Women : ఎదిగే మహిళలపై బురదజల్లే మైండ్ సెట్..సక్సెస్ వెనుకున్న కష్టం ఎందుకు గుర్తించరు?
Women : ఒక అమ్మాయికి సరైన ఆర్థిక ప్రణాళిక, టైమ్ మేనేజ్మెంట్ ఉంటే ఆమె ప్లానింగ్ మగవారి కంటే చాలా అద్భుతంగా ఉంటుంది
Women
మన సొసైటీలో ఒక అబ్బాయి కష్టపడి పైకి వస్తే.. రాత్రింబగళ్లు కష్టపడ్డాడని అందుకే ఈరోజు ఆ స్థాయికి చేరుకున్నాడంటూ అందరూ చప్పట్లు కొడతారు. కానీ అదే ప్లేసులో ఒక అమ్మాయి ఉండి..ఆమె(Women) తన కాళ్ల మీద తాను నిలబడి కెరీర్లోనో, జీవితంలోనో ఒక్కో మెట్టు ఎదుగుతుంటే మాత్రం ఈ సొసైటీ వెర్షన్ పూర్తిగా మారిపోతుంది.
ఆమె(Women) కష్టాన్ని, ఆమె టాలెంట్‌ను గుర్తించడం పక్కన పెట్టి.. ఏం చేసి ఈ స్టేజికి వచ్చిందో, దీని వెనుక ఏం జరిగిందో అంటూ తమను తాము దిగజార్చుకుని మరీ మాట్లాడేస్తారు. ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే, ఎవరో తెలిసీ తెలియని వాళ్లు ఇలా మాట్లాడితే లైట్ తీసుకోవచ్చు.
కానీ ఆమె గురించి అన్నీ తెలిసిన వాళ్లు, బంధువులే ఇలా తమలోని అసూయను మాటల రూపంలో బయట పెడుతుంటారు. ఈ రకమైన డబుల్ స్టాండర్డ్స్ , ఇలాంటి మైండ్ సెట్ చదువుకున్న వారిలో కూడా కనిపిస్తుండటం నేటి సమాజంలో చాలా బాధాకరమైన విషయమే.
నిజానికి ఒక అమ్మాయికి సరైన ఆర్థిక ప్రణాళిక, టైమ్ మేనేజ్మెంట్ ఉంటే ఆమె ప్లానింగ్ మగవారి కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇల్లు, ఆఫీస్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ టైమ్‌ను మేనేజ్ చేయడం కేవలం మహిళలకు మాత్రమే సాధ్యం అన్నా తప్పు కాదు.
రూపాయి రూపాయి పొదుపు చేస్తూ, ఫ్యూచర్ కోసం పక్కాగా ఇన్వెస్ట్ చేసే ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలామంది అమ్మాయిలకు పుట్టుకతోనే వస్తుంది. చిన్నప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు ఇచ్చిన డబ్బులు మగపిల్లలు తినుబండారాలు కొనేసి నిమిషాల్లో ఖర్చు పెట్టేస్తే.. అమ్మాయి మాత్రం వాటిని అవసరానికి వాడుకుంటా అనుకుంటూ తన డిబ్బీలో దాచుకోవడమే దీనికి ఉదాహరణ.
కానీ ఈ నిజాలను అంగీకరించడానికి సొసైటీలోని ఆడవారిలో కూడా కొందరి ఈగో అస్సలు ఒప్పుకోదు. ఒక అమ్మాయి తమకంటే తెలివిగా ఆలోచిస్తోందని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటోందని అంత త్వరగా జీర్ణించుకోలేరు. అందుకే ఆమె సక్సెస్‌కు తప్పుడు రంగులు పులమడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే తమకంటే ఒక అడుగు ముందే ఉన్న తోటి మహిళను చూసి భయపడే మానసిక బలహీనతే ఇలాంటి మాటలకు కారణమని మానసిక నిపుణులు అంటున్నారు.
సొసైటీలో ఎక్కడో పదిమందిలో ఒకరిద్దరు హద్దులు దాటి ప్రవర్తిస్తే.. అందరి ఆడపిల్లలనూ అదే గాడిన కట్టి మాట్లాడటం అలవాటుగా చేసుకున్నారు. ఎవరో చేసిన తప్పును చూపిస్తూ.. కష్టపడి పైకి వస్తున్న ప్రతి అమ్మాయి క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడటం ద్వారా కొందరు తమ అహంకారాన్ని, ఈగోను చల్లబరుచుకుంటారు.
ఒక అబ్బాయి(Women) తప్పు చేస్తే అది అతని పర్సనల్ మ్యాటర్ అంటూ లైట్ తీసుకుని వదిలేసే జనాలు.. ఒక అమ్మాయి విషయంలో మాత్రం మొత్తం స్త్రీ జాతికే దాన్ని ఆపాదిస్తూ తీర్పులు చెప్పేస్తుంటారు. ఇదంతా కేవలం తమలోని అసమర్థతను దాచుకోవడానికి ,జీవితంలో ఎదిగే అమ్మాయిల కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీయడానికి చేసే కుసంస్కారపు ప్రయత్నం మాత్రమే.

ఇకనైనా జనాలు ఈ అల్ట్రా ఓల్డ్ మైండ్ సెట్‌ను మార్చుకోవాలి. ఒక అమ్మాయి సక్సెస్ అయినప్పుడు దీని వెనుక ఉన్న ఆమె శ్రమను, ఆమె పడ్డ కష్టాన్ని చూడాలే తప్ప.. చీప్ కామెంట్లు చేయడం మానేయాలి. ఆడపిల్లల ఎదుగుదలను చూసి మెచ్చుకోకపోయినా పర్లేదు కానీ, వారి క్యారెక్టర్‌పై బురద చల్లే రైట్స్ ఎవరికీ లేవన్న విషయాన్ని అంతా గుర్తుపెట్టుకోవాలి.
ఇతరుల జీవితాలలోకి తొంగిచూసి నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ముందు.. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలి. అలాగే ఇంకొంతమంది అయితే ఇలాంటి మాటలు అనే ముందు తమ భుజాలను తామొక్కసారి తడుముకోవాలి.ఇలా మైండ్ సెట్ మార్చుకున్నప్పుడే ఈ సొసైటీలో అమ్మాయిలకు ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్, రెస్పెక్ట్ దక్కుతాయి.
NBK 111 : బాలయ్య బర్త్ డే బ్లాస్టర్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న NBK 111 గ్లింప్స్





