Just LifestyleLatest News

Self Love And Selfishness : సెల్ఫ్ లవ్ , సెల్ఫిష్‌నెస్ మధ్య సన్నని గీత.. మనుషుల్లో పెరుగుతుంది

Self Love And Selfishness : సెల్ఫ్ లవ్ , సెల్ఫిష్‌నెస్ రెండూ బయటకు ఒకేలా కనిపించినా, వాటి వెనుకున్న ఉద్దేశం (Intent) , మైండ్‌సెట్‌ పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటాయి. సెల్ఫ్ లవ్ అనేది ఒక వ్యక్తి తనను తాను గౌరవించుకోవడానికి, తన మెంటల్ అండ్ ఫిజికల్ బౌండరీస్‌ (Boundaries)ను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుం

Self Love And Selfishness

నిన్ను నువ్వు ప్రేమించుకో (self love), నీకు నువ్వే ఇంపార్టెంట్ అనే మాటలు ఈరోజుల్లో ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్నాయి. ప్రశాంతమైన జీవితానికి, మనశ్శాంతికి మనల్ని మనం లవ్ చేసుకోవడం చాలా అవసరమని సైకాలజిస్టులు కూడా చెబుతున్నారు.

ఈ ప్రాసెస్‌లోనే చాలామంది తమకు తెలీకుండానే పెద్ద గందరగోళానికి గురవుతున్నారా అనేలా ప్రవర్తిస్తున్నారు. నా ఇష్టం, నా ప్రశాంతత, నా నిర్ణయం అని అనుకుంటూ.. కొంతమంది సెల్ఫ్ లవ్ పేరుతో ఓవర్ సెల్ఫిష్ (Selfishness)గా మారిపోతున్నారు. నిజమైన సెల్ఫ్ లవ్‌కి, హానికరమైన స్వార్థానికి మధ్య ఉన్న చిన్న గీతను అర్ధం చేసుకోలేకపోతున్నారు.

సైకాలజీ చెబుతున్నదాని ప్రకారం, సెల్ఫ్ లవ్ , సెల్ఫిష్‌నెస్(Self Love And Selfishness) రెండూ బయటకు ఒకేలా కనిపించినా, వాటి వెనుకున్న ఉద్దేశం (Intent) , మైండ్‌సెట్‌ పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటాయి. సెల్ఫ్ లవ్ అనేది ఒక వ్యక్తి తనను తాను గౌరవించుకోవడానికి, తన మెంటల్ అండ్ ఫిజికల్ బౌండరీస్‌ (Boundaries)ను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని వల్ల ఇతరులకు ఎలాంటి హాని ఉండదు.

కానీ స్వార్థం అనేది మాత్రం కేవలం నాకు మేలు జరిగితే సరిపోతుంది, ఇతరులు ఏమైపోయినా పర్లేదనే ఒక రకమైన నార్సిసిస్టిక్ (Narcissistic) ధోరణి నుంచి పుడుతుంది. సైకాలజీ పరంగా ఈ రెండింటి మధ్య ఉన్న మెయిన్ తేడాలను అర్థం చేసుకుంటే ఎవరు సెల్ఫిష్‌గా ఉంటున్నారు, ఎవరు సెల్ఫ్ లవ్‌తో ఉంటున్నారో క్లియర్‌గా తెలుసుకోవచ్చు.

ఈ తేడాలలో మొదటిది, ఇతరుల పట్ల సానుభూతి (Empathy)తో ఉండటం. సెల్ఫ్ లవ్ ఉన్న వ్యక్తి తనను తాను ఎంతగా ప్రేమిస్తాడో, ఇతరుల భావాలను, బాధలను, ఇబ్బందుల గురించి కూడా అంతే ఆలోచిస్తాడు. కానీ స్వార్థపరుడు తన సంతోషం కోసం మాత్రమే ఆలోచించి ఇతరుల ఫీలింగ్స్‌ను తొక్కిపడేస్తాడు. తనకు మూడ్ లేదని చెప్పడం, తన హ్యాపీనెస్ కోసం ఇతరుల సమయాన్ని వృధా చేయడం వంటివి ఈజీగా చేస్తాడు.

దీనిలో రెండోది బౌండరీస్ . సెల్ఫ్ లవ్ అనేది నేను నన్ను రక్షించుకోవడానికి ఈ గీత గీసుకుంటున్నానని చెబుతుంది. స్వార్థం అనేది నా స్వార్థం కోసం నిన్ను నా కంట్రోల్‌లోకి తెచ్చుకుంటాను, నీ సమయాన్ని వాడుకుంటానని అంటుంది. సెల్ఫ్ లవ్ ఉన్నవారు ఇతరులకు నో (NO) చెబుతారు. అదే సమయంలో ఇతరులు చెప్పే నో ..ని కూడా వీరు గౌరవిస్తారు. కానీ స్వార్థపరులు తమకు ఎవరైనా నో చెబితే తట్టుకోలేరు.

ఇక మూడోది అండ్ ముఖ్యమైనది వారి మైండ్‌సెట్. నిజమైన సెల్ఫ్ లవ్ ఉన్న వ్యక్తి నేను బాగుండాలి, నా చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలని కోరుకుంటాడు. ఇది ‘విన్-విన్’ (Win-Win) మైండ్‌సెట్. కానీ ఓవర్ సెల్ఫిష్ పర్సనాలిటీ ఉన్నవారు నేను మాత్రమే బాగుండాలి, ఇతరులు ఓడిపోయినా పర్లేదనే ఫీలింగ్‌తో ఉంటారు.

Self Love And Selfishness
Self Love And Selfishness

అందుకే ఇలాంటి వారు మీతో ఉంటే కనుక..ఇకపై వారి ప్రతీ అవసరానికి వెంటనే అందుబాటులో ఉండటాన్ని ఆపేయండి. నా సమయం, నా పని కూడా విలువైనవేనని క్లియర్‌గా చెప్పడం అలవాటు చేసుకోండి. అలాగే వారు మీకు నచ్చని పనులను చేసినపుడు వాటిని మొహమాటం లేకుండా వారి దృష్టికి తీసుకువెళ్లండి.

నిజానికి మనలోని లోపాలను, పొరపాట్లను ఓపెన్‌గా ఒప్పుకుంటూ, మనల్ని మనం రోజూ మెరుగుపరుచుకుంటే మనలో స్వార్ధం అనే ఆలోచన రాదు. కాబట్టి మిమ్మల్ని మీరు చాలా ఎక్కువగా ప్రేమించుకోండి.. కానీ ఆ ప్రేమ ఎదుటివారిని ఇబ్బంది పెట్టేలా, గాయం చేసేంత స్వార్థంగా మారకుండా మాత్రం చూసుకోండి.

Moringa Powder : ప్రకృతి ప్రసాదించిన న్యూట్రిషన్ పవర్‌హౌస్ ..సూపర్ ఫుడ్‌గా మునగాకుల పొడి

Related Articles

Back to top button