Just NationalLatest News

Nuclear Weapons : గ్లోబల్ న్యూక్లియర్ పవర్ గేమ్‌లో దూసుకుపోతున్న ఇండియా ..భారత్ వద్ద 190 అణ్వాయుధాలు

Nuclear Weapons : భారతదేశపు వ్యూహాత్మక ఆయుధాగారంలో ప్రస్తుతం సుమారు 190 అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నాయి.

Nuclear Weapons

బోర్డర్‌లో చిన్న అలజడి రేగినా సరే, శత్రువుల గుండెల్లో బుల్లెట్లు పరిగెత్తించే రేంజ్‌కు భారత్ తన రక్షణ కవచాన్ని పెంచుకుంది. ఆకాశం, భూమి, సముద్రం.. ఈ మూడింటిలో ఏ వైపు నుంచి శత్రువు దాడికి తెగపడినా, అదే స్థాయిలో కోలుకోలేని ప్రతిదాడి చేసే విధంగా భారతదేశం తన న్యూక్లియర్ ట్రయాడ్ పవర్‌ను కంటికి రెప్పలా ఆధునీకరిస్తోంది.

భారత డిఫెన్స్ పవర్‌ని గ్లోబల్ దేశాలు మరోసారి విస్తుబోతూ చూసేలా ఇంటర్నేషనల్ సంస్థలైన ..బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్ అండ్ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) సెన్సేషన్ రిపోర్టులను బయటపెట్టాయి. తాము ఏ దేశంపైన కూడా ముందుగా అణుదాడి చేయమనే ప్రశాంతమైన సిద్ధాంతాన్ని పాటించడంతో పాటు, శత్రువు స్వైరవిహారం చేస్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదనే బలమైన సంకేతాన్ని భారత్ ప్రపంచవ్యాప్తంగా పంపించింది.

నిజానికి భారత దేశం ఎప్పుడూ తన వద్దనున్న అణు నిల్వల లెక్కలను అఫీషియల్‌గా బయటకు చెప్పదు. అయితే గ్లోబల్ రీసెర్చర్ల అంచనాల ప్రకారం..భారతదేశపు వ్యూహాత్మక ఆయుధాగారంలో ప్రస్తుతం సుమారు 190 అణ్వాయుధాలు(Nuclear Weapons) సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది కాలంలోనే భారత్ మరో 10 కొత్త అణు వార్‌హెడ్లను పెంచుకుంటూ పోయి, దాయాది దేశమైన పాకిస్తాన్‌ను కూడా దాటేసింది.

ఇండియా డెవలప్‌‌మెంట్స్ అన్నింటిలో మేజర్ హైలైట్ ఏంటంటే.. విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా డీఆర్‌డీఓ (DRDO) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణులే భారత్‌కు అసలైన డిఫెన్సివ్ వాల్‌గా నిలిచాయి. నింగిలో మిరాజ్ 2000, జాగ్వార్ విమానాలు అణుబాంబులను వేసే కెపాసిటీ కలిగి ఉండగా, ఫ్యూచర్‌లో ఈ ప్లేస్‌లోకి ఫ్రాన్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ రఫేల్ యుద్ధ విమానాలు ఎంటర్ కాబోతున్నాయి.

ఇక భారత్ సాయుధ దళాల వెన్నెముకగా పిలుచుకునే అగ్ని క్షిపణి శ్రేణి ఇప్పటికే శత్రువులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అగ్ని-I నుంచి అగ్ని-IV వరకు ఉన్న క్షిపణులు 700 కిలోమీటర్ల నుంచి 3,500 కిలోమీటర్ల పైబడిన దూరాలను నిమిషాల్లో చేరుకోగలవు. ఇక ఏకంగా 6,000 కిలోమీటర్ల సుదూర టార్గెట్‌లను ఛేదించగల అగ్ని-5 క్షిపణి పరిధిలోకి మొత్తం పాకిస్తాన్, చైనా భూభాగాలతో పాటు మిడిల్ ఈస్ట్, యూరప్‌లోని మెయిన్ భాగాలు వస్తాయి. ఒక్కసారి ప్రయోగిస్తే వేర్వేరు టార్గెట్లను ఒకే టైమ్‌లో ధ్వంసం చేసే మిర్వ్ (MIRV) టెక్నాలజీని కూడా ఇండియా విజయవంతంగా పరీక్షించింది.

అన్నింటికంటే సముద్ర అంతర్భాగం నుంచి దాడి చేసే కెపాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. శత్రువులు ఒకవేళ అటాక్ చేసినా కూడా, వాటర్ అడుగు భాగాన దాక్కుని రివర్స్ అటాక్ చేయడంలో భారత్ థర్డ్ ఇండిజినస్ న్యూక్లియర్ సబ్‌మరైన్ ఐఎన్ఎస్ అరిధమన్‌ను నేవీలోకి చేర్చింది. ఇప్పటికే సీక్రెట్‌గా ఆన్ డ్యూటీలో ఉన్న ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్‌తో పాటు ఐఎన్ఎస్ అరిధమన్ తోడవ్వడంతో .. ఇండియన్ నేవీ హిందూ మహాసముద్రంలో ఎదురులేని పవర్ వెపన్‌గా మారింది. సముద్ర గర్భం నుంచి ప్రయోగించే కే-4 (K-4) మిస్సైళ్లు కూడా త్వరలోనే ఫుల్ ప్లెడ్జ్‌డ్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాయి.

Nuclear Weapons
Nuclear Weapons

ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా సాగుతున్న యుద్ధాల వల్ల అణుదేశాలు తమ ఆయుధాలను విపరీతంగా పెంచుకుంటున్నాయి. సిప్రి (SIPRI)గణాంకాల ప్రకారం వరల్డ్‌లో మొత్తం 9 అణుశక్తి దేశాలు ఉండగా, వాటి వద్ద దాదాపు 12 వేలకు పైగా అణ్వాయుధాలు(Nuclear Weapons) ఉన్నాయి. దీనిలో అగ్రరాజ్యాలైన రష్యా వద్ద 5,420 ఉండగా అమెరికా వద్ద 5,042 అణు వార్‌హెడ్లు కలిగి ఉండి టాప్‌లో ఉన్నాయి.

ఇటు చైనా కూడా ఒక్క ఏడాదిలోనే 20 వార్‌హెడ్లు పెంచుకుని 620 అణ్వాయుధాలతో(Nuclear Weapons) థర్డ్ ప్లేస్‌లో నిలిచింది.అలాగే ఫ్రాన్స్ వద్ద 370, యూకే వద్ద 225, ఇజ్రాయిల్ వద్ద 90, ఉత్తర కొరియా వద్ద 60 అణ్వాయుధాలు(Nuclear Weapons) ఉన్నట్లు లెక్క తేలింది. ఈ గ్లోబల్ పోటీ మధ్య భారతదేశం తన సైనిక శక్తితో పాటు స్వదేశీ డిఫెన్స్ టెక్నాలజీని పెంచుకుంటూ సరిహద్దులకు పూర్తి భద్రతను ఇస్తోంది.

Avocado : బరువు తగ్గడానికే కాదు బ్రెయిన్‌కి కూడా బాస్..అవకాడోను రెగ్యులర్‌గా తింటే బోలెడ్ బెనిఫిట్స్..

Related Articles

Back to top button