Weaponised Vulnerability : బంధాల్లో వెపనైజ్డ్ వల్నరబిలిటీ గురించి విన్నారా? మీరూ ఆ ఎమోషనల్ ట్రాప్‌లో ఉన్నారా?
Weaponised Vulnerability : పార్ట్‌నర్స్ ఇద్దరూ ఒకరికొకరు తమ బలహీనతలను, ఎమోషన్స్‌ను ఎలాంటి దాపరికం లేకుండా ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
Weaponised Vulnerability
ఏదైనా రిలేషన్‌షిప్‌లో ఇద్దరి మధ్య ఏదొక గొడవ రావడం కామన్. ఆ సమయంలో ఒకరికొకరు తమ బలహీనతలను, ఎమోషన్స్‌ను ఎలాంటి దాపరికం లేకుండా ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇదే ఆ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అయితే, కొంతమంది ఈ భావోద్వేగాలను, కన్నీళ్లను తమకు అనుకూలంగా మార్చుకునే అస్త్రంగా (Weaponised Vulnerability) ప్రయోగిస్తారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సైకాలజీ చెబుతున్నదాని ప్రకారం .. పార్ట్‌నర్‌తో ఎమోషనల్‌గా ఉండటం తప్పు కాదు, కానీ ఆ ఎమోషన్స్ సరైన టైమ్‌లో కాకుండా చాలా అనుకూలమైన సమయంలో (Convenient Time) బయటకు తీసుకు రావడాన్నే వెపనైజ్డ్ వల్నరబిలిటీ(Weaponised Vulnerability) అంటారు.
ఉదాహరణకు.. వారం రోజులుగా ఇద్దరి మధ్య గ్యాప్ పెంచుతున్న ఒక సమస్య గురించి మీరు పార్ట్‌నర్‌తో మాట్లాడదామని డిసైడ్ అయ్యారనుకోండి. మీరు విషయాన్ని స్టార్ట్ చేసిన రెండు నిమిషాల్లోనే.. మీ పార్ట్‌నర్ పాత జ్ఞాపకాలను తీసి పాత బంధంలోనో, లేక కుటుంబంలో వాళ్లనో గుర్తు చేసుకుని వారు కూడా తనను ఇలాగే ప్రతి చిన్న విషయానికి కూడా నిందించేవారని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు.
ఇంకేముంది మీరిద్దరూ సీరియస్‌గా మాట్లాడాల్సిన ఆ విషయం పక్కకు పోయి, వాళ్లను ఓదారుస్తూ కన్విన్స్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే అక్కడ మీ పార్ట్‌నర్ చెప్పుకున్న బాధే హైలైట్ అవుతుంది. అలా వాళ్లు తమ బాధ చెప్పుకుని తమ తప్పుల నుంచి చాలా తెలివిగా ఎస్కేప్ అయిపోతారన్నమాట.
ఈ మైండ్ గేమ్‌ను పసిగట్టడానికి ఉన్న అతిపెద్ద క్లూ టైమింగ్ అని చెబుతారు సైకాలజిస్టులు. ప్రశాంతంగా ఉన్న సమయంలో మీరిద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్నప్పుడు మీ పార్ట్‌నర్ తమ గతంలో జరిగిన అలాంటి విషయాలను మీతో షేర్ చేసుకున్నారా లేక కేవలం వాళ్లను ఏదైనా తప్పుపై నిలదీసినప్పుడు మాత్రమే ఆ బాధ బయటకు వస్తుందా అనేది గమనించాలి. ఒకవేళ రెండోదే ఎక్కువసార్లు జరుగుతూ ఉంటే మాత్రం.. వాళ్లు ఎమోషన్స్‌ని అస్త్రంగా వాడుతున్నట్లే లెక్క.

ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేసినపుడు చాలా సానుభూతిగా, అదే సమయంలో అంతే స్ట్రాంగ్‌గా ఉండాలని సైకాలజీ చెబుతోంది. ఈ విషయంలో మీకు కూడా ఎంతగానో బాధ కలుగుతుందని ..కాకపోతే మొదట అడిగిన విషయానికి సమాధానం కావాలని చాలా క్లియర్‌గా చెప్పాలి.
ఒకవేళ వాళ్లు నిజంగా అప్‌సెట్ అయి ఉంటే మాత్రం కాసేపు గ్యాప్ ఇవ్వండి. కానీ మళ్లీ విషయంపై మాట్లాడదామని ముందే చెప్పి, ఆ టైమ్‌కి మళ్లీ సేమ్ టాపిక్ తీసుకురండి. నిజమైన ఎమోషన్స్ ఉన్న వ్యక్తి ప్రశాంత పడ్డాక విషయాన్ని డిస్కస్ చేస్తారు. కానీ ఎమోషన్స్‌ను వెపన్‌గా వాడే వ్యక్తి మాత్రం ఆ టాపిక్ మళ్లీ రాకుండా సేమ్ సీన్ రిపీట్ చేస్తారు. ఇలాగే ఉంటే మాత్రం కపుల్స్ కౌన్సెలింగ్‌కు వెళ్లడమే మంచిది.





