Just LifestyleLatest News

Mirror Response : మీరు ఎదుటివారి ముందు అద్దంలా ఉంటున్నారా? ఆటిట్యూడ్ చూపిస్తున్నారా?

Mirror Response : ఎదుటివారు మీకు ఎలాంటి ఎనర్జీ ఇస్తున్నారో, ఎలాంటి బిహేవియర్‌తో ఉంటున్నారో.. మీరు కూడా వారికి అదే అద్దాన్ని తిప్పి చూపించాలి.

Mirror Response

ఒక కుక్క ముందు నిలబడి ప్రేమతో దగ్గరకు తీసుకోవాలనుకుంటే అది తోక ఊపుతూ దగ్గరకు వస్తుంది. అదే పిచ్చి కుక్క ముందు ప్రేమను ఒలకబోస్తే అది కరిచి ప్రేగులు బయటకు తీస్తుంది. మరి అప్పుడు తప్పు కుక్కదా? లేక రెండూ ఒకటే అనుకుని వాటి ముందు నిలబడిన మీ అమాయకత్వానిదా అంటే ఏం చెబుతారు? ఆన్సర్ వెతుక్కుంటున్నారా?

నిజానికి మనలో చాలామంది తమ జీవితంలో చేసే అతిపెద్ద పొరపాటు ఇదే. లోకంలో ప్రతీ ఒక్కరికీ మన వద్ద ఉన్న ప్రశాంతతను, మంచితనాన్ని, డబ్బులను ఫ్రీగా పంచేస్తూ.. ఆ తర్వాత ఏదొక రోజు అవతలి వాళ్లు మనల్ని తొక్కేస్తే అయ్యో.. నేను మంచిగా ఉన్నాను కదా నన్నెందుకు ఇలా చేశారని ఫీలవుతుంటారు.

ఇక్కడే ఒక విషయం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి, ప్రతీ ఒక్కరి దగ్గర రాముడిలా మంచిగా ఉంటే ఈ సొసైటీ మిమ్మల్ని బతకనివ్వదు. ఎదుటివారు రాముడైతే రాముడిలా ఉండాలి, రావణాసురుడైతే వారికి తగ్గట్టే సమాధానం చెప్పాలి. అవతలివారి నైజం ఏంటో తెలుసుకుని, వారి రేంజ్‌కు తగ్గట్టు మన ప్రవర్తనను మార్చుకోవాలంటారు మానసిక నిపుణులు.సైకాలజీలో దీనిని మిర్రర్ రెస్పాన్స్ (Mirror Response) అంటారని చెబుతున్నారు.

అంటే ఎదుటివారు మీకు ఎలాంటి ఎనర్జీ ఇస్తున్నారో, ఎలాంటి బిహేవియర్‌తో ఉంటున్నారో.. మీరు కూడా వారికి అదే అద్దాన్ని(Mirror Response) తిప్పి చూపించాలి. మీరు ఒకేలా ఉండటం వల్ల ఎదుటివారు మిమ్మల్ని తేలిగ్గా తీసుకుంటారు. మీరు ఎలాంటి వాళ్లో నిరూపించుకోవడానికి మీ స్వభావాన్ని అందరి దగ్గరా చూపించాల్సిన పనిలేదు. అవతలివారి యాక్షన్ ఎలా ఉందో, సరిగ్గా దానికి తగినట్లే మీ రియాక్షన్ ఉండాలి.

మీ మంచిని చూసి మిమ్మల్ని గౌరవించే అమూల్యమైన మనుషులు ఈ సొసైటీలో చాలామంది ఉంటారు. ఇలాంటి వారి దగ్గర మీరు మీ మంచితనాన్ని, నమ్మకాన్ని వంద శాతం చూపించండి. వారు మీకు ఇచ్చే గౌరవానికి డబుల్ రెస్పాన్స్ ఇవ్వండి. ఎందుకంటే అక్కడ మీ మంచితనం మీకు ఆభరణం అవుతుంది.

అలాగే మీరెంత ఎంత మంచిగా ఉన్నా మిమ్మల్ని వాడుకోవాలి, మీ భుజం మీద చేయి వేసి మిమ్మల్ని తొక్కేయాలని చూసే స్వార్థపరులూ ఈ సొసైటీలో చాలామందే ఉన్నారు. వీళ్ల దగ్గర మీరు ఇంకా మంచిగా ఉంటానని అనుకుంటే, ఏదొక రోజు మిమ్మల్ని నిలువునా ముంచేస్తారు. వీళ్ల విషయంలో మీ ఆటిట్యూడ్ వెంటనే మారిపోవాలి.

అంటే ఇక్కడ మీరు డిప్లొమాటిక్‌గా మారాలి. అవతలి వారి స్కెచ్ ఏంటో మీకు అర్థమైందని వాడికి తెలిసేలా మీ ప్రవర్తనలో ఒక పదునైన హద్దు (Sharp Boundary) గీయాలి. ఒక్కోసారి వారు మిమ్మల్ని వాడుకోవడానికి వస్తే, కుదరదని చెప్పే ధైర్యాన్ని చూపించడమే వారికి మీరిచ్చే సరైన కౌంటర్ అవుతుంది.

ఇంకా కొంతమంది ఉంటారు. అనవసరమైన పొగరు, అహంకారంతో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. వీళ్ల దగ్గర మీరు నెమ్మదిగా ఉంటే అది మీ బలహీనత అనుకుంటారు. వీళ్లకు మీ మౌనం సమాధానం కాకూడదు, మీ సైలెన్స్ వెనుక ఉన్న పవర్ తెలియాలి. వాళ్ల అహంకారం తగ్గేలా, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేని విధంగా మీ ఆటిట్యూడ్‌ను ప్రదర్శించాలి.

Mirror Response
Mirror Response

ఈ లోకంలో ప్రతీ ప్లాంట్‌కు నీళ్లు పోస్తే సరిపోదు, కొన్నింటిపై క్రిమిసంహారక మందులు కూడా చల్లాలి. అంటే ఇక్కడ మన బిహేవియర్ అనేది ఒక ఫిక్స్డ్ ఫార్ములా కాదు. ఎదుటివాళ్లు పువ్వు విసిరితే పువ్వును ఇవ్వాలి, ముల్లు విసిరితే రాయిని చూపించాలి. దీనిలో మీది ఎలాంటి తప్పు లేదు, ఇది క్రూరత్వం అంతకంటే కాదు. ఇది మీ మనసును, మీ ఉనికిని కాపాడుకోవడానికి మీకు మీరిచ్చుకునే ఒక ప్రొటెక్షన్ మాత్రమే.

అందుకే నేను మంచివాడిని, అందరితో ఒకేలా ఉంటానని అనకుండా.. అవతలివారి నైజం ఏంటో గమనించాలి. వారి స్థాయి ఏంటో కొలత వేసుకోవాలి. దానికి తగ్గట్టే మీ రెస్పాన్స్ ఉండాలి. అవతలివారిని బట్టి ఎలా ఉండాలో మీరు తెలుసుకున్న రోజే.. ఈ లోకంలో మిమ్మల్ని ఎవరూ గాయపరచలేరు, మీ మనశ్శాంతిని ఎవరూ దోచుకోలేరు.

Mega 158 : మెగా 158 స్పెషల్ వీడియో.. చిరు ఫ్యాన్స్‌కి మైండ్ బ్లాకింగ్ స్టఫ్

Related Articles

Back to top button