Just LifestyleLatest News

Water Manifestation : వాటర్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? గ్లాసు నీళ్లతో మన కోరికలు తీరుతాయా?

Water Manifestation : వాటర్ మేనిఫెస్టేషన్ నిజంగా పని చేస్తుందా అంటే సైన్స్ ప్రకారం చూస్తే దీనికి ఎలాంటి మాయాజాలం లేదు. దీని వెనుక ఒక సింపుల్ మైండ్ ట్రిక్ ఉంటుందని సైకాలజిస్టులు అంటారు.

Water Manifestation

ఈమధ్య సోషల్ మీడియాలో వాటర్ మేనిఫెస్టేషన్(Water Manifestation) అనే పదం చాలా ఎక్కువగా వినిపిస్తోంది.వాటర్ మేనిఫెస్టేషన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఒక గ్లాసు నీళ్ల సహాయంతో మన మనసులోని కోరికలను లేదంటే మనం సాధించాలనుకునే లక్ష్యాలను నిజం చేసుకోవడానికి ట్రై చేసే ఒక చిన్న మెథడ్. మనం రోజూ మన మైండ్‌లో అనుకునే ఆలోచనలను నిజం చేసుకోవడానికి మన ఇంట్లో ఉండే ఒక గ్లాసు నీటిని తోడుగా వాడుకోవడమే ఈ టెక్నిక్.

దీని కోసం నైట్ పడుకునే ముందు కానీ లేదా ఉదయం లేవగానే కానీ ఒక గ్లాసులో మంచి నీళ్లు తీసుకుంటారు. ఆ గ్లాసును రెండు చేతులతో పట్టుకుని, మనసును ప్రశాంతంగా ఉంచుకుని, తమ లైఫ్‌లో ఏది జరగాలని అనుకుంటున్నారో అది ఆల్రెడీ జరిగినట్లుగా ఊహించుకుని దాన్ని ఒక్క నిమిషం పాటు బలంగా ఆలోచిస్తారు. అంటే ఉదాహరణకు.. ఉద్యోగం రావడం, పరీక్షల్లో మంచి మార్కులు రావడం, హెల్త్ బాగుండడం , జీవితంలో సక్సెస్ అవడం వంటి కోరికలు అప్పటికే నెరవేరిపోయినట్లు మనసులో ఊహించుకుని తర్వాత బయటకు చెబుతారు. ఆ తర్వాత ఆ వాటర్‌ను ప్రశాంతంగా తాగుతారు.

ఇంకొంతమంది రెండు గ్లాసుల పద్ధతిని కూడా వాడుతుంటారు. ఒక గ్లాసులో నీళ్లు పోసి దాని పక్కన తమకున్న ప్రాబ్లెమ్‌ను ఒక పేపర్ మీద రాసి పెడతారు. ఇంకో గ్లాసు పక్కన వారు ఏం సాధించాలనుకుంటున్నారు,వారి డ్రీమ్, లక్ష్యాన్ని రాస్తారు. ఇప్పుడు మొదటి గ్లాసులోని నీటిని రెండో గ్లాసులోకి పోస్తూ.. వారి కోరిక నిజంగానే నెరవేరిపోయినట్లు అనుకుని.. ఆ తర్వాత ఆ వాటర్‌ను తాగుతారు. అలా చేయడం వల్ల మనసులో అలాగే వారి చుట్టూ ఉన్న నెగెటివిటీ పోయి, ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని నమ్ముతారు.

మరి వాటర్ మేనిఫెస్టేషన్(Water Manifestation) నిజంగా పని చేస్తుందా అంటే సైన్స్ ప్రకారం చూస్తే దీనికి ఎలాంటి మాయాజాలం లేదు. దీని వెనుక ఒక సింపుల్ మైండ్ ట్రిక్ ఉంటుందని సైకాలజిస్టులు అంటారు. మనం రోజూ మన డ్రీమ్స్ గురించి ఒక గ్లాసు నీటి ముందు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించినప్పుడు, మన మైండ్ ఆ గోల్ మీద బాగా ఫోకస్ చేయడం వల్ల మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అనుకున్నది సాధించడానికి సరైన నిర్ణయాలను తీసుకుంటాం.

Water Manifestation
Water Manifestation

మనం నీటితో మాట్లాడే మాటలు, మన ఆలోచనలను బట్టి నీటి స్పటికాల (Ice Crystals) ఆకారాలు మారిపోతాయని కొన్ని పరిశోధనలు నిరూపించాయి. మనం నీటి వైపు చూసి ప్రేమ, ధన్యవాదాలు అని పాజిటివ్‌గా మనం అనుకుని, ఆ నీటిని గడ్డ కట్టించినప్పుడు చాలా అందమైన స్పటికాలు ఏర్పడతాయి. అదే ద్వేషం లేదా నెగిటివ్ మాటలు అంటే విరిగిపోయిన, వికారమైన ఆకారాలు వస్తాయని కొన్ని ఫోటోలతో సహా ప్రూవ్ అయ్యాయి. మన బాడీలో 60 శాతానికి పైగా నీళ్లే ఉంటాయి కాబట్టి, మనం పాజిటివ్‌గా ఆలోచిస్తే ఆ నీరు మన బాడీని, మైండ్‌ని మంచిగా మారుస్తుందని ఈ మెథడ్ చెప్తుంది.

Bhogapuram Airport : ఆగస్టు 1 నుంచి భోగాపురం రన్ వే సిద్ధం..ఉత్తరాంధ్రకు పండగే కానీ ప్రయాణం భారమవ్వాల్సిందేనా?

Related Articles

Back to top button