Splitting : చిన్న గొడవకే బంధానికి దూరంగా వెళ్లే మైండ్‌సెట్.. ఇది డిటాచ్మెంటా లేక మానసిక బలహీనతా?
Splitting : అంతా బాగున్నంత వరకు తన పార్ట్నర్ను ప్రాణంగా చూసుకుంటారు. కానీ చిన్న తేడా లేదా గొడవ వచ్చినా..పార్ట్నర్లోని మంచి అంతా మర్చిపోయినట్లు బిహేవ్ చేస్తారు.
Splitting
నువ్వే నా జీవితం.. నీ తర్వాతే అంతా.. నువ్వు లేకుండా నా లైఫ్‌ని అసలు ఊహించుకోలేను.. ఇలాంటి తీపి మాటలను డీప్ లవ్‌లో ఉన్న పార్ట్నర్స్ వింటూనే ఉంటారు. కానీ వీరిద్దరి మధ్య చిన్న కోపమో, అలకో వచ్చి పార్ట్నర్ మాట్లాడటం మానేస్తే.. అవతలి వ్యక్తిలో సడన్ చేంజ్ బయటకు వచ్చేస్తుంది.
కన్విన్స్ చేయాల్సిన పర్సన్, బుజ్జగించాల్సిన ఆ అవతలి వ్యక్తి, తన బాధకు కారణం తానేనని తెలిసినా కూడా పట్టించుకోకుండా తన పార్ట్నర్ను లైట్ తీసుకుంటారు. తన తప్పు వల్ల పార్ట్నర్ అలా ఉన్నారన్న విషయం తెలిసీ కూడా తిరిగి తన పార్ట్‌నర్‌పై తనే కోపాన్ని పెంచుకుంటారు.
అంతవరకూ చూపించిన అమితమైన ప్రేమ, పంచుకున్న జ్ఞాపకాలు, ఇచ్చిన మాటలు..ఇలా అన్నిటినీ ఒక్క క్షణంలో మర్చిపోయారా అనేలా ప్రవర్తిస్తారు. ఏ బాధా లేకుండా, ఏ ఫీలింగ్ లేకుండా తమ డైలీ లైఫ్‌లోకి అంత ఈజీగా మూవ్ ఆన్ అయిపోతారు.
ఇన్నాళ్లూ ప్రాణంగా ప్రేమించిన మనిషి, చిన్న తేడా రాగానే ఒక్కసారిగా పరాయి వ్యక్తిలా మారిపోవడం ఎలాంటి వ్యక్తికైనా జీర్ణించుకోవడం కాస్త కష్టమే. తామిద్దరి మధ్య ఉన్నది నిజమైన ప్రేమేనా అనే డౌట్ రావడం కూడా కామన్.
ఇదంతా ఒక ఎత్తయితే ఎదుటి వ్యక్తి అసలేమీ జరగనట్లు, ఎటువంటి ఫీలింగ్ లేకుండా ఎప్పటిలాగే తన రొటీన్ లైఫ్‌లోకి మూవ్ ఆన్ అయిపోతుంటే ఆ గందరగోళం, శూన్యత ఇంకా బాధపెడతాయి. సైకాలజీ ప్రకారం ఇలా ప్రవర్తించడం వెనుక స్ప్లిటింగ్ (Splitting)లేదా బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ (Black and White Thinkin) ఉంటుందట. అంటే వారి దృష్టిలో ఇదొక రకమైన ఆత్మరక్షణ పద్ధతి అన్నమాట.
ఈ మెంటాలిటీ ఉన్నవారు మనుషులను , బంధాలను రెండు కోణాల్లో మాత్రమే చూస్తారు. అంతా బాగున్నంత వరకు తన పార్ట్నర్ను ప్రాణంగా చూసుకుంటారు. కానీ చిన్న తేడా లేదా గొడవ వచ్చినా..పార్ట్నర్లోని మంచి అంతా మర్చిపోయినట్లు బిహేవ్ చేస్తారు. వారిని తిరిగి నలుగురి ముందు బ్లేమ్ చేయడానికి చూస్తుంటారు. ఇక రెండోది ..వీరి ఆలోచనల్లో మీడియంగా ఉండటం లేదా అడ్జెస్ట్ అవడం అనే ప్రసక్తి ఉండదు.
వీరిలో ఎమోషనల్ కంపార్ట్మెంటలైజేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీరు తమ ఎమోషన్స్‌ను వేర్వేరు గదులుగా డివైడ్ చేస్తారు. గొడవ జరగగానే ఆ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన ఫీలింగ్స్‌ను ఒక మూలన దాచేసి, ఆ గది తలుపులు మూసేస్తారు. తమ మధ్య ఏమీ జరగనట్లు తమ ఆఫీస్ పని, రోజువారీ రొటీన్, ఎంజాయ్మెంట్ను కంటిన్యూ చేస్తారు.
