Office Politics : జూనియర్స్‌తోనూ పోటీపడే బాస్‌లు.. ఆఫీస్ పాలిటిక్స్‌కు చెక్ పెట్టే సైకాలజీ హ్యాక్స్ ఫాలో అవ్వండి..
Office Politics : కొంతమంది సీనియర్లు ఏళ్ల తరబడి ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే, కొత్తగా వచ్చిన జూనియర్లతో కాంపిటీషన్‌కి దిగుతారు.
Office Politics
ప్రతీ నెలా శాలరీ క్రెడిట్ అయ్యే మెసేజ్ ఇచ్చే కిక్ ఎలా ఉంటుందో ప్రతీ ఉద్యోగికి తెలుసు. కానీ దీని వెనుక జాబ్ ప్రొఫైల్, డెడ్‌లైన్స్ ఇచ్చే ప్రెజర్ ఒక ఎత్తయితే.. తోటి కొలీగ్స్, బాస్‌లు ఆడే మైండ్ గేమ్స్‌తో వచ్చే టార్చర్ మరోలా ఉంటుందన్న విషయం మాత్రం కొంతమంది ఉద్యోగులకు బాగా తెలుసు. అయితే ప్రొఫెషనల్ లైఫ్‌ని నరకం చేసే ఇలాంటి ఆఫీస్ పాలిటిక్స్(Office Politics) నుంచి వారి మెంటల్ పీస్‌ని కాపాడుకుంటూనే.. కూల్‌గా కౌంటర్ ఎలా ఇవ్వాలో తెలుసుకుంటే చాలని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు.
మెయిన్‌గా ఆఫీస్‌లో వర్క్ నేర్చుకునే ప్రాసెస్‌లో బేసిక్ డౌట్స్ రావడం ఎవరికైనా కామన్. అయితే కొందరు సీనియర్లు, బాస్‌లు మాత్రం ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి అసలు ఇష్టపడరు. కావాలనే సేఫ్ గేమ్ ఆడుతూ, మీకు ఇన్ఫర్మేషన్‌ను ఇవ్వకుండా తప్పించుకుంటారు. దీనినే సైకాలజీలో నాలెడ్జ్ హోర్డింగ్ అంటారు. అంటే తమ నాలెడ్జ్ బయటపడితే ఎక్కడ తమ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందో, ఎక్కడ జూనియర్స్ తమను దాటుకుని వెళ్లిపోతారో అనే ఒకలాంటి ఇన్‌సెక్యూరిటీ వీరిలో ఉంటుంది. అంటే ఇది తమ పొజిషన్‌ని కాపాడుకోవడం కోసం జూనియర్ల గ్రోత్‌ను ఆపడానికి ప్రయత్నించే రెడ్ ఫ్లాగ్ అన్నమాట.
ఇక కొంతమంది సీనియర్లు అయితే ఏళ్ల తరబడి ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే, కొత్తగా వచ్చిన జూనియర్లతో కాంపిటీషన్‌కి దిగుతారు. జూనియర్ ఏదైనా మంచి ఐడియా ఇచ్చినా లేదంటే అప్రీషియేషన్ సాధించినా అస్సలు తట్టుకోలేరు. ఈ ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల.. ఎంత సీనియారిటీ ఉన్నా కూడా వారి లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గి.. జూనియర్లతో కంపేర్ చేసుకుంటూ పోటీ పడతారు. తమ ఎగ్జిస్టెన్సీ కాపాడుకోవడానికి చేసే ఒక నెగిటివ్ ప్రయత్నమే ఇది.
అన్నింటికంటే దారుణమైన విషయం పర్సనల్ టార్గెటింగ్. కొంతమంది ఉద్యోగులను కావాలని అందరి ముందూ పాయింట్ అవుట్ చేయడం,వారిపై ఇన్ డైరెక్ట్ సెటైర్లు వేయడం, లిమిట్స్ క్రాస్ అయి మాట్లాడటం వంటివి చేస్తారు. దీనిని సైకాలజీలో వర్క్‌ప్లేస్ బుల్లీయింగ్ అంటారు. ఎదుటివారి సెల్ఫ్ రెస్పెక్ట్‌ని, కాన్ఫిడెన్స్‌ని కావాలని దెబ్బతీసి, వారిని మెంటల్‌గా డౌన్ చేయడమే వీరి మెయిన్ టార్గెట్ అన్నమాట. అంటే..తాము టాప్‌లో ఉన్నామని ఫీల్ అవ్వడానికి ఎదుటివారిని తొక్కేసే సైకలాజికల్ మైండ్‌సెట్.
