Just LifestyleLatest News

RSD : ఒకరు నో చెప్తే నరకం కనిపిస్తుందా?..విమర్శలను అస్సలు తట్టుకోలేని RSD మనస్తత్వం..

RSD : ఆర్ఎస్డీ అంటే సింపుల్‌గా.. ఎదుటివారి నుంచి వచ్చే విమర్శలను, తిరస్కరణను మనిషి మెదడు తట్టుకోలేకపోవడమే.

RSD

మనం డైలీ లైఫ్‌లో ఎంతో మందిని చూస్తుంటాం. కొందరిని ఎవరైనా ఎంత విమర్శించినా, నవ్వుతూ లైట్ తీసుకుంటారు. కానీ మరికొందరు మాత్రం చాలా సెన్సిటివ్‌గా రియాక్టవుతారు. ఎవరైనా వారితో కాస్త సీరియస్‌గా మాట్లాడినా, వేరే వాళ్లతో పోల్చినా, చివరకు చిన్న జోక్ వేసినా సరే అస్సలు భరించలేరు.

అంతేకాదు ఒకరు నో చెప్పినప్పుడు కలిగే ఆ తిరస్కరణ (Rejection) భారాన్ని తట్టుకోలేక.. గుండెను ఎవరో గట్టిగా పిండేసినట్లుగా ఫీల్ అవుతారు. ఇది కేవలం అతిగా ఆలోచించడం వల్ల వచ్చే బాధ కాదు, దీని వెనుక రిజెక్షన్ సెన్సిటివ్ డిస్ఫోరియా (RSD) అనే మానసిక స్థితి దాగి ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఆర్ఎస్డీ అంటే సింపుల్‌గా.. ఎదుటివారి నుంచి వచ్చే విమర్శలను, తిరస్కరణను మనిషి మెదడు తట్టుకోలేకపోవడమే. సాధారణంగా ఎవరైనా మనల్ని వద్దని రిజెక్ట్ చేస్తే కొద్దిగా బాధపడటం కామనే. కానీ ఈ ఆర్ఎస్డీ ఉన్నవారిలో మాత్రం ఆ బాధ వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది.

అది ఎంత ఎక్కువగా ఉంటుందంటే.. ఊపిరి ఆడనట్లు అవ్వడం, ఛాతీ బిగుసుకుపోవడం, గుండె స్పీడ్‌గా కొట్టుకోవడం వంటి శారీరక ఇబ్బందులు కూడా వీరిలో స్టార్టవుతాయి.

మానసిక నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. ఒకే విషయంపై దృష్టి పెట్టలేకపోయే అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) అనే లోపం ఉన్న వారిలోనే.. ఈ ఆర్ఎస్డీ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే దీనిని ఒక జబ్బుగా మెడికల్ బుక్స్‌లో ఇంకా ఎంటర్ చేయలేదు. కాబట్టి దీనికి స్పెషల్‌గా మందులు ఉండవు.

వీరెప్పుడూ కూడా ఒక భయంతో బతుకుతుంటారు. తమకు ఎక్కడైనా అవమానం జరుగుతుందేమో లేదా ఎవరైనా తమ తప్పులను ఎత్తి చూపిస్తారేమో అనే ఆందోళన వీరిలో ఉంటుంది. దీనివల్లే వీరు ఏ పనైనా ప్రారంభించడానికి ముందే భయపడి వెనుకడుగు వేస్తారు.

RSD
RSD

ఒకవేళ ఏదైనా పని స్టార్ట్ చేస్తే.. అందులో చిన్న పొరపాటు కూడా ఉండకూడదని, అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలని (Perfectionism) విపరీతమైన ఒత్తిడి పెంచేసుకుంటారు. అలాగే చుట్టుపక్కల వారెక్కడ తమను దూరం పెడతారోనని.. ఎప్పుడూ ఇతరులను సంతోషపెట్టడానికే (People Pleasing) ఇంపార్టెన్స్ ఇస్తారు.

ఈ భయం వల్ల వీరు సొసైటీకి, నలుగురికి దూరంగా జరిగిపోతారు. కొత్తగా ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయరు. ఆఖరికి తమకు మంచి టాలెంట్ ఉండి, కెరీర్‌లో ఎదిగే ఛాన్స్ వచ్చినా సరే.. ఇంటర్వ్యూలలో ఎక్కడ తమను రిజెక్ట్ చేస్తారో అనే భయంతో ఆ ఉద్యోగాల జోలికే వెళ్లరు. దీనివల్ల వీరు జీవితంలో ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది.

RSD
RSD

కాబట్టి, చిన్న చిన్న విషయాలకే అతిగా బాధపడిపోవడం, చిరు విమర్శలను కూడా తేలికగా తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు మీలో కానీ, మీకు తెలిసిన వారిలో కానీ ఉంటే మాత్రం.. దానిని నిర్లక్ష్యం చేయకండి. ఇది వారి మనస్సుకు సంబంధించిన సమస్య అని గుర్తించాలి.

వీరి విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌లను సంప్రదించడం చాలా మంచిది. వారు ఇచ్చే కౌన్సెలింగ్ , కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) వంటి పద్ధతుల ద్వారా ఈ ఆలోచనా విధానాన్ని మార్చుకుని, సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు.

Date Of Birth : మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ రోజు ఎలా ఉంది? ఆ రెండు నెంబర్ల వారికి డబ్బే డబ్బు అట..

Related Articles

Back to top button