Just LifestyleLatest News

Silent Treatment : మాట్లాడకుండా ఇచ్చే సైలెంట్ ట్రీట్మెంట్..మీ భాగస్వామిలోనూ ఇది కన్పిస్తుందా?

Silent Treatment : ఎంత చెప్పినా ప్రయోజనం లేదు కాబట్టి తన బాధను తనే భరిస్తాననే నిరాశ.. బంధంలో ఎదురైనప్పుడు మనుషులు సైలెంట్ ట్రీట్మెంట్ అనే స్థితికి చేరుకుంటారు.

Silent Treatment

మీ ఇంట్లో వాళ్లకో, మీ ఫ్రెండ్‌కో, లేక మీ పార్ట్‌నర్‌కో చాలా సార్లు కోపం తెప్పిస్తూ ఉంటారు. దీంతో మీ ఇద్దరి మధ్య కాసేపు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అయితే కొంతమంది మాత్రం మీతో గొడవ పడరు, అరవరు, కనీసం కోపం వచ్చినట్లు కూడా చెప్పరు. మీ వైపు చూడరు, మిమ్మల్ని అస్సలు పట్టించుకోరు. మీరు అడిగిన ప్రశ్నలకు కూడా ఊ, ఆ అంటూ ఒకే ఒక్క ముక్కలో సమాధానమిస్తుంటారు.

సైకాలజీలో దీనిని సైలెంట్ ట్రీట్మెంట్ (Silent Treatment) అంటారు. పైకి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూనే.. లోపల అణచివేసిన కోపాన్ని (Suppressed Anger) మౌనమనే ఆయుధాన్ని అవతలి వ్యక్తిపై ప్రయోగించే మైండ్ సెట్ ఇది. ఒక మనిషిని శారీరకంగా కొట్టడం, మాటలతో బాధపెట్టడం కంటే, మానసికంగా ఎక్స్‌ప్రెస్ చేసే ఈ పాసివ్-అగ్రెసివ్ (Passive-Aggressive) మనస్తత్వం కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది.

ఈ పాసివ్-అగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్నవారి మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే, వీరు తమ మనసులోని అసంతృప్తిని లేదా కోపాన్ని డైరెక్టుగా వ్యక్తపరచడానికి ఇష్టపడరు. ఫేస్ టు ఫేస్ కూర్చుని సమస్యను పరిష్కరించుకునే ధైర్యం కొందరిలో ఉండదు. అందుకే వీరు మౌనంగా ఉండటాన్నే ఒక శిక్షగా వాడుకుంటారు.

అవతలి వ్యక్తిని మానసికంగా ఇబ్బంది పెట్టడం, వారిలో తప్పు చేశామనే గిల్టీనెస్‌ను కలిగించడం, దీని ద్వారా తమ బంధంలో వారి అప్పర్ హ్యాండ్ ప్రదర్శించడం ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంటారు. తాము మాట్లాడకుండా ఉంటే, ఎదుటి వ్యక్తి వచ్చి బ్రతిమాలుతాడనే ఒక రకమైన ఈగో ,స్వార్థం కూడా వీరిలో ఉంటాయి.

దీనిలో రెండో కోణం పూర్తిగా డిఫరెంట్ అలాగే ఎంతో బాధాకరమైనది. ఇక్కడ మౌనంగా ఉండే వ్యక్తి ఎదుటి వారిని శిక్షించాలని అనుకోడు. తాను ఎంత చెప్పినా ప్రయోజనం లేదు కాబట్టి తన బాధను తనే భరిస్తాననే నిరాశ ..బంధంలో ఎదురైనప్పుడు మనుషులు ఈ స్థితికి చేరుకుంటారు.

సొసైటీలో చాలా మంది బంధాలలో ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏంటంటే.. తాము ఎంత మాట్లాడినా, ఎంత వివరించినా అవతలి వ్యక్తి అస్సలు అర్థం చేసుకోరు. పైగా పదే పదే రిపీటెడ్‌గా అవే తప్పులు చేస్తూ.. తాము ఎంత బాధపడుతున్నా పట్టించుకోనప్పుడు ఒక స్టేజ్‌లో ఇక వీళ్లు మారరు, వీళ్లతో మాట్లాడి తన శక్తిని వృథా చేసుకోవడం కంటే మౌనంగా ఉండటమే మంచిదని డిసైడ్ అయిపోతారు.

ఇది ఎదుటి వ్యక్తిపై కోపంతో చేసేదేం కాదు, తనని తాను మానసికంగా కాపాడుకోవడానికి (Self-Defense) ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయం. పదే పదే గొడవలు పడుతూ మానసిక ప్రశాంతతను కోల్పోవడం కంటే, ఆ బంధంపై ఆశలు వదిలేసుకుని ఒక రకమైన ఎమోషనల్ డిటాచ్‌మెంట్‌లోకి వెళ్లిపోవడమే ఈ మౌనంలోని అర్ధం.

Silent Treatment
Silent Treatment

ఇలాంటి సైలెంట్ ట్రీట్మెంట్(Silent Treatment) మీ దగ్గర కూడా నడుస్తున్నప్పుడు, అది ఏ యాంగిల్ వల్ల జరుగుతుందో ముందుగా గుర్తించడం చాలా ఇంపార్టెంట్. మొదటి రకం అంటే ఈగో లేదా శిక్షించే మనస్తత్వం వల్ల అయితే దానికి లొంగిపోకుండా స్పష్టమైన బౌండరీలు సెట్ చేసుకోవాలి.

కానీ అది రెండో రకం అంటే చెప్పి చెప్పి అలసిపోయిన నిస్సహాయత అయితే మాత్రం అవతలి వ్యక్తి తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. అటువంటప్పుడు వారిని మరింత దూరం పెట్టకుండా, తాను అర్థం చేసుకుంటానని, ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని ఈసారికి క్షమించు అనే నమ్మకాన్ని ఇస్తూ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే, కోపంతో, ఈగోతో వచ్చే మౌనం కంటే.. అలసటతో వచ్చే మౌనం వల్ల బంధాలు తెగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .

Pune Murder Case : ప్రమాదం కాదు పక్కా ప్లాన్..ప్రియుడి కోసం కాబోయే భర్తను చంపేసిన యువతి..

Related Articles

Back to top button