Just NationalLatest News

Gas Prices : గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. మే 1 నుంచి గ్యాస్ ధరలు పెరుగుతాయా?

Gas Prices : సిటీ ప్రాంతాల్లో ఉండేవారు ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత, రెండో సిలిండర్ కోసం కనీసం 25 రోజులు వేచి ఉండాలి.

Gas Prices

ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు సంబంధించి మే 1 నుంచి కొన్ని ముఖ్యమైన మార్పులు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ విధానం, డెలివరీ నిబంధనలు , ధరల విషయంలో మార్పులు రాబోతున్నాయి. వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం ముఖ్యమని అధికారులు అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం సిలిండర్ బుకింగ్ ప్రక్రియల కొత్త నిబంధనల ప్రకారం.. సిటీ ప్రాంతాల్లో ఉండేవారు ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత, రెండో సిలిండర్ కోసం కనీసం 25 రోజులు వేచి ఉండాలి. గతంలో ఈ గడువు 21 రోజులుగా ఉండేది.. ఇప్పుడు దానిని మరో నాలుగు రోజులు పెంచుతున్నారు.

గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి , అలాగే గ్యాస్ సిలిండర్ల కొరతను అధిగమించడానికి, దీంతో పాటు అందరికీ సమానంగా గ్యాస్ సరఫరా అందేలా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఓటీపీ (OTP) ఆధారిత డెలివరీ సిస్టమ్‌ను మరింత కచ్చితం చేయనున్నారు.

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకున్న యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై ప్రభావం పడింది. దీంతో భారత చమురు కంపెనీలు అమెరికా నుంచి దాదాపు 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేసుకున్నాయి.

భారత దేశంలో రోజువారీ ఎల్పీజీ అవసరం 80 వేల టన్నులు ఉండగా.. దేశీయ ఉత్పత్తి కేవలం 46 వేల టన్నులు మాత్రమే ఉంది. ఈ కొరతను తగ్గించడానికి ప్రభుత్వం కొన్ని టెంపరరీ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీని దాదాపు నెల రోజుల పాటు నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Gas Prices
Gas Prices

సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్న మరో అంశం గ్యాస్ ధర(Gas Prices) పెరుగుతుందన్న వార్త. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగా.. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 29న చివరి విడత పోలింగ్ ముగిసిన.. మే 4 న ఫలితాలు వెలువడనున్నాయి.

సాధారణంగా ఎన్నికల సమయంలో కంపెనీలు ధరలను స్థిరంగా ఉంచుతాయి.ఆ తర్వాత పోలింగ్ ముగిసిన వెంటనే ధరలను సవరించే అవకాశం ఉంటుంది. ప్రతీ నెల చమురు సంస్థలు ధరలను సమీక్షిస్తాయి. కాబట్టి దీని ప్రకారం రానున్న మే 1 న ధరలను సమీక్షిస్తాయి. ఆ రోజు వంట గ్యాస్ ధరలు(Gas Prices) పెరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు.

Weight loss : డైట్ లేకుండా బరువు తగ్గడం సాధ్యమేనట.. ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్న 4 స్టెప్స్ ఇవే..

Related Articles

Back to top button