా తాకినప్పుడు మాత్రమే ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆఫ్రికా ప్రయాణికులపై ఎయిర్‌పోర్టుల్లో భారత ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.

ఇండియాలో ఈ కేసులు లేకపోయినా, కాంగోలో మరణాల రేటు ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మన దేశపు హెల్త్ డిపార్ట్‌మెంట్ అప్రమత్తంగా ఉంది.

Apple Pay : ఇండియాలోకి యాపిల్ పే ఎంట్రీ..కానీ చిన్న ట్విస్ట్ ఉందట..

Related Articles

Back to top button