Coffee Butter :ముడతలు లేని ముఖం.. మృదువైన చర్మం.. కాఫీ బటర్ మ్యాజిక్
Coffee Butter : కాఫీ బటర్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది స్కిన్‌పై ఒక సున్నితమైన సేఫ్టీ పొరను ఏర్పాటు చేసి, లోపల ఉన్న తేమ బయటకు పోకుండా అడ్డుకుంటుంది.
Coffee Butter
ఇప్పుడు చాలామందికి అందంపై అవేర్నెస్ వచ్చింది. కొంతమంది తమ అందాన్ని పెంచుకోవడానికి మార్కెట్లో వేల సంఖ్యలో బ్యూటీ ప్రొడెక్ట్స్ వైపు మొగ్గు చూపిస్తుంటే.. మరి కొందరు మాత్రం సహజ సిద్ధంగా లభించేవాటికే ఓటేస్తున్నారు. అలా ఇప్పుడు కాఫీ బటర్ వైపు అందరి దృష్టి మళ్లుతోంది.
కాఫీ గింజల నుంచి తీయబడిన కాఫీ బటర్(Coffee Butter) చాలా చిక్కగా, క్రీములా ఉండటంతో.. మన చర్మానికి అవసరమైన అద్భుతమైన పోషణను అందిస్తుంది. ఇది కేవలం పైన గ్లోను ఇచ్చి వదిలేయకుండా, చర్మపు పొరల్లోకి లోతుగా చొచ్చుకుపోయి దెబ్బతిన్న కణాలను కూడా రిపేర్ చేస్తుంది.
కాఫీ బటర్లో పుష్కలంగా ఉండే కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మానికి ఒక రక్షణ కవచంలా పని చేస్తాయి. ముఖ్యంగా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల చర్మం జీవం కోల్పోయి పొడిబారకుండా ఉండటానికి ఇది ఎంతో సహాయపడుతుంది.
సాధారణంగా చర్మానికి హైడ్రేషన్ అందించడం అంటే కేవలం పైన తేమను పూయడమని అనుకుంటాం. కానీ కాఫీ బటర్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది స్కిన్‌పై ఒక సున్నితమైన సేఫ్టీ పొరను ఏర్పాటు చేసి, లోపల ఉన్న తేమ బయటకు పోకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల రఫ్‌గా మారిన స్కిన్ కూడా కొద్ది రోజుల్లోనే ఎంతో స్మూత్‌గా ఆరోగ్యంగా తయారవుతుంది.
అంతేకాకుండా, ఇది చర్మంపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల ముఖంపై వచ్చే వాపులు తగ్గి ముఖం ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా పొడి చర్మం (Dry Skin) ఉన్నవారికి కాఫీ బటర్ ఒక వరం లాంటిదని చెప్పొచ్చు. వృద్ధాప్య లక్షణాలైన ముడతలు, చారలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
బయటనుంచి వచ్చే పొల్యూషన్, దుమ్ము, సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించి, చర్మం తనంతట తానుగా కోలుకునే కెపాసిటీని కాఫీ బటర్ పెంచుతుంది. ఇది వాడిన వెంటనే అద్భుతాలు కనిపించవు. కానీ రెగ్యులర్‌గా వాడటం వల్ల దీర్ఘకాలికంగా చర్మం తన నేచురల్ మెరుపును సంతరించుకుంటుంది.

కాఫీ బటర్(Coffee Butter) చిక్కగా, క్రీములా ఉంటుంది కాబట్టి, ముందుగా చర్మాన్ని, ఫేస్‌ను శుభ్రం చేసుకుని ఆ తర్వాతే దీనిని అప్లై చేయాలి. కొద్దిగా బటర్ తీసుకుని మెల్లగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి, స్కిన్ లోపలి పొరలకు కూడా పోషణ అందుతుంది.
కాఫీ బటర్‌ను శరీరానికి, ముఖానికి రాసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకుంటే చాలు, అది నైట్ అంతా చర్మంపై పనిచేసి ఉదయానికి స్కిన్‌ను కాంతివంతంగా మారుస్తుంది.
Hesitation:మంచితనమా? మొహమాటమా? ..మారలేని మనస్తత్వాల వెనుక నిజాలేంటి?





