Just LifestyleHealthJust SpiritualLatest News

Superstitions:తుమ్మితే కూర్చుని వెళ్లాలా? రాత్రి ఎందుకు ఇళ్లు ఊడ్చకూడదు? ఇవి నిజంగా మూఢ నమ్మకాలేనా?

Superstitions: విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనం పాత విషయాలను విశ్లేషించాలి తప్ప, వాటిని పూర్తిగా విస్మరించకూడదు.

Superstitions

మనం చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్దవాళ్లు ఏదైనా పని చేస్తున్నప్పుడు అలా చేయకూడదు, ఇలా చేయాలని చెబుతుంటే వాటిని మూఢనమ్మకాల(Superstitions)ని కొట్టిపారేస్తుంటాం. కానీ మన పూర్వీకులు ప్రతి విషయాన్ని ఒక క్రమశిక్షణ కోసం, సామాజిక భద్రత కోసమే వాటిని పాటించాలని చెప్పేవారన్న విషయం చాలామందికి అర్ధం కాద.

ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు తుమ్మితే అది అశుభం అని పెద్దలు చెబుతారు.అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే, తుమ్మినప్పుడు బాడీ మొత్తం ఒక రకమైన కుదుపునకు లోనవుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన తుమ్ముల వల్ల ప్రాణవాయువు సరఫరాలో చిన్న అంతరాయం కూడా కలగొచ్చు.

కొన్నిసార్లు ఒక మనిషి తుమ్మాడంటే శరీరంలోని నాడీ వ్యవస్థ ఒక్కసారిగా కుదుపునకు లోనవుతుంది. రక్తపోటులో మార్పు రావచ్చు. అందుకే ఒక నిమిషం కూర్చుని, నీళ్లు తాగి వెళ్లాలని పెద్దలు చెబుతారు. దీంతో శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం, తుమ్మిన వ్యక్తి క్షేమంగా ఉన్నాడని నిర్ధారించుకోవడం అన్నమాట.అయితే అది కాలక్రమేణా ఒక నమ్మకంగా మారిపోయింది.

రెండోది పిల్లి ఎదురవడం. పూర్వం మనుషులు ఎద్దుల బండ్ల మీద లేదా కాలినడకన అడవుల గుండా ప్రయాణించేవారు. పిల్లి ఎదురైందంటే చుట్టుపక్కల పెద్ద పులులు లేదా చిరుతలు ఉండొచ్చని ఒక సంకేతం. అది చూసి ఎద్దులు బెదిరిపోయి ప్రమాదాలు జరిగేవి. అందుకే పిల్లి ఎదురయితే కాసేపు ఆగి వెళ్లమని చెప్పేవారు.

అలాగే సాయంత్రం పూట గోళ్లు కట్ చేయకూడదనే మాటకి సైన్స్ తో పాటు ఆనాటి జీవనశైలికి సంబంధం ఉంది. పూర్వకాలంలో కరెంట్ ఉండేది కాదు. ఆ కాలంలో కత్తులు, పదునైన వస్తువులతో గోళ్లు తీసేవారు .చిన్న దీపాల వెలుతురులో గోళ్లు కట్ చేయడం వల్ల గాయాలయ్యే అవకాశం ఉండేది. అంతేకాదు అవి చీకట్లో అవి ఎక్కడ పడతాయో తెలీదు. ఆహారంలో కలిసే ప్రమాదం కూడా ఉండేది. అందుకే పగలు మాత్రమే గోళ్లు తీయాలని నియమం పెట్టారు తప్ప ఇది మూఢనమ్మకం(Superstitions) కాదు.

 

Superstitions
Superstitions

గుమ్మం ముందు నిమ్మకాయ, మిర్చి కట్టడాన్ని కేవలం ‘దిష్టి’ కోసం అనుకుంటారు. కానీ దీని వెనుక ఒక ప్రాక్టికల్ సైన్స్ ఉంది. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్, మిర్చిలోని ఘాటైన ‘కాప్సైసిన్’ ఉంటాయి. ఇది ఒక సహజమైన కీటక నివారిణి (Natural Insecticide) గా పనిచేస్తూ దోమలు, ఈగలను ఇంట్లోకి రాకుండా చూస్తుంది. అలాగే గాలిలో ఇన్ఫెక్షన్లు ఉంటే నిమ్మకాయ త్వరగా నల్లబడేది, అది ఒక హెల్త్ ఇండికేటర్ లాగా పనిచేసేది.

అలాగే ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకూడదనే నమ్మకం కూడా ఉంటుంది. అయితే ఉత్తరం వెనుక భూమి అయస్కాంత క్షేత్రం (Magnetic field) దాగి ఉండటంతో పాటు.. మన శరీరంలో కూడా ఐరన్ ఉంటుంది, అయస్కాంత దిశలకు అనుగుణంగా తల పెట్టి పడుకోకపోతే రక్త ప్రసరణలో మార్పులు వచ్చి నిద్ర సరిగ్గా పట్టదని అలా చెప్పేవారు.

Superstitions
Superstitions

సాయంత్రం ఇల్లు ఊడ్వకూడదు అంటే.. చీకట్లో ఏవైనా విలువైన వస్తువులు పొరపాటున బయట పడిపోతాయని పెద్దల భయం. తుమ్మితే ఆగి వెళ్లమనడం నీ ఆరోగ్యంపై శ్రద్ధ. ఇలా సైన్స్ ను భక్తితోనో లేదా నమ్మకంతోనో ముడిపెడితే చాలామంది తప్పకుండా పాటిస్తారని అలా చెప్పేవారు. విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనం పాత విషయాలను విశ్లేషించాలి తప్ప, వాటిని పూర్తిగా విస్మరించకూడదని అంతా తెలుసుకోవాలి.

Sheikh Hasina:షేక్ హసీనాకు 10 ఏళ్ల జైలు శిక్ష.. పాత శిక్షలతో కలిపి హసీనా ఎన్నేళ్ల శిక్ష పడనుంది?

 

Related Articles

Back to top button