Just NationalLatest News

New Rules : ఏప్రిల్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్.. వాహనదారులకు బిగ్ అలర్ట్

New Rules : వచ్చే ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

New Rules

ప్రతి వాహనదారుడు కూడా హైవేలపై ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటాడు. కానీ టోల్ ప్లాజాల వద్ద ఎదురయ్యే ట్రాఫిక్ రద్దీ వల్ల ప్రయాణ సమయం పెరగడంతో వాహనదారులకు చికాకు కలిగిస్తోంది.

ఈ సమస్యను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తెచ్చినా కూడా, ఇప్పటికీ చాలా మంది నగదు రూపంలోనే టోల్ ఫీజు చెల్లిస్తున్నారు. దీనివల్ల టోల్ గేట్ల వద్ద ఆలస్యం జరుగుతోందని గుర్తించిన కేంద్ర రవాణా శాఖ, వచ్చే ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా రద్దు చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

ఈ కొత్త నిబంధనల ( New Rules) ప్రకారం..ఏప్రిల్ 1 నుంచి టోల్ గేట్ల వద్ద కేవలం డిజిటల్ పద్ధతుల్లో మాత్రమే టోల్ వసూలు చేస్తారు. వాహనదారులు తమ వెంట నగదు తీసుకువెళ్లినా కూడా అక్కడ పే చేసే అవకాశం ఉండదు. కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ యాప్‌ల ద్వారా మాత్రమే టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

డిజిటల్ పద్ధతుల్లో పే చేయడం వల్ల వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా.. ఆటోమేటిక్‌గానే ఛార్జీలు కట్ అవుతాయి, దీనివల్ల ప్రయాణం మరింత వేగంగా , సాఫీగా సాగుతుంది. అందుకే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ..ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని అధికారులు సూచిస్తున్నారు.

New Rules
New Rules

కొత్త నిబంధనల( New Rules) వల్ల ఇబ్బంది పడకుండా ఉండాలంటే..ముఖ్యంగా మీ వెహికల్‌కు ఉన్న ఫాస్టాగ్‌ను ఒకసారి తనిఖీ చేసుకోండి. అది సరిగ్గా పనిచేస్తోందో లేదో చూసుకోవడంతో పాటు కేవైసీ వివరాలను కూడా అప్‌డేట్ చేసుకోవడం మంచిది. అలాగే ప్రయాణానికి ముందే ఫాస్టాగ్ వాలెట్‌లో తగినంత బ్యాలెన్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చూసుకోండి.

ఒకవేళ బ్యాలెన్స్ లేకపోయినా కానీ ఫాస్టాగ్ పనిచేయకపోయినా, టోల్ ప్లాజా వద్ద యూపీఐ ద్వారా చెల్లించే సదుపాయం ఉన్నా, డబ్బులు మాత్రం తీసుకోరు. కాబట్టి డిజిటల్ చెల్లింపుల కోసమే మీరు సిద్ధంగా ఉండాలి. టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించి, ఇంధన ఆదా , సమయాన్ని ఆదా చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. అందుకే ఏప్రిల్ 1 వతేదీకి మీ వెహికల్స్ డిజిటల్ వాలెట్లను సిద్ధం చేసుకోండి, లేదంటే ప్రయాణ మధ్యలో ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు.

 

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button