Mind : మన మనసు ఆడే వింత నాటకాలు.. మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తాం?
Mind: మనం ఏదైనా గొప్ప పని చేసినప్పుడు లేదా ఒక విజయాన్ని సాధించినప్పుడు, అదంతా తన కష్టం, తన తెలివితేటలని గొప్పగా చెప్పుకుంటాం.
Mind
మనుషుల ప్రవర్తన అనేది పైకి కనిపించేంత ఈజీగా ఉండదు . మెదడు(Mind) మనల్ని ఎప్పుడూ ఒక హీరోలా చూసుకోవడానికి, చూపించుకోవడానికి లోపల ఒక వింత నాటకం ప్లే అవుతుంది. దీన్నే సైకాలజీలో సెల్ఫ్-సర్వింగ్ బయాస్ అంటారు. అంటే మనం ఏదైనా గొప్ప పని చేసినప్పుడు లేదా ఒక విజయాన్ని సాధించినప్పుడు, అదంతా తన కష్టం, తన తెలివితేటలని గొప్పగా చెప్పుకుంటాం.
కానీ ఏదైనా పని చెడిపోయినపుడు, మనం ఓడిపోయినపుడు మాత్రం వెంటనే టైం బాలేదని, వాడు సరిగ్గా చేయలేదని, అదృష్టం కలిసిరాలేదని సాకులు వెతుక్కుంటాం. ఎందుకంటే, మన లోపల ఉన్న ఈగో (Ego) దెబ్బతినకుండా మెదడు మనకు మనమే ఒక షీల్డ్ వేసేసుకుంటుంది.
దీనివల్ల మన మనసుకి పీస్‌ఫుల్‌నెస్ దొరుకుతుంది కానీ, మన తప్పుల నుంచి మనం నేర్చుకునే ఛాన్స్ తగ్గిపోతుంది. దీనంతటికీ కారణం మనల్ని మనం ఎప్పుడూ పర్ఫెక్ట్ అని అనుకోవడం వల్ల అలాగే, ఎక్కడ మార్చుకోవాలో తెలియకపోవడం. అందుకే ఒకే తప్పును మళ్లీ మళ్లీ చేస్తుంటాం.
ఇక మనల్ని వేధించే మరో విషయం ఏంటంటే, మనం మధ్యలో ఆపేసిన పనులు. ఏదైనా పనిని పూర్తి చేయకుండా మధ్యలో వదిలేస్తే, ఆ విషయం పదేపదే మన మెదడులో ఒక ముల్లులా గుచ్చుకుంటూనే ఉంటుంది. దీన్నే సైకాలజీ ప్రకారం జైగార్నిక్ ఎఫెక్ట్ అని అంటారు.

మనం పూర్తిగా చేసిన పనులను మన మెదడు హాయిగా మర్చిపోతుంది కానీ.. ఆగిపోయిన పనులను మాత్రం ఇంకా అవ్వలేదు.. ఇంకా అవ్వలేదని పదే పదే గుర్తు చేస్తూ మనల్ని విసిగిస్తుంది. అందుకే ఏదైనా సినిమా క్లైమాక్స్ చూడకపోతే ఆ రోజంతా మనసు అక్కడే ఉంటుంది.
దీన్ని మనం మన ఎదుగుదల కోసం వాడుకోవచ్చు. ఏదైనా కష్టమైన పనిని మొదలుపెట్టి కాసేపు ఆపితే, ఆ ‘అసంపూర్ణ భావన’ మనల్ని మళ్లీ ఆ పనిని పూర్తి చేసేలా ప్రేరేపిస్తుంది. ఎందుకంటే మన మెదడుకు ఎప్పుడూ ఒక ముగింపు (Closure) కావాలి, అది దొరికే వరకు అది నిద్రపోనివ్వదు.





