Just LifestyleLatest News

Re-Connect Old Bonds : కట్ అయిన పాత బంధాలను రీ-కనెక్ట్ చేసుకోవాలా? ఈ 5 బెస్ట్ రూట్స్ ఫాలో అవ్వండి..

Re-Connect Old Bonds : చిన్నప్పుడు ఆటలే మనందరినీ స్నేహితులుగా మార్చాయి. పెద్దయ్యాక కూడా కొందరిలో అది ఏమాత్రం మారదని సైకాలజిస్టులు అంటున్నారు.

Re-Connect Old Bonds

పెద్దయ్యాక కొత్త ఫ్రెండ్స్‌ను సంపాదించుకోవడం ఎంత కష్టమో.. దూరమైపోయిన పాత ఫ్రెండ్స్‌ను, రిలేటివ్స్‌ను మళ్లీ పలకరించి వాళ్లతో రీ కనెక్ట్(Re-Connect Old Bonds) అవ్వడం అంతకంటే పెద్ద టాస్క్. ఇన్నాళ్ల తర్వాత మెసేజ్ చేస్తే ఏమనుకుంటారో.. నాకు ఆ రెస్పాన్స్ రాకపోతే పరిస్థితి ఏంటనే అనుమానం, మొహమాటం వెనక్కి నెట్టేస్తుంటాయి.

అయితే పాత ఫ్రెండ్షిప్‌ను మళ్లీ చిగురింపజేయడం వల్ల మనలో కాన్ఫిడెన్స్ పెరగడమే కాకుండా, మన చుట్టూ ఉన్నవాళ్లకు కూడా కొండంత మానసిక కొండంత అండ లభిస్తుందని సైకాలజిస్టులు (Psychologists) చెబుతున్నారు. ఇన్నాళ్లుగా దూరమైన వారిని మళ్లీ మన లైఫ్‌లోకి వెల్కమ్ చెప్పడానికి, ఆ గ్యాప్‌ను భర్తీ చేయడానికి సైకాలజీ కొన్ని అద్భుతమైన మార్గాలను సూచిస్తోంది.

పాత రిలేషన్‌ను మళ్లీ స్ట్రాంగ్‌గా మార్చుకోవడానికి(Re-Connect Old Bonds) ఉపయోగపడే ఆ 5 సులువైన మార్గాలను సైకాలజిస్టులు చెబుతున్నారు. మనందరికీ బాధ్యతలు, ఆఫీస్ ప్రెజర్స్ పెరిగేకొద్దీ మనుషుల్లో సరదాలు , సంతోషాలు అనేవి తగ్గిపోతాయి. చిన్నప్పుడు ఆటలే మనందరినీ స్నేహితులుగా మార్చాయి. పెద్దయ్యాక కూడా కొందరిలో అది ఏమాత్రం మారదని సైకాలజిస్టులు అంటున్నారు.

అందుకే వారిని మళ్లీ కలిసినపుడు బోరింగ్ అండ్ సీరియస్ కాన్వర్సేషన్స్ కాకుండా.. ఒక బోర్డ్ గేమ్ ఆడటం, నచ్చిన స్పోర్ట్ ఆడటం, లేదంటే ఆ ఆటల గురించి మాట్లాడటం చేస్తే ఇద్దరి మధ్య ప్రెజర్ తగ్గిపోయి ఈజీగా కనెక్ట్ అవుతారు. ఒక పనిని కలిసి సరదాగా ఎంజాయ్ చేయడం వల్ల పాత ఫ్రెండ్షిప్ త్వరగా రీఫ్రెష్ అవుతుంది.

అంతేకాదు ఇద్దరి మధ్య కామన్ ఇంట్రెస్ట్ ,హాబీలు ఉండటం స్నేహానికి ఎప్పుడూ కూడా అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇద్దరికీ నచ్చే ఏదైనా ఒక టాపిక్ ద్వారా వారి సంభాషణను రీ-స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్లకున్న ఆసక్తులు మీతో మ్యాచ్ అవ్వకపోతే.. వాళ్లకు నచ్చే విషయాల పట్ల మీరు ఇంట్రస్ట్ చూపించండి. తమకు నచ్చిన విషయాలను మీరు కూడా గౌరవిస్తున్నారని వారికి అనిపించినప్పుడు మీతో చాలా క్లోజ్‌గా ఫీలవుతారు.

ఒక నిజాయితీతో కూడిన అప్రిసియేషన్ లేదా ఒక చిన్న థాట్‌ఫుల్ హెల్ప్ దెబ్బతిన్న రిలేషన్‌షిప్‌ను కూడా నయం చేస్తుంది. మనం చూపించే చిన్నపాటి కేరింగ్ ఎదుటివారిని మన దగ్గర సేఫ్‌ అనే ఫీల్ కలిగేలా చేస్తుంది. అయితే ప్రతిసారీ అవతలి నుంచి కూడా అదే ప్రేమ, రెస్పాన్స్ మీకు దొరకకపోవచ్చు. కానీ ఆప్యాయంగా ఉండటం వల్ల పాత ఫ్రెండ్షిప్ మళ్లీ చిగురించడానికి ఒక మంచి అవకాశంగా మారుతుంది.

Re-Connect Old Bonds
Re-Connect Old Bonds

అయితే ఇదే సమయంలో మన ఎనర్జీని, మానసిక ప్రశాంతతను దారుణంగా పిండేసే వ్యక్తులను ఎప్పుడైనా గతంలో మీరు దూరం పెడితే వారిని మాత్రం ఎప్పటికీ దగ్గరకు తీసుకోవద్దు. అలాంటి వారి వల్ల మంచివాళ్లకు కేటాయించే టైమ్ అండ్ ఎనర్జీ మనకు లేకుండా పోతుంది. మీ బౌండరీస్‌ (Boundaries)ను పదే పదే దాటుతూ మిమ్మల్ని గౌరవించని వ్యక్తులకు కాస్త దూరం జరగడం ఎప్పుడూ కూడా మంచిదే. దీనివల్ల మీకు నిజంగా మీకు వ్యాల్యూ ఇచ్చే పాత, కొత్త మిత్రులకు లైఫ్‌లో స్పేస్ ఇచ్చినట్లవుతుంది.

అండ్ లాస్ట్ రూల్ వినడానికి చాలా సింపుల్‌గా కనిపించినా.. ఈ రోజుల్లో చాలామంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే అంటారు మానసిక నిపుణులు. ఒక పాత ఫ్రెండ్‌తోనో, రిలేటివ్‌తోనో మాట్లాడేటప్పుడు మైండ్ వేరే ఎక్కడో పెట్టినట్లు మాట్లాడకుండా.. ఆ క్షణంలో పూర్తిగా అక్కడ ఉండటం (Be Present) అనేది చాలా మంచి అలవాటు. వాళ్లు చెప్పేది క్యూరియాసిటీగా వినడం, వాళ్ల ప్రాధాన్యతలకు వ్యాల్యూ ఇవ్వడం ద్వారా ఎంత పెద్ద గ్యాప్ అయినా సరే చిటికెలో మాయమైపోవడం గ్యారంటీ.

Appreciation : మనసులోని మెచ్చుకోలును దాచుకోకండి..ఎదుటివారిలో కాన్ఫిడెన్స్ నింపండి..

Related Articles

Back to top button