Just LifestyleHealthLatest News

Skin Care:సమ్మర్ స్కిన్ కేర్ ..ఇలా చేయండి చాలు

Skin Care: వారానికి రెండుసార్లు ఏదైనా న్యాచురల్ స్క్రబ్‌తో ముఖాన్ని, చేతులను రుద్దడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి స్కిన్ తాజాగా కనిపిస్తుంది.

Skin Care

వేసవి కాలంలో స్కిన్ ప్రొటెక్షన్ అనేది ప్రతీ ఒక్కరికీ ఒక పెద్ద సవాలు. ఎండ తీవ్రత వల్ల చర్మం అంతా జిడ్డుగా మారడం, చెమటకాయలు రావడం, చర్మం నల్లగా కమిలిపోవడం (Tan) వంటి సమస్యలు చాలానే ఎదురవుతుంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడి చర్మాన్ని, అలాగే స్కిన్ అందాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు అంటున్నారు.

దీని కోసం మొదటగా చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ (Exfoliate) చేయడం చాలా అవసరం. వారానికి రెండుసార్లు ఏదైనా న్యాచురల్ స్క్రబ్‌తో ముఖాన్ని, చేతులను రుద్దడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి స్కిన్ అంతా తాజాగా కనిపిస్తుంది.

వేసవిలో సన్‌స్క్రీన్ వాడకుండా అస్సలు ఉండొద్దు. కేవలం ఎండలోకి వెళ్లేటప్పుడే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్‌స్క్రీన్ రాసుకోవడం వల్ల యూవీ కిరణాల ప్రభావం నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు. ఇది స్కిన్‌ను తేమగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.

అలాగే వింటర్‌లో వాడే హెవీ మాయిశ్చరైజర్లకు బదులుగా, ఈ సీజన్లో తేలికపాటి (Lightweight) క్రీములను వాడాలి. ఎక్కువగా చెమట పట్టడం వల్ల ముఖం మీద దుమ్ము పేరుకుపోతుంది. కాబట్టి రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి.

Skin Care
Skin Care

మనం తినే ఆహారం కూడా చర్మంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. సమ్మర్‌లో ఎక్కువగా మామిడి, బెర్రీస్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పండ్లను తింటే స్కిన్ లోపల నుంచి ప్రకాశిస్తుంది. బాడీలోని వ్యర్థాలను బయటకు పంపడానికి రోజుకు 4 లీటర్ల నీళ్లు తాగడం చాలా ముఖ్యం.

బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, కూల్ గ్లాసెస్ వాడటం , ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల డైరక్టుగా సూర్యరశ్మి మీ చర్మంపై పడకుండా ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎవరి చర్మం అయినా ఎండాకాలంలో కూడా నిగనిగలాడుతూ ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button