Just NationalJust PoliticalLatest News

Thalapathy Vijay: కింగ్ మేకర్ పాత్రలో దళపతి విజయ్? తమిళనాడులో కొత్త చరిత్ర సృష్టించబోతున్న టీవీకే..

Thalapathy Vijay: దశాబ్దాల కాలంగా కేవలం రెండు ప్రధాన పార్టీల మధ్యే సాగుతున్న అధికార పోరును సవాల్ చేస్తూ, ఒక నూతన శక్తి ఉద్భవించడంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Thalapathy Vijay

తమిళనాడు రాజకీయాలపై రోజురోజుకు క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మరికొద్ది రోజుల్లోనే చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతుండటంతో దేశ వ్యాప్తంగా అందరి చూపు తమిళనాడు వైపే చూస్తోంది. దశాబ్దాల కాలంగా కేవలం రెండు ప్రధాన పార్టీల మధ్యే సాగుతున్న అధికార పోరును సవాల్ చేస్తూ, ఒక నూతన శక్తి ఉద్భవించడంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడు వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగియడంతో, అందరి చూపు ఇప్పుడు మే 4న వెలువడనున్న ఫలితాలపైనే ఉంది. ఈ సమయంలో రాజకీయ విశ్లేషకులు, గ్రహగతులను పరిశీలించే ఎక్స్‌పర్ట్స్ వెలువరిస్తున్న అంచనాలు తమిళ రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.

సాధారణంగా తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలలో ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా డిఫరెంటుగా ఉండే అవకాశం ఉందని తాజా విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఎందుకంటే నటుడు విజయ్(Thalapathy Vijay) స్థాపించిన తమిళ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఎంట్రీతో సమీకరణాలన్నీ తలకిందులయ్యాయి.

ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, ఏ ప్రధాన పార్టీకి కూడా.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన క్లియర్ మెజారిటీ దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విజయ్ కింగ్ మేకర్‌గా అవతరించే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎవరి జాతకంలో రాజయోగం ఉన్నా సరే, తమిళ పీఠంపై ఎవరు కూర్చోవాలనేది మాత్రం విజయ్ తీసుకునే నిర్ణయంపైన మాత్రమే ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఎన్నికల ప్రచార సమయంలో విజయ్(Thalapathy Vijay) చాలా సవాళ్లను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఒకవైపు జననాయగన్ సినిమా విడుదల సమయంలో తలెత్తిన వివాదాలు, మరోవైపు ఆస్తుల ప్రకటనపై వచ్చిన విమర్శలు, అలాగే ప్రచారంలో ఎదురైన అడ్డంకులు వీటన్నిటికి మించి విజయ్ పర్సనల్ లైఫ్‌లో డివోర్స్ వివాదం .. ఇవేవీ ఆయన వేగాన్ని తగ్గించలేకపోయాయి.

ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా.. ఒంటరిగా బరిలోకి దిగిన విజయ్ ధైర్యం చూసి రాజకీయ ఉద్దండులే ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు వెలువడుతున్న అంచనాల ప్రకారం, అటు డీఎంకే తన అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా, ఇటు అన్నాడీఎంకే మళ్లీ పగ్గాలు చేపట్టాలన్నా సరే వారికి విజయ్ మద్దతు అనివార్యమయ్యే పరిస్థితులు తలెత్తే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

కేవలం పొలిటికల్ స్ట్రాటజిస్టులే కాదు.. జాతక చక్రాలను విశ్లేషించే వారు కూడా విజయ్ గ్రహస్థితి అత్యంత బలంగా ఉందని, ఆయన చుట్టూనే భవిష్యత్తు తమిళ రాజకీయాలన్నీ తిరుగుతాయని స్పష్టం చేయడమే ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ అవుతోంది.

Thalapathy Vijay
Thalapathy Vijay

మే 4 న వెలువడనున్న తీర్పు కేవలం తమిళనాడులోనే కాదు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల భవిష్యత్తు కూడా అదే రోజు తేలనుంది. ఆరోజు తమిళనాట ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోతే , ఒక కొత్త శక్తిగా ఎదిగిన విజయ్ ఏ పార్టీకి అండగా నిలుస్తారనే చర్చ సాగుతోంది.

విజయ్ అప్పుడు తీసుకునే నిర్ణయమే.. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త మలుపు కాబోతోంది. అయితే జ్యోతిష్యుల అంచనాలు, విశ్లేషకుల లెక్కలు నిజమైతే, దళపతి విజయ్ తమిళ పాలిటిక్స్‌లో అసలైన గేమ్ ఛేంజర్‌గా మారడమే కాకుండా, కొత్త రాజకీయ శకానికి నాంది పలకడం గ్యారంటీగా కనిపిస్తోంది.

Park N Fly : ఎయిర్‌పోర్ట్‌లో ఇకపై పార్క్ ఎన్ ఫ్లై.. ఇంటి నుంచే పార్కింగ్ స్లాట్ బుకింగ్ చేసుకునే ఛాన్స్

Related Articles

Back to top button