Narendra Modi : నరేంద్ర మోదీ సరికొత్త రికార్డ్.. నెహ్రూ సుదీర్ఘ రికార్డు బద్దలు
Narendra Modi :భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. బుధవారం నాటికి ప్రధానిగా 12 ఏళ్ల (4,399 రోజులు) పదవీకాలాన్ని మోదీ పూర్తి చేసుకున్నారు
Narendra Modi
భారత రాజకీయ యవనికపై నయా హిస్టరీ లిఖించబడింది. దేశంలోనే ఎక్కువ కాలం కంటిన్యూగా ప్రజల చేత ఎన్నుకోబడిన పీఎంగా నరేంద్ర మోదీ(Narendra Modi) సరికొత్త రికార్డును తన పేరుతో లిఖించుకున్నారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరుతో ఉన్న సుదీర్ఘ పదవీకాలపు రికార్డును తాజాగా మోదీ అధిగమించారు.
దాదాపు 4,399 రోజుల పాటు కంటిన్యూగా ప్రధాని పీఠంపై కొనసాగుతూ.. ఈ చారిత్రక మైలురాయిని నరేంద్ర మోదీ(Narendra Modi) సొంతం చేసుకున్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు , అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తూ ఈ వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఈ సంబరాల హోరు తెలుగు రాష్ట్రాల్లో కూడా గట్టిగా కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు కొన్నిచోట్ల ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. దీనిలో భాగంగా మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లోని ప్రసిద్ధ శివాలయంలో.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ప్రధాని మోదీ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో దేశానికి మరిన్ని సేవలను అందించాలని బీజేపీ కార్యకర్తలు ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన, దేశ భద్రతతో పాటు అప్రతిహత డెవలప్మెంట్ వంటి రంగాలలో మోదీ తనదైన లీడర్‌షిప్‌తో దేశాన్ని ఒక సరికొత్త శిఖరానికి చేర్చారని నేతలు కొనియాడారు.

గడిచిన పన్నెండేళ్ల కాలంలో మన దేశాన్ని గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌస్‌గా మార్చడంలో.. ప్రపంచ ఆర్థిక శక్తుల సరసన నిలబెట్టడంలో నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలు ఎంతో కీలకమైనవని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం భారతదేశం వికసిత్ భారత్ అనే ఒకే ఒక్క లక్ష్యంతో అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్తోందని.. అందుకే ఈ అరుదైన రోజును తెలంగాణలోని ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో కార్యకర్తలు ఒక పండుగలా జరుపుకుంటున్నారని నేతలు అన్నారు. ప్రధాని మోదీపై దేశ ప్రజల ఆదరాభిమానాలు, దేవుని ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక హారతులు సమర్పించారు.
Afghanistan : అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ దాడి..11 మంది చిన్నారులు బలి





