Just NationalJust TechnologyLatest News

Ration Card:రేషన్ కార్డు ఉన్నవారికి అలెర్ట్.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి కొత్త రూల్స్..

Ration Card: పారదర్శకతను పెంచడంతో పాటు అర్హత లేని వారిని జాబితా నుంచి తొలగించడమే ఈ కొత్త నిబంధనల ప్రధాన లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది.

Ration Card

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఉచిత రేషన్ సౌకర్యం అనేది దేశంలోని కోట్లాది మంది పేద కుటుంబాలకు పెద్ద ఊరట అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి ఈ పథకం కేవలం నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుంచి రేషన్ పంపిణీ వ్యవస్థలో భారీ మార్పులు తీసుకువస్తోంది.

కేవలం కొత్తగా కార్డు కోసం అప్లై చేసుకునే వారే కాదు..వారితో పాటు ఇప్పటికే కార్డు కలిగి ఉన్నవాళ్లు కూడా ఈ మార్పులను గమనించకపోతే మాత్రం భవిష్యత్తులో వారు రేషన్ కోటాను కోల్పోయే ప్రమాదం ఉంది. పారదర్శకతను పెంచడంతో పాటు అర్హత లేని వారిని జాబితా నుంచి తొలగించడమే ఈ కొత్త నిబంధనల ప్రధాన లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది.

ముఖ్యంగా రేషన్ కార్డు(Ration Card)లో పేరున్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇప్పుడు ఇ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడం తప్పనిసరి చేశారు. గతంలో ఇంటి యజమాని బయోమెట్రిక్ వేస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ దగ్గరలోని రేషన్ షాపునకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా తమ గుర్తింపును ధృవీకరించుకోవాలి.

Ration Card
Ration Card

ఒకవేళ మీరు షాపునకు వెళ్లలేని పరిస్థితిలో ఉంటే కనుక, మేరా రేషన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి ఇంట్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. ఒకవేళ మీరే కనుక ఏప్రిల్ 1 గడువులోగా ఇది పూర్తి చేయకపోతే మీ పేర్లను రేషన్ జాబితా నుంచి శాశ్వతంగా తొలగించే అవకాశం ఉంది. దీనివల్ల కుటుంబంలో ఉన్న సభ్యుల సంఖ్య తగ్గిపోవడంతో పాటు, మీకు అందే బియ్యం ఇతర సరుకుల క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది.

మరో ముఖ్యమైన మార్పు ఏంటంటే, ఇకపై కొత్త రేషన్ కార్డు(Ration Card) కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా డిజిటల్ మయం చేయడంతో.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఫుడ్ సప్లై ఆఫీసర్ స్వయంగా మీ ఇంటికి వచ్చి మీ వివరాలను ధృవీకరించాకే కార్డు జారీ అవుతుంది.

Live for Yourself: లోకం మెచ్చే బతుకు కాదు.. నీ కోసం నువ్వు జీవించడం మర్చిపోకు

Related Articles

Back to top button