Srisailam Project : అరుదైన ఘనత సాధించిన శ్రీశైలం ప్రాజెక్ట్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు..
Srisailam Project : ఇంజనీరింగ్ అద్భుతాలకు కొలువుగా చెప్పుకునే శ్రీశైలం ప్రాజెక్ట్ తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానాన్ని సంపాదించుకుంది.
Srisailam Project
తెలుగు రాష్ట్రాల జీవనాడిగా రెండు రాష్ట్రాల ప్రజలు ప్రాణప్రదంగా భావించే శ్రీశైలం జలాశయం..తాజాగా మరో అరుదైన ఘనతను తన అకౌంట్లో వేసుకుంది. ఇంజనీరింగ్ అద్భుతాలకు కొలువుగా చెప్పుకునే ఈ ప్రాజెక్ట్ తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానాన్ని సంపాదించుకుంది. శ్రీశైలంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధి డాక్టర్ ఇలైజర్.. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ప్రాజెక్ట్ ఇంజనీర్లకు ఈ సర్టిఫికెట్‌ను అఫీషియల్‌గా అందజేశారు.
ఈ రికార్డ్స్ వెనుక శ్రీశైలం ప్రాజెక్ట్(Srisailam Project)కు ఉన్న ప్రత్యేక విశేషాలే మెయిన్ రీజన్ అని డాక్టర్ ఇలైజర్ వెల్లడించారు. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో నిర్మించడం అలాగే ఎక్కడా లేని విధంగా 60 x 55 పొడవు, వెడల్పుతో కూడిన భారీ క్రస్ట్ గేట్లు ఉండటం ఈ ప్రాజెక్ట్‌కు ఉన్న మరో ప్రత్యేకత. అంతేకాకుండా గతంలో 25 లక్షలకు పైగా క్యూసెక్కుల మహోగ్ర వరద నీరు డ్యామ్ పైనుంచి పొంగి పొర్లిపోయినా కూడా.. ఏమాత్రం చెక్కు చెదరకుండా తన సర్వీసులను అందిస్తూ భద్రతాపరంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేయడంతో ఈ గుర్తింపు దక్కింది.

కేవలం పెద్ద పెద్ద వరదలను తట్టుకోవడమే కాకుండా, 215 టీఎంసీల పూర్తి స్థాయి వాటర్ స్టోరేజ్ కెపాసిటీతో రెండు తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీరుతో పాటు ఎలక్ట్రిసిటీని అందిస్తున్న విశిష్టత శ్రీశైలం సొంతం అనే చెప్పాలి. అంతేకాకుండా తెలుగు గంగ ప్రాజెక్ట్ ద్వారా ఏకంగా తమిళనాడులోని చెన్నైకి కూడా తాగునీరు అందిస్తూ జాతీయ స్థాయిలో కూడా ఈ జలాశయం కీలక పాత్రను పోషిస్తోంది. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు, రికార్డులు ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్(Srisailam Project)కు..తాజాగా అంతర్జాతీయ స్థాయిలో దక్కిన ఈ గుర్తింపుతో తెలుగు ప్రజలందరూ గర్వపడే క్షణంగా దీన్ని చెప్పొచ్చు.
Jantar Mantar : జంతర్‌మంతర్ ఇక హిస్టరీలో కలిసిపోతుందా? నిరసనల అడ్డాను పోలీసులు ఎందుకు మార్చేశారు?





