EL NINO Effect : 2027 వరకు డేంజర్ బెల్స్..ఎల్‌నినో ప్రభావంతో క్లైమేట్ చేంజ్ భయం..
EL NINO Effect : మధ్య, తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్నే ఎల్‌నినో అంటారు.
EL NINO Effect
ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కాస్తా గ్లోబల్ బాయిలింగ్గా మారిపోతోందనడానికి పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న విపరీత పరిణామాలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తాజాగా విడుదల చేసిన షాకింగ్ రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
సముద్ర గర్భంలో ఊపందుకుంటున్న ఎల్‌నినో రాకాసి ఎఫెక్ట్(EL NINO Effect) అంత తేలిగ్గా ముగిసేటట్టు లేదు. వచ్చే 2027 ఫిబ్రవరి వరకు ఈ భయంకరమైన పరిస్థితులు కొనసాగడం సుమారు 100 శాతం ఖాయమని సైంటిస్టులు తేల్చి చెప్పారు. దీనివల్ల భారత్‌లో వాతావరణ చక్రం తీవ్రంగా తలకిందులయ్యే ప్రమాదం ఉంది.
ఎల్‌నినో అంటే ఏంటంటే.. మధ్య, తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్నే ఎల్‌నినో అంటారు. జూలై నెలలోనే ఇక్కడి టెంపరేచర్స్ సాధారణం కంటే 2 డిగ్రీలు పెరగ్గా, సెప్టెంబర్ – నవంబర్ నాటికి ఏకంగా 3.6 డిగ్రీల వరకూ పెరిగే ఛాన్స్ ఉందని మోడల్స్ హెచ్చరిస్తున్నాయి.
ఇది పసిఫిక్‌లోనే కాదు వరల్డ్ వైడ్‌గా కూడా గాలుల సరళిని, వర్షపాతాన్ని మార్చేస్తుంది. ఇక భారత్ విషయానికొస్తే, దీనివల్ల కొన్ని ఏరియాల్లో ఊహించని కరవు.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఉష్ణగాలులు విజృంభించే అవకాశం ఉంది. అయితే ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) కూడా దీనికి తోడైతే ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది చూడాలి.
ఈ వాతావరణ చేంజెస్ వల్ల అగ్రికల్చరల్ సెక్టార్ అత్యంత దారుణంగా దెబ్బతింటుంది. వర్షాధార పంటలు వేసే రైతులకు వాటర్ అవైలబులిటీ తగ్గడం, టైమ్‌కు వర్షాలు పడకపోవడం వల్ల దిగుబడులు పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో పాటు మనుషుల హెల్త్‌పై కూడా ఇది పంజా విసురుతుంది.

విపరీతమైన ఎండల వల్ల వయసు పైబడిన వాళ్లు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడేవాళ్లు సన్‌స్ట్రోక్, డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ ఇప్పటి నుంచే నీటి సంరక్షణ(Water Conservation) పద్ధతులను పాటించడం, వర్షపు నీటిని స్టోర్ చేసుకోవడం వంటివి చేయడం చాలా అవసరం.
రైతులు ఎప్పటికప్పుడు ఐఎమ్‌డీ (IMD) రిలీజ్ చేసే వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ, కరవును తట్టుకునే ప్రత్యామ్నాయ పంటలను వేయడానికి వైపు మొగ్గు చూపాలి. పశుగ్రాసం, నీటిపారుదలపై ముందుగానే ప్లానింగ్ చేసుకోవడం వల్ల రాబోయే కష్టాల నుంచి బయటపడొచ్చు. ఏది ఏమైనా 2027 వరకూ వరకు ఈ ఎల్‌నినో సెగ(EL NINO Effect) భారతీయులకు తప్పదు కాబట్టి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతోనే మనల్ని రక్షించుకోవాల్సిన పరిస్థితులలో ఉన్నాం.
Relationship Secrets : ప్రేమ ఉంటే సరిపోదా? గోల్స్ డిఫరెంట్‌గా ఉంటే రిలేషన్షిప్ సక్సెస్ అవడం కష్టమా?





