Just LifestyleLatest News

Scuba Diving : అండర్ వాటర్ టూరిజం క్రేజ్.. ఇండియాలో స్కూబా డైవింగ్‌కు బెస్ట్ ప్లేసెస్ ఇవే

Scuba Diving : లైఫ్‌లో చాలామంది ఒక కొత్త థ్రిల్, అడ్వెంచర్ కావాలనుకుంటున్నారు. ఇలాంటి వారంతా ఇప్పుడు అండర్ వాటర్ టూరిజం స్కూబా డైవింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

Scuba Diving

ఈమధ్య కాలంలో టూరిజం స్టైల్ పూర్తిగా మారిపోయింది. చల్లని హిల్ స్టేషన్లను చూసేయడం, బీచ్ ఒడ్డున కూర్చుని ఫోటోలు దిగడం, ట్రెక్కింగ్‌లో సాహసాలు చేయడం లాంటి పద్ధతులకు యువత గుడ్ బై చెప్పేస్తోంది.

లైఫ్‌లో ఒక కొత్త థ్రిల్, అడ్వెంచర్ కావాలనుకుంటున్నారు. ఇలాంటి వారంతా ఇప్పుడు అండర్ వాటర్ టూరిజం వైపు మొగ్గు చూపుతున్నారు. సముద్రం అడుగున దాగున్న అందమైన నిశ్శబ్ద ప్రపంచాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి, అక్కడి వింత జీవరాశులు, కలర్‌ఫుల్ పగడపు దీవులను (Coral Reefs) చూడటానికి స్కూబా డైవింగ్(Scuba Diving) వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అయితే అదృష్టం కొద్దీ ఈ అద్భుతమైన ఫీలింగ్‌ను ఓన్ చేసుకోవడానికి..విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం వీరికి ప్లస్ అవుతోంది. . ఇండియాలోనే స్కూబా డైవింగ్‌(Scuba Diving)కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బెస్ట్ ప్లేసెస్ ఏంటో వెతుకుతూ ఎంజాయ్ చేసేస్తున్నారు.

Andaman and Nicobar Islands
 

భారత దేశంలో అండర్ వాటర్ టూరిజం పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే ఫస్ట్ పేరు అండమాన్ నికోబార్ దీవులు. ఇక్కడి సీ వాటర్ ఎంత క్లియర్ గా ఉంటుందంటే.. నీటి అడుగున ఉండే వాటర్ వరల్డ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా హావ్‌లాక్ ఐలాండ్, నీల్ ఐలాండ్ లాంటి ప్రాంతాలు స్కూబా డైవింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్.

Andaman and Nicobar Islands
Andaman and Nicobar Islands

ఇక్కడ సముద్ర గర్భంలోకి వెళ్లినప్పుడు చుట్టూ తిరిగే రంగురంగుల చేపలు, అరుదైన సముద్ర జీవులను చూస్తుంటే ఏదో సరి కొత్త లోకంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ నిపుణులైన గైడ్‌ల పర్యవేక్షణలోనే స్కూబా డైవింగ్ ఉంటుంది కాబట్టి ఈత రాని వాళ్లు కూడా ఎలాంటి డౌట్ లేకుండా నీటి అడుగున ఎంజాయ్ చేయవచ్చు.

Andaman and Nicobar Islands
Andaman and Nicobar Islands
Lakshadweep
 

ఇక నేచర్ లవర్స్‌కు మరొక స్వర్గధామం లక్షద్వీప్ పేరు చెప్పొచ్చు. స్వచ్ఛమైన ఇసుక తిన్నెలు, బ్లూ కలర్ నీటితో ఉండే ఈ దీవులు అండర్ వాటర్ అడ్వెంచర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాయి. ముఖ్యంగా బంగారమ్, అగత్తి దీవులలో స్కూబా డైవింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది.

Lakshadweep
Lakshadweep

లక్షద్వీప్ సముద్రం అడుగున ఉండే పగడపు తోటలు టూరిస్టులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాయి. తక్కువ లోతులోనే అద్భుతమైన సముద్ర జీవరాశులెన్నిటినో చూసే అవకాశం ఉండటం వల్ల ఇక్కడికి వచ్చే పర్యాటకులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ప్రశాంతమైన వెదర్‌లో అండర్ వాటర్ లైఫ్‌ను ఎక్స్‌ప్లోర్ చేయాలనుకునే వారికి లక్షద్వీప్ బెస్ట్ ఛాయిస్.

Lakshadweep
Lakshadweep

Murudeshwara – Netrani Island

ఈ రెండు కాకుండా చాలా మందికి తెలీని మరొక అద్భుతమైన ప్లేస్ కర్ణాటకలోని నేత్రాణి దీవి. మురుడేశ్వర్ తీరానికి కొద్ది దూరంలో ఉండే ఈ చిన్న దీవిని హార్ట్ షేప్డ్ ఐలాండ్ అంటేగుండె ఆకారపు దీవి అని కూడా పిలుస్తారు. దీనిని భారత్‌లోనే బెస్ట్ డైవింగ్ స్పాట్స్‌లో ఒకటిగా గుర్తిస్తారు.

Murudeshwara - Netrani Island
Murudeshwara – Netrani Island

ఇక్కడి నీళ్లు చాలా ప్రశాంతంగా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండటం వల్ల సముద్రం లోపల ఉండే అరుదైన తిమింగలాలతో పాటు పగడాలు , రకరకాల మెరైన్ లైఫ్‌ను చాలా దగ్గరగా చూడొచ్చు. సౌత్ ఇండియాలోనే ఉండటం వల్ల వీకెండ్స్‌లో అడ్వెంచర్ ప్లాన్ చేసే వారికి నేత్రాణి దీవి ఒక క్రేజీ స్పాట్‌గా మారిపోయింది.

Murudeshwara - Netrani Island
Murudeshwara – Netrani Island

మొత్తంగా రొటీన్ ట్రిప్స్‌కు కాస్త డిఫరెంట్‌గా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకునేవారు..ఈ అండర్ వాటర్ టూరిజం ప్లాన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. నీటి లోపల ఉండే ఆ నిశ్శబ్దం, ఆ న్యూ వరల్డ్ జీవితాంతం గుర్తుండిపోయే ఒక గొప్ప జ్ఞాపకాలను అందిస్తాయి.

Numerology : ఆకర్షణ, అందం, సంపదకు కేరాఫ్ అడ్రస్ ..నెంబర్ 6 ఉన్నవారు నిజంగానే అదృష్టవంతులా?

Related Articles

Back to top button