Postal Job : ఎగ్జామ్ లేదు..టెన్త్ మార్కులతోనే సెలెక్షన్..తపాలా శాఖలో జీడీఎస్ ఉద్యోగాలు..
Postal Job : ఈ పోస్టల్ జాబ్‌కు ఎంపికైన వాళ్లు రోజుకు కేవలం 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఆఫీస్ డ్యూటీకి అవసరమైన ల్యాప్‌టాప్, కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌లను ఫోస్టల్ డిపార్ట్‌మెంట్ ఫ్రీగా అందిస్తుంది.
Postal Job
పదో తరగతి పాస్ అయి, సైకిల్ తొక్కడం వచ్చుండి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు.. ఎలాంటి రిటెన్ టెస్ట్ లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించే గోల్డెన్ ఛాన్స్ మీ ముంగిట్లోకి వచ్చేసింది. ఇండయన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో భారీ సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసింది.
ఎలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయాల్సిన పని లేకుండా, కేవలం పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగానే సెలక్షన్ చేసే ఈ నోటిఫికేషన్ నిరుద్యోగులకు నిజంగా చాలా మంచి అవకాశమనే చెప్పాలి. ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) హోదాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. కేండిడేట్స్ సెలక్షన్ పూర్తిగా టెన్త్ క్లాస్ మార్కుల మెరిట్ ఆధారంగానే జరుగుతుంది. అయితే అప్లై చేసుకునేవారికి మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో పాటు లోకల్ లాంగ్వేజ్‌లో మంచి పట్టు ఉండాలి.
దరఖాస్తుదారుల వయస్సు 18 – 40 ఏళ్ల మధ్యన ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు వయోపరిమితి సడలింపు ఉంటుంది. శాలరీల విషయానికి వస్తే బీపీఎం పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు, ఏబీపీఎం పోస్టుకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు ఇస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రాసెస్ ఆగస్టు 31 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 19 వరకు కొనసాగుతుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న కేండిడేట్స్ సెప్టెంబర్ 2 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ సమర్పించొచ్చు. ఒకవేళ అప్లికేషన్లలో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తారు.
జనరల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.100 కాగా, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. దేశవ్యాప్త ఖాళీల సంఖ్యపై క్లారిటీ రాకపోయినా, మన తెలుగు రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్‌లో 918, తెలంగాణలో 419 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

ఈ జాబ్‌కు ఎంపికైన వాళ్లు రోజుకు కేవలం 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఆఫీస్ డ్యూటీకి అవసరమైన ల్యాప్‌టాప్, కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌లను ఫోస్టల్ డిపార్ట్‌మెంట్ ఫ్రీగా అందిస్తుంది. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (IPPB) సర్వీసులు అందించడం ద్వారా స్పెషల్‌గా ఇన్సెంటివ్‌ల రూపంలో ఎక్స్‌ట్రా ఇన్కమ్ కూడా అందుకోవచ్చు. ఎంపికైన వారు కేటాయించిన డివిజన్ లేదా యూనిట్ హెడ్ ఆఫీసులో 15 రోజుల్లోపు రిపోర్ట్ చేయాలి.
రిపోర్ట్ చేసే సమయంలో పదో తరగతి మార్కుల మెమో, గుర్తింపు కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రంతో పాటు స్పెషల్ కోటా వర్తించే కేండిడేట్స్ ఈడబ్ల్యూఎస్, వైకల్య లేదా ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్లను తప్పనిసరిగా తీసుకురావాలి.





