Just LifestyleLatest News

Maturity : నిజమైన మెచ్యూరిటీ అంటే ఏంటి? ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్నవారి ప్రవర్తన ఎలా ఉంటుంది?

Maturity : ఒక పరిణతి చెందిన వ్యక్తి బిహేవియర్, ఎమోషన్స్‌ బ్యాలెన్స్ అలాగే రిలేషన్‌షిప్స్‌లో వారు ఎలా వ్యవహరిస్తారనే దానిపై సైకాలజీ కోణం ఇక్కడ చూద్దాం.

Maturity

జీవితంలో ఏజ్ పెరిగినంత మాత్రాన ప్రతి ఒక్కరిలోనూ మెచ్యూరిటీ ( Maturity) వస్తుందని చెప్పలేం. కొంతమంది ఎంత పెద్దవారైనా సరే చిన్న పిల్లల్లాగే బిహేవ్ చేస్తుంటారు. మరికొందరు మాత్రం చాలా చిన్న ఏజ్‌లోనే ఎంతో లోతైన ఆలోచనలు, ప్రశాంతతను కలిగి ఉంటారు. అసలు ఒక మెచ్యూర్డ్ మ్యాన్ లేదా విమెన్ ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ల ఆలోచనా విధానం ఇతరులకు ఎందుకు డిఫరెంట్‌గా అనిపిస్తుంది? ఈ విషయాలపై సైకాలజీ చెబుతున్న ఆసక్తికరమైన నిజాలు ప్రవర్తనా తీరును పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి.

నిజమైన మెచ్యూరిటీ(Maturity) ఉన్నవారిలో మొట్టమొదటిగా కనిపించే లక్షణం.. పురుష తత్వం (Masculinity), స్త్రీ సహజ గుణాలు (Femininity) రెండింటి మధ్య అద్భుతమైన బ్యాలెన్స్ ఉండటం. మగవారు అంటే కేవలం కఠినంగా ఉండటం, కోపగించుకోవడం కాదనే సత్యాన్ని వారు గుర్తిస్తారు.

వారిలో డేరింగ్, రక్షణ బాధ్యత ఎంతగా ఉంటాయో.. తోటివారి పట్ల సానుభూతి (Empathy), కేరింగ్, సెన్సిటివిటీ కూడా అంతే ఈక్వెల్‌గా ఉంటాయి. అలాగే ఎమోషన్స్ దాచుకోవడం వీక్నెస్ కాదని, మనిషిగా బాధ కలిగినప్పుడు దాన్ని ఎక్స్‌ప్రెస్‌ చేయడంలో ఎలాంటి తప్పులేదని భావిస్తారు.

ఇక రిలేషన్‌ విషయానికి వస్తే, వీరు చాలా జెంటిల్‌గా, ఎదుటివారికి పూర్తి గౌరవమిచ్చేలా ప్రవర్తిస్తారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి పర్సనాలిటీని గౌరవిస్తారు. వీరు ఎక్కడున్నా, మెయిన్‌గా వారి పార్ట్‌నర్ (Partner) వీరి చెంత ఉన్నప్పుడు ఎలాంటి భయం లేకుండా పూర్తిగా సేఫ్ అండ్ సెక్యూర్‌గా (Safe & Secure) ఫీలవుతారు. ఎవరినీ వీరు చిన్నచూపు చూడరు..అలాగే అందరినీ జడ్జ్ చేయడం వంటి పనులకు వీరు దూరంగా ఉంటారు.

సంసారంలో లేదంటే రిలేషన్‌షిప్‌లో గొడవలు జరిగినప్పుడు ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు పార్టనర్ పని ఒత్తిడి వల్లో, కోపంతోనో చిరాకు పడటం, అరవడం చేస్తుంటారు. అప్పుడు నార్మల్ మనిషి అయితే నా మీదే అరుస్తావా? నీకేనా నాకు కోపం రాదా? అంటూ ఈగోకు పోయి గొడవ పెద్దది చేస్తారు.

కానీ, ఒక మెచ్యూర్డ్ మ్యాన్ ఆర్ విమెన్ అలా ఆలోచించరు. అవతలి వ్యక్తి అరుస్తున్నారని దాన్ని తమ సెల్ఫ్-వర్త్‌కు అంటే తమ ఆత్మగౌరవానికి ముడిపెట్టుకోరు. తను జనరల్‌గా ఇలా మాట్లాడరు, బహుశా ఈరోజు ఏదైనా టెన్షన్‌లో ఉన్నారేమో, లేదంటే తను ఏదైనా పెయిన్‌ అనుభవిస్తున్నారేమో అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని..ఆ సిచ్యువేషన్‌ను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ టైమ్‌లో కోపంతో ఎదురుదాడి చేయకుండా, ప్రశాంతంగా విని ఆ బాధను షేర్ చేసుకోవడానికి ముందుకు వస్తారు.

అలాగే అనుకోకుండా ఏదైనా, ఎక్కడైనా పొరపాటు జరిగినా కూడా మొండిగా వాదించడం కానీ సాకులు వెతకడం కానీ వీరు అసలు చేయరు. నా వైపు కూడా తప్పు ఉంది, క్షమించు అని మనస్ఫూర్తిగా అంగీకరించే పెద్ద మనసు వీరికి ఉంటుంది. ఎందుకంటే వారి దృష్టిలో గొడవలో తాము గెలవాలన్నది ఇంపార్టెంట్ కాదు వారికి ఆ బంధం నిలబడటం ముఖ్యం. తమ ఎమోషన్స్‌ను కంట్రోల్‌లో  ఉంచుకుంటూ (Emotional Regulation), ప్రతి పరిస్థితికి గుడ్డిగా రియాక్ట్ అవ్వకుండా బాగా ఆలోచించి రెస్పాండ్ అవుతారు.

అయితే మెచ్యూరిటీ అనేది ఏ ఒక్కరికో సొంతం కాదు. మగవారైనా, ఆడవారైనా తమ ఈగోను (Ego) పక్కన పెట్టి, ఎదుటివారి ఫీలింగ్స్‌ను గౌరవించినప్పుడే అలవడుతుంది. బాధ్యతాయుతంగా, కూల్‌గా, నలుగురికి రోల్ మోడల్‌గా ఉండాలనుకునేవారికి ఎప్పుడూ కూడా ఎమోషనల్ మెచ్యూరిటీ(Maturity) చాలా పెద్ద బలం అవుతుంది.

Instagram : లాంగ్ వీడియోలతో ఇన్‌ స్టా రీ ఎంట్రీ..యూట్యూబ్ సామ్రాజ్యానికి చెక్ పెట్టగలదా?

Related Articles

Back to top button