Just NationalLatest News

Crimes Against Women : మహిళలపై నేరాల కేసుల్లో ఏపీకి రెండో స్థానం..ఏడీఆర్ నివేదికలో సిగ్గుపడే నిజాలు..

Crimes Against Women : దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై ఉన్న మహిళా వ్యతిరేక నేరాల కేసులను ఏడీఆర్ నివేదిక బయటపెట్టింది. తెలుగు రాష్ట్రాల వివరాలతో పాటు పార్టీల వారీగా నమోదైన కేసుల వివరాలను ఇక్కడ చూడండి.

Crimes Against Women

మహిళల భద్రతపైన వారి హక్కుల పైన చట్టసభల్లో సుదీర్ఘంగా ప్రసంగాలు దంచికొట్టే ప్రజాప్రతినిధుల అసలు నైజం ఇప్పుడు బయటపడింది. ప్రజాప్రతినిధులే మహిళలపైన అఘాయిత్యాలు, వేధింపులు ,అత్యాచారం కేసుల్లో నిందితులుగా ఉన్నారనే భయంకరమైన నిజాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన రిపోర్ట్‌లో బట్టబయలు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధుల ఎన్నికల అఫిడవిట్లను అనలైజ్ చేసి రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.

ఈ రిపోర్ట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 4,881 మంది సిట్టింగ్ ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలలో ఏకంగా 187 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు నమోదవడం షాక్ కలిగిస్తోంది. వీరిలో 19 మంది ఎంపీలు కాగా 168 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే.. ఈ కేసులలో 14 మంది నేతలలో 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలపై డైరెక్టుగా అత్యాచారం (IPC 376) కేసులు ఉండడం దేశంలోని రాజకీయ నేతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తోంది.

అయితే ఈ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాల గణాంకాలు మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి. మహిళలపై నేరాల కేసులు ఉన్న ప్రజాప్రతినిధుల సంఖ్యలో ఏపీ ఏకంగా 22 మందితో అంటే 21 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీతో దేశంలోనే రెండో స్థానంలో నిలవడం నిజంగా షాక్ కలిగించే విషయమే. వీరిలో అధికార ప్రభుత్వంలో ఉన్న నలుగురు మంత్రులతో పాటు ఒక సీనియర్ నేత, వివాదాస్పద ఎమ్మెల్యే, యువ ఎంపీపైన కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నట్లు నివేదిక క్లారిటీ ఇచ్చింది. ఇక తెలంగాణలో అయితే ముగ్గురు లోక్‌సభ ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం ఐదుగురిపై మహిళలపై నేరాలు చేసిన కేసులు ఉన్నాయి.

అలాగే పార్టీల పరంగా ఈ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. కమలం పార్టీ (BJP) కి చెందిన 106 మంది ప్రజాప్రతినిధులలో 95 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎంపీలు ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా, కాంగ్రెస్ నుంచి 20 మంది, టీడీపీ నుంచి 18 మందితో థర్డ్ ప్లేస్‌లో ఉన్నాయి. బీజేపీకి చెందిన 11 మంది ఎంపీలలో ఐదుమంది కేంద్ర మంత్రులు కూడా ఉండటం గమనార్హం.

రాష్ట్రాల పరంగా చూస్తే కనుక.. పశ్చిమ బెంగాల్ 69 కేసులతో ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, ఏపీ 22 కేసులతో రెండో స్థానంలోనూ, ఒడిశా 17 కేసులతో మూడో స్థానంలో నిలిచాయి. ఇటువంటి క్రిమినల్ హిస్టరీ(Crimes Against Women) ఉన్నవారికి టిక్కెట్లు ఇవ్వడాన్ని ఏడీఆర్ తీవ్రంగా తప్పుబట్టింది. వారిని ఎలక్షన్స్‌లో పోటీ చేయకుండా పర్మినెంట్‌గా బ్యాన్ చేయాలని, వారి కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

Decision : లైఫ్‌లో సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారా? కన్ఫ్యూజన్‌కు ఇలా చెక్ పెట్టండి..

Related Articles

Back to top button