దీనికితోడు అన్ని ఆఫీసుల్లో బాస్‌లను కాకా పట్టడం అనే పెద్ద టాక్సిక్ కల్చర్ పెరిగిపోతుంది. బాస్‌లు,సీనియర్లు వేసే కుళ్లు జోకులకు నవ్వడం, వారితో అన్ని రకాలుగా క్లోజ్‌గా మూవ్ అవడం అలాగే వారి వెంటే తిరుగుతూ భజన చేసే బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఇలాంటి సికోఫాన్సీ (Sycophancy) లేదా ఆయిల్ పూసే మైండ్‌సెట్ కొంతమందికి ఉండదు. బాస్ పెట్స్, బిస్కెట్ గ్యాంగ్‌లకు దూరంగా ఉంటూ తమ వర్క్ మాత్రమే చేసుకునే ఇలాంటి స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉద్యోగులను సీనియర్లు, బాస్‌లు కావాలని కార్నర్ చేసి టార్గెట్ చేస్తుంటారు.
అయితే ఇలాంటి టాక్సిక్ ఎన్విరాన్‌మెంట్‌ని డీల్ చేయడానికి మానసిక నిపుణులు చెప్పిన కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అయితే సరిపోతుంది. ఆఫీస్‌లో ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారనుకోండి దాన్ని పర్సనల్‌గా తీసుకోవద్దు. అది మీ క్యాపబిలిటీ లోపం కాదు, వారిలోని ఇన్‌సెక్యూరిటీకి సంకేతమని మీకు తెలిస్తే చాలు.
వారు ఆడే మైండ్ గేమ్‌కి మీ సైడ్ నుంచి కోపం లేదా టెన్షన్ రూపంలో రియాక్షన్ రానంత వరకు వారు సక్సెస్ కానట్లే. అక్కడ కూల్‌గా ఉండటమే మీ అతిపెద్ద ఆయుధం. ఒకవేళ మరీ ఓర్చుకోలేని విధంగా మాట్లాడితే మీరు కూడా అంతే కన్నింగ్‌గా నవ్వుతూ వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చేయండి.

అలాగే ప్రొఫెషనల్ సేఫ్‌గా ఉండటం నేర్చుకోవాలి. సీనియర్లు వర్క్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే, మీ క్వెరీస్‌ని అఫీషియల్ ఈమెయిల్స్ లేదంటే చాట్స్ రూపంలో అడగటం అలవాటు చేసుకోండి. దీనివల్ల వర్క్‌లో మీ వైపు నుంచి క్లియర్‌గా ఉన్నారనే ప్రూఫ్స్ మీ దగ్గర ఉంటాయి. దీనివల్ల ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఆఫీస్ పాలిటిక్స్(Office Politics) నడిచినా డాక్యుమెంటేషన్ మిమ్మల్ని సేవ్ చేస్తుంది.
ఆఫీస్(Office Politics) డోర్ దాటాక ఆ టాక్సిసిటీని మీ మైండ్‌లోకి రానివ్వొద్దు. ఆఫీస్ ప్రెజర్‌ని పర్సనల్ లైఫ్‌కి కనెక్ట్ చేస్తే కనుక మీ ప్రశాంతతే పాడవుతుంది. ఒకవేళ ఏ సీనియర్ అయినా ప్రొఫెషనల్ లిమిట్స్ దాటి ప్రవర్తిస్తే కనుక విత్ ప్రూఫ్స్ హెచ్ఆర్ (HR) టీమ్‌ని అప్రోచ్ అవ్వడానికి కూడా వెనుకాడకండి. పరిస్థితిని ఎప్పుడూ కూడా ఎమోషనల్‌గా కాకుండా సైకలాజికల్‌గా, ప్రాక్టికల్‌గా హ్యాండిల్ చేస్తే మాత్రం ఎంతటి టాక్సిక్ బాస్ లేదంటే సీనియర్ అయినా మిమ్మల్నేమీ చేయలేరు. ఎలాంటి ఆఫీస్ పాలిటిక్స్(Office Politics) అయినా కూడా మిమ్మల్ని ఏం చేయలేవు.





