AI Copyright Rules : గూగుల్, మెటా, టిక్‌టాక్‌లకు ఇండోనేషియా షాక్..ఏఐ డేటా వినియోగంపై బిగ్ టెక్ దిగ్గజాల కలవరం
AI Copyright Rules : ఏఐ మోడల్స్ ట్రైనింగ్ కోసం పబ్లిషర్ల కంటెంట్‌ను కనుక వాడితే అనుమతితో పాటు ఫైన్ చెల్లించాలంటూ ఇండోనేషియా తీసుకువస్తున్న కొత్త కాపీరైట్ నిబంధనలను గూగుల్, మెటా, టిక్‌టాక్‌ల వ్యతిరేకిస్తున్నాయి.
AI Copyright Rules
ఇండోనేషియా గవర్నమెంట్ తాజాగా ప్రతిపాదిస్తున్న కొత్త కాపీరైట్ రూల్స్ గూగుల్, మెటా, టిక్‌టాక్ వంటి వరల్డ్ డిజిటల్ దిగ్గజాలకు తీవ్ర కలవరాన్ని కలిగిస్తున్నాయి.అయితే ఏఐ ట్రైనింగ్ కోసం కంటెంట్‌ను వాడినా, డిజటల్ వేదికలపై న్యూస్ లింకులను ప్రదర్శించినా పబ్లిషర్లకు రాయల్టీ చెల్లించాలనే రూల్‌ను ఈ కంపెనీలు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ అభ్యంతరాలను స్పష్టం చేస్తూ ఆయా కంపెనీలు ప్లాట్‌ఫామ్‌ల ఫ్రీడంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని వాదిస్తున్నాయి.
న్యూస్ లింకులు లేదా పాఠాలను చూపించినందుకు మనీ చెల్లించాలనే రూల్ కనుక అమల్లోకి వస్తే, ఇంటర్నెట్ వినియోగదారులకు ఫ్రీగా ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండటం తగ్గుతుందని గూగుల్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. న్యూస్ వ్యాప్తి పరిమితమై జనాభాకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అందడం కష్టమవుతుందని అంటున్నారు. మరోవైపు మెటా కూడా ఇండోనేషియా ప్రతిపాదిస్తున్న కొత్త చట్టం వల్ల పబ్లిషర్లకే నష్టం జరుగుతుందని విశ్లేషిస్తుంది. న్యూస్ లింకులపై ఆంక్షలు విధిస్తే ఆయా వెబ్‌సైట్లకు వచ్చే రీడర్‌షిప్ బాగా పడిపోతుందని, దానివల్ల ప్రకటనల ఆదాయమే కాదు సబ్‌స్క్రిప్షన్ల ద్వారా వచ్చే రాబడి కూడా దెబ్బతింటుందని హెచ్చరిస్తోంది.
టిక్‌టాక్ కూడా ఏఐ ద్వారా క్రియేట్ చేసిన కంటెంట్‌పై స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయడం వల్ల ఏఐ టెక్నాలజీ డెవలప్మెంట్ మందగిస్తుందని తమ సందేహాలను వ్యక్తం చేసింది. టెక్నికల్ పురోగతి పేరుతో పబ్లిషర్ల కష్టాన్ని ఫ్రీగా వాడకూడదనేది ఒకవైపు, నియంత్రణలు పెంచితే ఇన్ఫర్మేషన్ ఫ్రీడమ్ దెబ్బతింటుందనేది మరోవైపు ప్రధాన వాదన సాగుతుంది. ఇండోనేషియాలో రూపొందుతున్న ఈ కొత్త చట్టం ఫ్యూచర్‌లో మీడియా రంగానికి, ఏఐ టెక్నాలజీ దిగ్గజాలకు మధ్య ఉన్న సంబంధాలను ఏ విధంగా మారుస్తుందోనని ప్రపంచ డిజిటల్ వరల్డ్ ఆసక్తిగా గమనిస్తోంది.





