Just Nationaljust AnalysisLatest News

ITR Filing : ఐటీఆర్ ఫైల్ చేసేశారా? ఈ 5 విషయాలు చెక్ చేయకపోతే ఇబ్బందులే

ITR Filing : రీఫండ్ పొందడానికి కనెక్ట్ చేసిన బ్యాంకు అకౌంట్ వివరాలను చెక్ చేయాలి. మీరు ఇచ్చిన అకౌంట్ కరెక్టుగా ఉందో లేదో, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో ముందే వెరిఫై అయిందో లేదో చూసుకోవాలి.

ITR Filing

ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించడానికి ఆఖరి తేదీకి మరికొద్ది గంటలే మిగిలి ఉండటంతో చాలామంది ట్యాక్స్ పేయర్స్ త్వరత్వరగా తమ ఐటీఆర్‌ను ఫైల్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ తర్వాత ఫైల్ చేద్దాం అనుకుంటూ వాయిదా వేసిన వాళ్లంతా జూలై 31 వ తేదీ దగ్గరపడేసరికి ఐటీఆర్‌ ఫైల్(ITR Filing) చేయడంలో బిజీ అయిపోయారు.

అయితే ఈ కంగారులో చేసే చిన్న చిన్న పొరపాట్లు, బ్యాంకు అకౌంట్‌ వివరాల్లో తప్పులు, ఆదాయపు వివరాలలో తేడాలు రావడం వల్ల రీఫండ్‌లు ఆలస్యం అవడం లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే రిటర్న్ సమర్పించాక ఈ 5 కీలకమైన విషయాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

మొదటిది, మీరు ఫైల్ చేసిన రిటర్న్ ఈ-వెరిఫై అయిందో లేదో కచ్చితంగా కన్ఫమ్ చేసుకోవాలి. కేవలం ఐటీఆర్ దాఖలు చేయడంతో పని పూర్తి అయిపోయినట్లు కాదు. ఆధార్ వద్దకు వచ్చే ఓటీపీ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ లేదా ఇతర మార్గాల ద్వారా దానిని వెరిఫై చేయాలి.

ఒకవేళ ఆన్‌లైన్‌లో వీలుకాకపోతే సైన్ చేసిన ఐటీఆర్-వి కాపీని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు పంపించాలి. వెరిఫికేషన్ పూర్తి గాని రిటర్న్‌ను అసలు ఫైల్ చేయనట్లే భావిస్తారు. ఈ ప్రాసెస్‌ను ఐటీఆర్ సమర్పించిన 30 రోజుల్లోపు పూర్తి చేయడం తప్పనిసరి.

ఏఐఎస్, టీఐఎస్ , ఫారం 26ఏఎస్ పత్రాలను మళ్లీ ఒకసారి పరిశీలించాలి. మీరు రిటర్న్ ఫైల్ చేయడానికి ముందు వీటిని చూసినా కూడా, బ్యాంకులు లేదా యజమానులు తర్వాత కూడా వడ్డీ వివరాలు లేదా టీడీఎస్ వివరాలను పోర్టల్‌లో అప్‌డేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ రిపోర్ట్‌లో ఉన్న వివరాలకు, మీరు ఫైల్ చేసిన ఇన్ఫర్మేషన్‌కు తేడాలు ఉంటే, సరిదిద్దిన రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది.

అలాగే రీఫండ్ పొందడానికి కనెక్ట్ చేసిన బ్యాంకు అకౌంట్ వివరాలను చెక్ చేయాలి. మీరు ఇచ్చిన అకౌంట్ కరెక్టుగా ఉందో లేదో, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో ముందే వెరిఫై అయిందో లేదో చూసుకోవాలి. అకౌంట్ నెంబర్ లేదా ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లో చిన్న తప్పు ఉన్నా మీ రీఫండ్ ఆగిపోయే ప్రమాదం ఉంది.

అలాగే మీరు క్లెయిమ్ చేసిన పన్ను మినహాయింపులు , ట్యాక్స్ లెక్కింపులను రీచెక్ చేసుకోవాలి. మీకు వర్తించే అన్ని తగ్గింపులను సరిగ్గా ఎంటర్ చేశారో లేదో, అలాగే లెక్కల్లో ఏమైనా పొరపాట్లు జరిగి ఎక్స్‌ట్రా ట్యాక్స్ పడే అవకాశం ఉందేమో చూసుకోవాలి.

ITR Filing
ITR Filing

ఇక ఐదోది ఏంటంటే.. మీ రిటర్న్‌లో ఏమైనా ఫైల్ చేయాల్సిన విషయాలను మర్చిపోయారా అని ఒకసారి అంతా సరిచూసుకోవాలి. శాలరీ, బ్యాంకు , ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ ఇన్కమ్, షేర్లు , ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన లాభాలు, అద్దె ఇన్కమ్, వర్తించే పన్ను మినహాయింపులు వంటివి అలాగే ఒకవేళ ఉంటే విదేశీ ఆస్తుల వివరాలు ఇలా అన్నీ సరిగ్గా నమోదు చేశారో లేదో జాగ్రత్తగా గమనించాలి.

ఒకవేళ మీరు ఐటీఆర్ ఫైల్(ITR Filing) చేసి వెరిఫై చేసిన తర్వాత ఏమైనా ఇన్కమ్ వివరాలు మర్చిపోయినా లేదా తప్పుగా క్లెయిమ్ చేసినట్లు గుర్తించినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పాత రిటర్న్ స్థానంలో సరికొత్త వివరాలతో రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. లేట్‌గా లేదా కరెక్షన్ చేసి రిటర్న్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు కూడా సమయం ఉంటుంది.

BLDC Fans : కరెంటు బిల్లు షాక్ కొడుతోందా? BLDC ఫ్యాన్‌లతో దీనికి చెక్ పెట్టొచ్చా?

Related Articles

Back to top button