కొందరిలో ఉండే నార్సిసిస్టిక్ లక్షణాలు కూడా ఇలా బిహేవ్ చేయడానికి కారణమవుతాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. వీరు పార్ట్నర్ తమకు అనుకూలంగా ఉన్నంత కాలమే కొండంత ప్రేమను చూపిస్తారు. చిన్న తేడా వచ్చి తమ ఈగో దెబ్బతినగానే, ఏమాత్రం పశ్చాత్తాపం , బాధ , ఎమోషన్స్ వంటివి లేకుండా డిటాచ్మెంట్ పేరుతో ఆ బంధాన్ని వదిలేసి ముందుకు వెళ్లిపోతారు.
ఇలా ప్రవర్తించడం చూసేవాళ్లకు వాళ్లు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు కనిపించినా , నిజానికి ఇది ఏమాత్రం మంచిది కాదని సైకాలజిస్టులు చెబుతున్నారు. మరోవైపు ఇలాంటి అన్ హెల్దీ బిహేవియర్ వల్ల పార్ట్నర్ తీవ్రమైన మానసిక గాయానికి గురవుతారు.
అవతలి వ్యక్తి ఎప్పుడు ఏ చిన్న తేడా వచ్చినా ఈజీగా వదిలేసి వెళ్లిపోగలరనే ఫీలింగ్ రావడం వల్ల ఆ బంధం ఎప్పటికీ కొనసాగుతుందన్న నమ్మకం పార్ట్నర్లో పోతుంది. ఇన్నాళ్లూ అవతలి వ్యక్తి చూపించిన ప్రేమపైన కూడా అనుమానం వస్తుంది. టైమ్ పాస్ బంధాన్ని తానిన్ని రోజులు నిజమనుకుని బ్రతికానా అనే నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి.
ఇలా ఇద్దరి మధ్య ఏదైనా సమస్య వచ్చినపుడు కూర్చొని మాట్లాడుకోవడం, సద్దుకుపోవడం చేతకాకపోవడం వల్ల, ఎవాయిడ్ చేస్తున్నట్లు బిహేవ్ చేయడం వల్ల వీరి జీవితంలో ఏ సంబంధమూ ఎక్కువ కాలం నిలబడదని సైకాలజిస్టులు చెబుతున్నారు.
ఇలా చేయడం వారికి టెంపరరీగా బాధ నుంచి తప్పించుకోవడానికి సహాయపడినట్లు అన్పించినా.. ఎమోషన్స్‌ను తొక్కిపెట్టడం వల్ల రానురాను భరించలేని ఒత్తిడి, లోన్లీనెస్ పెరిగే అవకాశాలుంటాయని అంటున్నారు. జీవితంలో ఎవరితో కూడా లోతైన అనుబంధాన్ని వీరు అనుభవించలేరని చెబుతున్నారు .
అయితే వారి బంధంలో అంతవరకు వాళ్లు చూపించిన ప్రేమ పూర్తిగా అబద్ధం కాదు. ఆ క్షణంలో వారు నిజంగానే ప్రేమిస్తారు. కానీ, ఒక చిన్న గొడవ లేదా అభిప్రాయ భేదం వచ్చినప్పుడు ఆ ప్రేమను నిలబెట్టుకునే ఎమోషనల్ మెచ్యూరిటీ , ఎమోషనల్ ఫీలింగ్స్‌ను తట్టుకునే శక్తి వాళ్లలో లేకపోవడం వల్లే ఇలా చేస్తారు.

గొడవ రాగానే నీ దారి నీది, నా దారి నాదని ఈజీగా స్విచ్ ఆఫ్ అయిపోవడం మీకు లైఫ్ మూవింగ్ ఆన్ లా కనిపించొచ్చు. కానీ నిజానికి అది మీ మానసిక బలహీనతకు నిదర్శనం అని గ్రహించాలి. మీ ఆత్మరక్షణ (Self-preservation) పేరుతో ఎదుటివారి ప్రేమను, నమ్మకాన్ని కోల్పోతున్నారన్న విషయాన్ని అర్ధం చేసుకోవాలి.
ఎదుటివారిని కన్విన్స్ చేసో, కాస్త తగ్గో మీ బంధాన్ని కాపాడుకోలేకపోతే..తర్వాత మీ చుట్టూ మనుషులు ఉంటారేమో కానీ, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే నిజమైన అనుబంధాలు మాత్రం మిగలవు. అందుకే ఇలా పారిపోయే మెంటాలిటీ ..మిమ్మల్ని ఒంటరిని చేయకముందే మారండి.





