Just NationalJust PoliticalLatest News

Sonia Gandhi Autobiography : సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్‌లో భావోద్వేగ జ్ఞాపకాలు..విల్లింగ్‌డన్‌ క్రెసెంట్‌ బంగ్లా నుంచి 10 జన్‌పథ్ వరకు..

Sonia Gandhi Autobiography : సోనియా గాంధీ రాసిన బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ బుక్‌లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి కావడం, రాజీవ్‌ హత్య, జ్యోతిష్యుడి జోస్యం గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

Sonia Gandhi Autobiography

గాంధీ కుటుంబ ప్రయాణంలో ఎదురైన అపూర్వ సంఘటనలు, ఊహించని టర్నింగ్‌లు, లైఫ్‌లో తీరని లోటును ప్రతిబింబిస్తూ సోనియా గాంధీ రాసిన బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం పాఠకులను ఆకట్టుకుంటోంది. 1977లో ఇందిరా గాంధీ పవర్‌ను కోల్పోయిన తర్వాత వారు 12వ నంబర్ బంగ్లాలో నివసిస్తున్న కాలంలో జరిగిన.. ఒక సంఘటనను సోనియా గుర్తు చేసుకున్నారు.

అప్పట్లో పాలిటిక్స్‌పై ఏమాత్రం ఆసక్తి లేని రాజీవ్ గాంధీ చేతిని చూసిన ఒక జ్యోతిష్యుడు, భవిష్యత్తులో రాజీవ్‌ గాంధీ భారత ప్రధానమంత్రి అవుతారని జ్యోతిష్యం చెప్పడం ఆ టైమ్‌లో విచిత్రంగా అనిపించిందని బుక్‌లో చెప్పారు. అయితే మెల్లమెల్లగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఆ జోస్యాన్ని నిజం చేశాయని వివరించారు.

1980 జూన్‌ నెలలో సంజయ్ గాంధీ ఆకస్మిక మరణం పొందడం, ఆ తర్వాత 1984లో ప్రధాని ఇందిరా గాంధీ దారుణ హత్యకు గురి కావడంతో రాజీవ్ గాంధీ దేశ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాల్సి వచ్చిందని బిలాంగింగ్‌లో అన్నారు . ఆ టైమ్‌లో రాజీవ్ ప్రాణాలకు ప్రమాదం ఉందని భావించిన సోనియా గాంధీ, పాలిటిక్స్‌లోకి రావొద్దని కన్నీళ్లతో వారించినా కూడా దేశ సేవకే రాజీవ్ మొగ్గు చూపారని బిలాంగింగ్‌లో చెప్పారు.

వారు ఎలాగూ తనను హతమారుస్తారంటూ రాజీవ్ గాంధీ వ్యాఖ్యానించడం ఆయనలోని నిష్పక్షపాత వైఖరిని, అదే సమయంలో ఉన్న ముప్పును తెలియజేసిందని సోనియా అన్నారు. లైఫ్‌లో సంభవించిన ప్రతి విషాద సంఘటన తమను మానసికంగా ఎంతో కుంగదీసిందని సోనియా గాంధీ పేర్కొన్నారు.

1985లో రాజీవ్ గాంధీ 41వ పుట్టినరోజు వేడుకల సమయంలో అకాలీదళ్ నేత లాంగోవాల్ హత్య న్యూస్ రావడం తమను తీవ్రంగా బాధించిందని సోనియా గాంధీ తన బిలాంగింగ్‌ పుస్తకంలో వివరించారు. 1990వ సంవత్సరంలో 10 జన్‌పథ్ బంగ్లాకు మారినప్పుడు కూడా ఆ ఇల్లు మంచిది కాదని హెచ్చరికలు వచ్చినా తాము పట్టించుకోలేదని.. కానీ అక్కడికి వెళ్లిన 15 నెలలకే రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోవడం కోలుకోలేని దెబ్బ అని.. సోనియా గాంధీ తన పుస్తకంలో(Sonia Gandhi Autobiography) వివరించారు.

Parental Support : పేరెంట్స్‌ను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతాల్లో కోత..వృద్ధుల సంక్షేమం కోసం వస్తున్న కొత్త చట్టం

Related Articles

Back to top button