Just NationalJust PoliticalLatest News

Petrol : పెట్రో బాంబుకు కేంద్రం రెడీ ?..భారీ వడ్డింపు తప్పదని అంచనా

Petrol : పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది

Petrol

ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడి ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక సోమవారం అసలు ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఎప్పటిలానే ఎన్నికల తంతు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను దాదాపు వెయ్యి రూపాయలు పెంచి షాకిచ్చిన కేంద్రం ఇప్పుడు పెట్రోల్ ధరల పెంపుతో బాంబు వేయబోతోంది.

గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమయం కావడంతోనే పెంచలేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వంటి వారు వ్యాఖ్యానించారు. ఒకటి రెండు రోజుల్లో కేంద్రం భారీగా ధరలు పెంచబోతోందని కూడా తేల్చి చెప్పారు. అయితే కేంద్రం మాత్రం అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఈ వారం బ్యారెల్‌కు 126 డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం ముడి చమురు ధర స్వల్పంగా తగ్గినప్పటికీ హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించడం ప్రభావం చూపుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించకపోవడం వంటి కారణాలను చూపి పెట్రోల్, డీజిల్ ధరలను భారీ స్థాయిలో పెంచేందుకు కసరత్తు చేస్తోంది.

Petrol
Petrol

పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయనే విషయంపై ప్రభుత్వ వర్గాలకు ఇప్పటికే సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఏకంగా లీటరుకు రూ. 25 – రూ. 28 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యుద్ధ ప్రభావంతో ప్రపంచ చమురు సరఫరాలో కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధి మూతపడింది.

దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. చమురు సంస్థలు భారీ నష్టాల్లో ఉండడంతో అవి కోలుకునేందుకు కూడా ఈ పెంపు తప్పడం లేదనే మాట కేంద్రం చెప్పబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర ఇప్పటికే రూ.110 వరకూ ఉంది. ఏపీలో కూడా ఇంతకంటే ఎక్కువే ధరలు ఉన్నాయి. మన దేశం 85 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది.

Pensioners : పెన్షనర్లకు కేంద్రం భారీ కానుక.. రూ. 7,500కు చేరనున్న కనీస పెన్షన్

Related Articles

Back to top button