Siddaramaiah : సిద్ధరామయ్య డిమాండ్లు ఇవే..కొడుకు కోసం పెద్ద ప్లానే
Siddaramaiah : సిద్ధరామయ్య ప్రధాన డిమాండ్లలో ఒకటి తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వాలని కోరారు
Siddaramaiah
కర్ణాటక రాజకీయాల్లో మార్పులు మొదలైన వేళ అందరి ఆసక్తి ఒక్కటే.. మొన్నటి వరకూ సీఎం పదవి నుంచి దిగేందుకు ససేమీరా అంటూ భీష్మించుక్కూర్చున్న సిద్ధరామయ్య ఇప్పుడు ఎలా అంగీకరించారని అందరూ చర్చించుకుంటున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయమే. కానీ గత కొంతకాలంగా ఆ పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధరామయ్య నిరాకరిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు మూడేళ్లు పూర్తికావడంతో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ హైకమాండ్ వైపు నుంచే ఒత్తిడి తెచ్చారు. అయితే సిద్ధరామయ్య(Siddaramaiah) రాజీనామా చేసిన గంటలోనే గవర్నర్ ఆమోదం తెలపగా.. సీఎంగా ప్రమాణ స్వీకారం కోసం డీకే వర్గం తమ ఏర్పాట్లలో నిమగ్నమైంది.
ఇదే సమయంలో మరోసారి ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో భారీ డిమాండ్ లిస్టును అగ్రనేత రాహుల్ గాంధీ ముందుంచారు. సీఎంగా డీకేకు బాధ్యతలు అప్పగిస్తే తాను అడిగిన డిమాండ్లను నెరవేర్చాలని సిద్ధరామయ్య(Siddaramaiah) ముందే హైకమాండ్ ను కోరినట్టు తెలుస్తోంది.
సిద్ధరామయ్య ప్రధాన డిమాండ్లలో ఒకటి తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. అలాగే ఏదో ప్రాధాన్యత లేని శాఖ కాకుండా కీలకమైన శాఖలు కేటాయించాలని తేల్చి చెప్పారు. గతంలో డీకే శివకుమార్ నిర్వర్తించిన జలవనరుల శాఖ లేదా వైద్య విద్య, వెనుకబడిన తరగతుల సంక్షేమం, పరిశ్రమల శాఖల్లో ఒకటి ఇవ్వాలని కోరినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే తనకు జాతీయ రాజకీయాలంటే ఆసక్తి లేదని సిద్ధరామయ్య హైకమాండ్ కు చెప్పినట్టు తెలుస్తోంది. నిజానికి సీఎంగా దిగిపోయిన తర్వాత సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభ సీటును ఆఫర్ చేసింది. అయితే ఈ ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పేశారు.
కర్ణాటక రాజకీయాల్లోనే కంటిన్యూ అవుతానని స్పష్టం చేశారు.ప్రస్తుతం సిద్ధరామయ్య డిమాండ్ లిస్ట్ విషయంలో మల్లిఖార్జున ఖర్గే , రాహుల్ గాంధీ చర్చించినట్టు కూడా తెలుస్తోంది. కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 1 లేదా జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఈ లోపే సిద్ధరామయ్య డిమాండ్స్ పై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Peddi Premier Shows:పెద్ది మూవీకి గ్రీన్ సిగ్నల్.. జూన్ 3న ప్రీమియర్ షో.. రోజుకు 5 షోలు..





