Law Of Attraction : లా ఆఫ్ అట్రాక్షన్ వెనుక ఉన్న అసలు రహస్యం.. మన యద్భావం తద్భవతి సూత్రమేనా?
Law Of Attraction : సైకాలజీ పరంగా చూస్తే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మ్యాజిక్ కాదు, అది మెదడు యొక్క పనితీరు మాత్రమే. సైకాలజీలో దీనిని సెలెక్టివ్ అటెన్షన్ అంటారు.
Law Of Attraction
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూసినా, పర్సనల్ డెవలప్మెంట్ పుస్తకాలలో చదివినా ..లా ఆఫ్ అట్రాక్షన్ అనే పదం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. నువ్వు దేన్నైతే బలంగా కోరుకుంటావో, ఈ విశ్వం దాన్నే నీకు ఇస్తుందనేది ఈ సిద్ధాంతం ముఖ్య ఉద్దేశం.
వినడానికి ఇది ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే.. కేవలం సోఫాలో కూర్చుని కార్లు, బంగ్లాలు ఊహించుకుంటే అవి నిజమైపోతాయనే ఒక భ్రమను నేటి యువతలో కలిగిస్తోంది. కానీ ఇదే విషయాన్ని సైకాలజీతో పాటు మన సనాతన ధర్మంలోని కర్మ సిద్ధాంతం ప్రకారం విశ్లేషిస్తే, దీని వెనుక ఉన్న అసలైన, ప్రాక్టికల్ పరమార్థం ఏంటో అందరికీ బాగా అర్థమవుతుంది.
ముందుగా సైకాలజీ పరంగా చూస్తే, లా ఆఫ్ అట్రాక్షన్(Law Of Attraction) అనేది మ్యాజిక్ కాదు, అది మెదడు యొక్క పనితీరు మాత్రమే. సైకాలజీలో దీనిని సెలెక్టివ్ అటెన్షన్ అంటారు. మన మెదడులో ఉండే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ (RAS) అనే వ్యవస్థ, మన మనసులో కంటిన్యూగా నడిచే బలమైన థాట్స్ ఆధారంగానే పనిచేస్తుంది.
మనం ఒక లక్ష్యంపై మన సంకల్పాన్ని బలంగా ఉంచినప్పుడు, మన చుట్టూ ఉన్న వేల విషయాల నుంచి మన టార్గెట్‌కు ఉపయోగపడే అవకాశాలను మాత్రమే మెదడు మనకు చూపిస్తుంది. దీనివల్ల మనకు అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. దీనిని సైకాలజీలో యూనివర్స్ ఇచ్చిన అదృష్టంగా చెబితే, సైన్స్ మాత్రం అది మెదడు యొక్క అపారమైన ఫోకస్ పవర్ అని చెబుతుంది.
ఇక కర్మ సిద్ధాంతం ప్రకారం చూస్తే కనుక, ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌కు ఒక పూర్తి స్థాయి అర్ధం దొరుకుతుంది. శతాబ్దాల క్రితమే మన ఉపనిషత్తులు యద్భావం తద్భవతి అంటే నువ్వు నీ మనసులో ఏది భావిస్తావో అదే అవుతావు అని స్పష్టంగా చెప్పాయి.
అయితే, కర్మ సిద్ధాంతం కేవలం ఆలోచనల (లా ఆఫ్ అట్రాక్షన్) వరకే ఆగదు. దానికి క్రియ (Action)ను జోడిస్తుంది. సనాతన ధర్మం ప్రకారం సంకల్ప మనేది ఒక మానసిక కర్మ.
ఆ మానసిక కర్మ ఎంత పవిత్రంగా ఉంటుందో, దానికి తగినట్లుగా మనం శారీరక కర్మలు చేసినప్పుడే రిజల్ట్ వస్తుంది. కేవలం ఆలోచించి, ఎలాంటి కర్మ అంటే ఎలాంటి పని చేయకుండా కూర్చుంటే ఫలితం రాదు సరి కదా, అది కాలక్రమేణా ఆగామి కర్మ కింద ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది.
అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ నీ స్వార్థం కోసం నువ్వు కోరుకో అని చెబితే, కర్మ సిద్ధాంతం మాత్రం మంచి ఉద్దేశంతో (Intention) కోరుకో అని చెబుతుంది. మనం ఒకరిని తొక్కేయాలనో లేదా మోసం చేయాలనో అనుకుంటూ బలమైన సంకల్పం చేస్తే, సైకాలజీ ప్రకారం మెదడు ఒత్తిడికి లోనవుతుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం అయితే అది పాప కర్మగా మారి ఫ్యూచర్‌ను నాశనం చేస్తుంది.
అందుకే మన పెద్దలు ఏ పని చేసినా లోక కళ్యాణం కోసం, పాజిటివ్ ఫీలింగ్‌తో చేయమన్నారు. ఎందుకంటే మనం యూనివర్స్‌కు ఏ ఉద్దేశాన్ని ఇస్తామో, అది తిరిగి వంద రెట్లు అయి మనపై ప్రభావాన్ని చూపిస్తుంది.

లా ఆఫ్ అట్రాక్షన్(Law Of Attraction) అనేది ఏదో గాల్లోంచి వచ్చే అద్భుతమేమీ కాదు. సైకాలజీ ప్రకారం మనసులో పవిత్రమైన సంకల్పాన్ని ఉంచుకోవడం , కర్మ సిద్ధాంతం ప్రకారం దానికి తగినట్లుగా ధర్మబద్ధంగా కష్టపడటం .. ఈ రెండూ కలిసినప్పుడే లైఫ్‌లో విజయాలు సాధ్యమవుతాయి.
యూనివర్స్ మనకు ఫ్రీగా ఏదీ ఇవ్వదు. మనం చేసే సంకల్పానికి, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మాత్రమే ప్రకృతి లెక్కిస్తుంది. కాబట్టి కేవలం ఇమేజినేషన్లో విహరించడం ఆపేసి, స్వచ్ఛమైన సంకల్పంతో, మంచి పనులు చేస్తూ ముందుకు సాగడమే నిజమైన విక్టరీ సీక్రెట్ అని తెలుసుకోవాలి.
Sharad Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం..షిండేతో శరద్ పవార్ భేటీ దేనికి సంకేతం?





