Just LiteratureLatest News

Relationship : మీ బంధం బలహీనపడుతోందా? పార్టనర్‌లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

Relationship : బంధాల విషయంలో నమ్మకమనేది కేవలం ఒక వ్యక్తి చెప్పే మాటల మీద మాత్రమే కాకుండా.. వారి బిహేవియర్లో ఉండే స్థిరత్వం మీద ఆధారపడి ఉంటుంది

Relationship

ఒక బంధం మొదటిలో తన భాగస్వామి తన సర్వస్వం అని, వారి కోసం ప్రాణాలైనా ఇస్తామని చెబుతుంటారు. కానీ మెల్లమెల్లగా సమయాన్ని కేటాయించడానికి కూడా వెనకడుగు వేస్తుంటారు. దీని వెనుక కొన్ని లోతైన మానసిక కారణాలు దాగి ఉంటాయి.

ఇది కేవలం కెరీర్ ఒత్తిడి వల్లనో, సమయం లేకపోవడం వల్లనో జరిగేది కాదు, వారి ఆలోచనా విధానంలో వచ్చే మార్పుల వల్ల సంభవిస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రేమలో మొదట్లో ఉండే ఆరాటం,ఇష్టం, అభిమానం.. రాను రాను అలసత్వంగా మారిపోతుంది. దీనిని మనస్తత్వశాస్త్రంలో ఎమోషనల్ విత్‌ డ్రాయల్ లేదా కంప్లెసెన్సీ అని పిలుస్తారు.

బంధాల(Relationship) విషయంలో నమ్మకమనేది కేవలం ఒక వ్యక్తి చెప్పే మాటల మీద మాత్రమే కాకుండా.. వారి బిహేవియర్లో ఉండే స్థిరత్వం(Consistency) మీద ఆధారపడి ఉంటుంది. దీనికి రీజన్‌ ఏ బంధంలోనైనా మొదటి దశలో హనీమూన్ ఫేజ్ ఉంటుంది. అప్పుడు మెదడులో డోపమైన్ వంటి కెమికల్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యి.. పార్టనర్ పట్ల విపరీతమైన ఆకర్షణను, ఆరాటాన్ని కలిగిస్తాయి.

ఆ టైములో అసాధ్యమైన వాగ్దానాలు కూడా చేయడం, గంటల తరబడి ఫోన్లలో మాట్లాడటం చేస్తుంటారు. కానీ బంధం(Relationship) పాతబడే కొద్దీ, పార్టనర్‌ తమకు సొంతం అయిపోయారనే భరోసా వారిలో ఒక రకమైన నిర్లక్ష్యాన్ని పెంచుతుంది. ఇక వారిని ఆకట్టుకోవడానికి స్పెషల్‌గా ప్రయత్నించాల్సిన అవసరం లేదనే ఆలోచన మొదలవుతుంది. దీనివల్ల మొదట్లో ఇచ్చిన ఇంపార్టెన్స్ మెల్లమెల్లగా తగ్గిపోతుంది.

ముఖ్యంగా ఫోన్ ఎప్పుడూ బిజీ రావడం కానీ.. బిజీగా ఉన్నానని తప్పించుకోవడం వంటివి కానీ అవాయిడెంట్ అటాచ్మెంట్ స్టైల్‌కు సంకేతాలు కావొచ్చు. అంటే బంధం మరీ దగ్గరవుతున్నప్పుడు, బాధ్యతలు పెరుగుతున్నాయనో, పార్టనర్‌ పద్ధతులు నచ్చకో తమకు తెలీకుండానే దూరం పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు.

అడిగితే మాత్రం తానేమీ మారలేదని, ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నానని చెబుతూ ఉంటారు. అంటే ఎదుటివారు వారిలో మార్పును గమనిస్తున్నా, అది వారి భ్రమ అని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇలా మాటలకు, చేతలకు పొంతన లేకపోవడమనేది బంధంలో పారదర్శకత (Transparency) లోపించిందని చెప్పడానికి ఉదాహరణ అని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Relationship
Relationship

నిజానికి ప్రేమ అనేది మాటల్లో మాత్రమే ఉండేది కాదు, అది నిరంతరంగా చూపించాల్సిన ఆచరణ. ఒక వ్యక్తి తనను తాను మార్చుకున్నానని ఒప్పుకోకపోవడానికి కారణం, వారిలో ఉండే ఈగో లేదా ఆ బంధాన్ని తేలికగా తీసుకోవడం అని సైకాలజిస్టులు అంటున్నారు. నవ్వుతూ పార్టనర్స్‌ను కన్విన్స్ చేయడమనేది ఆ నిమిషానికి సమస్యను దాటవేయడమే తప్ప పరిష్కరించడం కాదు.

అయితే ఇటువంటి ప్రవర్తన పార్టనర్‌లో ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ పెరిగి.. మానసిక వేదనను మిగులుస్తుంది. బంధం నిలబడాలంటే పరస్పర గౌరవం, ఇంపార్టెన్స్ ఇవ్వడం ముఖ్యం. అయితే ఎలాంటి కారణాలు లేకపోయినా సమయాన్ని ఇవ్వడానికి ఆలోచిస్తున్నారంటే, ఆ బంధం యొక్క పునాదులను ఒకసారి పునఃపరిశీలించుకుని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అర్థం

Self Talk : ఆత్మవిమర్శ అనే అడ్డంకి మిమ్మల్నీ అడ్డుకుంటుందా?..నెగటివ్ సెల్ఫ్ టాక్ ఎందుకు?

Related Articles

Back to top button