Just NationalLatest News

Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ అసలు సూత్రధారి ఆమెనే..  దర్యాప్తులో సంచలన విషయాలు

Delhi Blast: ఇటీవలే హర్యానాలోని ఫరీదాబాద్‌లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఈ కేసును విచారిస్తుండగా కొన్ని కీలక అంశాలు తెలిసాయి.

Delhi Blast

దేశ రాజధానిలో సంచలనం రేపిన బాంబు పేలుడు(Delhi Blast)పై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. నిఘా వర్గాలు ఊహించినట్టుగానే ఈ బ్లాస్ట్ వెనుక ఉగ్ర కోణం ఉన్నట్టు తెలుస్తోంది. బ్లాస్ట్ కు పాల్పడిన ఉమర్ మహమ్మద్ కు ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముందు నుంచీ అనుమానించినట్టుగానే తమకు తగిలిన ఎదురుదెబ్బకు ప్రతీకారంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

ఇటీవలే హర్యానాలోని ఫరీదాబాద్‌లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఈ కేసును విచారిస్తుండగా కొన్ని కీలక అంశాలు తెలిసాయి. జమ్మూకు చెందిన అదీల్ అహ్మద్ రథర్, ముజామిల్ షకీల్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. 2,900 కిలోల పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో లక్నోకు చెందిన షహీనా షాహిద్ అనే మహిళా వైద్యురాలిని అరెస్ట్ చేశారు. ఆమె పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కు భారత్ లో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు.

Delhi Blast
Delhi Blast

భారత్‌లో లష్కరే మహిళా విభాగం ఏర్పాటు, నియామకాల్లో డాక్టర్ షహీనా కీలక పాత్ర పోషించినట్టు తేలింది. షహీనా జైషే మహిళా విభాగం జమాత్ ఉల్ మొమినాత్ భారత్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించినట్టు అనుమానిస్తున్నారు, పాక్‌లో ఈ విభాగానికి మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ చీఫ్‌గా వ్యవహరిస్తుండగా… ఢిల్లీ పేలుడు(Delhi Blast)లో ఆమె కూడా కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం.

కాందహార్ ఫ్లైట్ హైజాక్ వెనుక మాస్టర్ మైండ్ గా ఉన్న యూసఫ్ అజార్ కు సాదియా భార్య. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో యూసఫ్ కూడా హతమయ్యాడు. భర్త మృతికి ప్రతీకారంగా ఆమె ఈ ప్లాన్ చేసి దానిని అమలు చేసే బాధ్యత షహీనాకు అప్పగించినట్టు భావిస్తున్నారు. జైషే ఉగ్ర కుట్ర భగ్నం చేసిన తర్వాత ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు.

కానీ అంతకుముందు ఈ దాడులకు నిధులు, ఇతర వ్యవస్థను సమకూర్చినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. ఇదిలా ఉంటే షహీనాకు చెందిన కారులోనే ఏకే-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు కశ్మీర్‌ డాక్టర్ ముసైబ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. ఫరీదాబాద్‌లో అతడు అద్దెకు తీసుకున్న గుదల్లో 2,900 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button