Just LifestyleLatest News

Relationship-Killing Traits : మీ పార్ట్‌నర్‌లో ఈ లక్షణాలున్నాయా? .. రిలేషన్ షిప్‌ను మెల్లగా చంపేసే సైలెంట్ కిల్లర్స్ ఇవే..

Relationship-Killing Traits : పార్ట్‌నర్ కావాలనే మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నా, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తున్నా, మీకు గౌరవం ఇవ్వకపోయినా.. ఆ బంధం ప్రమాదంలో పడిందనే అర్థం.

Relationship-Killing Traits

ప్రేమ, పెళ్లి బంధం ఇలా ఏదైనా సరే సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను ఇవ్వాలి. కానీ కొందరితో ఉన్నప్పుడు ప్రతిరోజూ ఒక యుద్ధంలా, ప్రతీ రోజూ టెన్షన్‌గానే అనిపిస్తుంటుంది. పార్ట్‌నర్ కావాలనే మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నా, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తున్నా, మీకు గౌరవం ఇవ్వకపోయినా.. ఆ బంధం ప్రమాదంలో పడిందనే(Relationship-Killing Traits) అర్థం. అలా పార్ట్‌నర్‌ ప్రవర్తనలో కనిపించే కొన్ని డేంజర్ సిగ్నల్స్ ద్వారా ఆ ప్రమాదాన్ని ముందే గ్రహించొచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు.

గ్యాస్‌లైటింగ్ (Gaslighting).. మీకు తెలీకుండానే మిమ్మల్ని తప్పుదోవ పట్టించడం, ప్రతి చిన్న విషయానికి మీదే తప్పని నమ్మించడం వంటివి చేస్తారు. మీరు సరిగ్గా ఉన్నా, మీ ప్రవర్తనలో ఏదో లోపం ఉందని చెప్తూ మిమ్మల్ని మానసికంగా బలహీనులను చేసేస్తారు. చివరికి వారిపైనే మీరు పూర్తిగా డిపెండ్ అయ్యేలా కంట్రోల్ సాధిస్తారు.

విలువ ఇవ్వకపోవడం, సమయం కేటాయించకపోవడం.. రిలేషన్‌లో అన్నిటికంటే విలువైనది టైమ్. ఎంత చెప్పినా మీతో క్వాలిటీ టైమ్ గడపడానికి ఇష్టపడరు. బయట పనులకు ఇచ్చిన ఇంపార్టెన్స్ మీకు ఇవ్వరు. ఇతరులకు ఇచ్చిన ప్రయారిటీ మీకు ఇవ్వరు. మీ ఆవేదనకు గుర్తింపు ఉండదు. రానురాను గౌరవం, ప్రాధాన్యత లేకుండా చేసి తమ మధ్య బంధం భారంగా మారిపోయేలా చేస్తారు.

మారతానని పదే పదే చెప్పి మారకపోవడం.. సారీ చెప్పడం,ఇకపై నేను మారతానని ప్రామిస్‌లు చేయడం, మళ్లీ కొన్ని రోజులకే పాత ప్రవర్తనను రిపీట్ చేయడం వీరికి కామన్. మాట ఇచ్చి నిలబెట్టుకోలేరు. బంధంలో నమ్మకాన్ని పూర్తిగా తుడిచిపెట్టేలా ప్రవర్తిస్తారు.

అబద్ధాలు అలాగే అనవసర కోపాలు.. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈజీగా అబద్ధాలు చెప్పేయడం వీరికి అలవాటు. చిన్న చిన్న విషయాలకే విపరీతంగా చిరాకు పడిపోవడం, అరవడం, కోపంతో ఊగిపోవడం ద్వారా మిమ్మల్ని టెన్షన్‌ పెట్టేస్తారు.

సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీయడం.. మీరు ఏం చేసినా వారు తప్పుగానే కౌంట్ చేస్తారు. మీరు సాధించిన విజయాలను చిన్నచూపు చూడటం, ప్రతి విషయంలోనూ మీపై అసూయ పెంచుకోవడం చేస్తారు. టోటల్‌గా మీరు దేనికీ పనికిరారనే ఫీలింగ్‌ను మీ మనసులో నాటడమే వీరి ముఖ్య ఉద్దేశం అన్నట్లుగా ప్రవర్తిస్తారు.

Relationship-Killing Traits
Relationship-Killing Traits

రాజీపడని మైండ్‌సెట్, నిర్లక్ష్యం.. ఒక హెల్దీ రిలేషన్‌లో సర్దుకుపోవడమనేది(Relationship-Killing Traits) ఉంటుంది. కానీ ఏ విషయంలోనూ వీరు రాజీపడరు. తమ మాటే చెల్లుబాటు కావాలనుకుంటారు. ప్రారంభంలో ఎంతో ప్రేమను కురిపించి, మెల్లమెల్లగా మిమ్మల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, మీ కాల్స్ లేదా మెసేజ్‌లకు స్పందించకపోవడం వంటివి చేస్తారు.

అనుమానం, ఫ్రెండ్స్ సర్కిల్ లేకపోవడం.. చిన్న చిన్న విషయాలకు అనుమానించడం, మీ ఫోన్ చాట్‌లను, మాటలను చాటుగా చూడటం, మీ స్వేచ్ఛను హరించడం చేస్తారు. ఇలాంటి వారికి చుట్టాలు సర్కిల్ తప్ప.. బయట సరియైన ఫ్రెండ్స్ ఉండరు. కనీసం ఒక్క మంచి స్నేహితుడు కూడా లేని వ్యక్తిత్వంతో ఉంటారు.

Japanese Ma Theory : ఎప్పుడూ కలిసి ఉండటమే కాదు..బంధం గట్టిపడాలంటే చిన్న దూరం కూడా అవసరమేనట..

Related Articles

Back to top button