srisailam : శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త..
శ్రీశైలం మహాక్షేత్రంలో కొలువైన మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త తెలిపారు. ఇటీవల పునఃప్రారంభించిన స్వామివారి ఉచిత స్పర్శ దర్శనానికి సంబంధించి, ఇకపై టోకెన్ల పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు.

శ్రీశైలం(srisailam) మహాక్షేత్రం (devasthanam)లో కొలువైన మల్లికార్జున స్వామి (Mallikarjuna Swamy)ని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త తెలిపారు. ఇటీవల పునఃప్రారంభించిన స్వామివారి ఉచిత స్పర్శ దర్శనానికి సంబంధించి, ఇకపై టోకెన్ల పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు. ఈ టోకెన్లు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే జారీ చేయబడతాయని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
Srisailam Temple:
శ్రీశైలంలో ఆన్‌లైన్ స్పర్శ దర్శనం టోకెన్లు- పూర్తి వివరాలు
జూలై 1వ తేదీ నుంచి స్పర్శ దర్శనం ప్రారంభమైన తర్వాత శ్రీశైలం (srisailam) మల్లికార్జున స్వామి భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో పాటు, రద్దీ కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, దర్శన ప్రక్రియను సులభతరం చేసేందుకు శ్రీశైలం ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం పరిపాలన భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించిన ఆలయ ఈవో, సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా స్వామివారి స్పర్శ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
ప్రస్తుతం స్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఎలా పొందుతున్నారో, అదే విధంగా భక్తులు ఈ ఉచిత స్పర్శ దర్శన టోకెన్లను కూడా ఆన్‌లైన్‌లో పొందవచ్చు. అయితే, ఈ టోకెన్లను ఎవరైనా దుర్వినియోగం చేసినట్లు తేలితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈవో స్పష్టం చేశారు.
టోకెన్లు పొందే విధానం మరియు సమయాలు:
స్వామివారి స్పర్శ దర్శన టోకెన్లు( Online Tokens) వచ్చే వారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. భక్తులు తమ దర్శన సమయాన్ని ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
టోకెన్లు అందుబాటులో ఉండే రోజులు మరియు సమయాలు:
ప్రతి మంగళవారం నుండి శుక్రవారం వరకు
మధ్యాహ్నం 1:45 గంటల నుండి సాయంత్రం 3:45 గంటల వరకు
ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లు పొందడానికి వెబ్‌సైట్‌లు:
www.aptemples.ap.gov.in
www.srisailadevasthanam.org
మొత్తంగా భక్తులు ఈ వెబ్‌సైట్(Website)లను సందర్శించి, తమకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకొని టోకెన్లను పొందవచ్చు. ఈ సదుపాయం ద్వారా శ్రీశైల మల్లికార్జున స్వామిని సులభంగా, ఎలాంటి రద్దీ లేకుండా దర్శించుకునే అవకాశం లభిస్తుంది.