Tamil Nadu CM Vijay : డీఎంకే, ఏఐఏడీఎంకే రికార్డులు బ్రేక్.. తమిళనాడు సీఎంగా విజయ్ చారిత్రాత్మక రికార్డ్..
Tamil Nadu CM Vijay : వెండితెరపై దశాబ్దాల కాలం పాటు దళపతిగా అశేష జనవాహినిని ఉర్రూతలూగించిన జోసెఫ్ విజయ్, ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రిగా సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
Tamil Nadu CM Vijay
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక సాంప్రదాయానికి తెరపడింది. 1967 నుండి ద్రావిడ రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ, ఒక మూడో ప్రత్యామ్నాయ శక్తిగా దళపతి విజయ్ సీఎం(Tamil Nadu CM Vijay) పీఠాన్ని అధిరోహించారు. దశాబ్దాల ద్రావిడ కోటను బద్దలు కొట్టిన తొలి గెలుపు నాయకుడిగా విజయ్ నయా హిస్టరీని లిఖించారు.
మొత్తంగా తమిళనాడు రాజకీయ యవనికపై ఒక కొత్త శకం ఆరంభమైంది. వెండితెరపై దశాబ్దాల కాలం పాటు దళపతిగా అశేష జనవాహినిని ఉర్రూతలూగించిన జోసెఫ్ విజయ్, ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రిగా సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఫ్యాన్స్ కోలాహలం, రాజకీయ దిగ్గజాల సమక్షంలో జరిగిన ఈ ప్రమాణస్వీకార మహోత్సవం కోలీవుడ్‌లోనే కాకుండా, యావత్ దేశ రాజకీయాల్లో ఉత్సాహంగా మారింది.
మే 10, 2026 ఆదివారం ఉదయం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం విజయ్ ప్రమాణోత్సవ సందర్భంగా జనసంద్రాన్ని తలపించింది. తమిళ వెట్రి కళగం (TVK) పార్టీని స్థాపించి, మొదటి ఎన్నికల్లోనే అఖండ విజయాన్ని అందుకున్న విజయ్, సరిగ్గా ఉదయం 10 గంటలకు తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించగా.. ఈ వేడుకను చూడటానికి లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు.
తమిళనాడు సీఎంగా విజయ్(Tamil Nadu CM Vijay) బాధ్యతలు చేపట్టే ఈ చారిత్రాత్మక ఘట్టంలో, ఆయనతో పాటు మరో తొమ్మిది మంది కీలక నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ తన టీమ్‌లో విద్యావంతులకు, అనుభవజ్ఞులకు, యువతకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో ..తిరు ఎన్. ఆనంద్, డాక్టర్ అధవ్ అర్జున , డా. కె.జి. అరుణ్ రాజ్ (MBBS) , తిరు కె.ఎ.సింగొట్టయ్యన్ , తిరు పి. వెంకటరామణన్ , తిరు ఆర్. నిర్మల్ కుమార్, తిరు రాజ్ మోహన్ , డాక్టర్ టీకే .ప్రభు , సెల్వి ఎస్. కీర్తన ఉన్నారు.
దీనిని బట్టి విజయ్ తన పాలనలో వైద్య ఆరోగ్య రంగానికి, పరిపాలనా అనుభవానికి పెద్దపీట వేయబోతున్నారని అర్థమవుతోంది. 1967 తర్వాత ద్రావిడ కూటములకు చెందని ఓ వ్యక్తి రాష్ట్రానికి నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషత సంతరించుకుంది. ద్రావిడ సిద్ధాంతాలకు తనదైన శైలిలో కొత్త నిర్వచనం ఇస్తూ, ప్రజల ఆశీస్సులతో విజయ్ ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సందడి చేశారు. అయితే అందరి దృష్టిలో హీరోయిన్ త్రిష స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. విజయ్‌తో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన త్రిష, తన తల్లితో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ట్రెడిషనల్ చీరకట్టులో మెరిసిన ఆమె వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్.. ప్రజల సంక్షేమ పథకాలపై తన మొదటి సంతకాన్ని చేశారు. మరోవైపు, విజయ్ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించడంతో.. ఆయన నటిస్తున్న లాస్ట్ మూవీ జన నాయగన్ పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్.. ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుకు తొలి సంతకం చేశారు.. మరోవైపు, విజయ్ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించడంతో.. ఆయన నటిస్తున్న లాస్ట్ మూవీ జన నాయగన్ పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి.
#Trisha arrived at #ThalapathyVijay's oath Taking Ceremony.. pic.twitter.com/o7a4cALNgu
— Laxmi Kanth (@iammoviebuff007) May 10, 2026
Hopelessness:అదృశ్య సంకెళ్లు ఆపేస్తున్నాయా? నిస్సహాయత మిమ్మల్ని డామినేట్ చేస్తుందా?





