Just PoliticalLatest News

Vijay:విజయ్ కోసం బీజేపీ భారీ ఆఫర్.. రాయబారిగా పవన్ కళ్యాణ్?

Vijay: తమిళ వెట్రి కజగం (TVK) పార్టీని ఎన్డీయే కూటమిలోకి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ గట్టిగానే పావులు కదుపుతోంది.

Vijay

తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్(Vijay) వేయబోయే అడుగు ఎటువైపు అనే ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనున్న ఈ సమయంలో తమిళనాట పొలిటికల్ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తమిళ వెట్రి కజగం (TVK) పార్టీని ఎన్డీయే కూటమిలోకి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ గట్టిగానే పావులు కదుపుతోంది.

తమిళనాడులో ఎలాగైనా పాగా వేయడానికి చూస్తున్న బీజేపీ, విజయ్(Vijay) క్రేజ్‌ను వాడుకోవాలని ఆలోచిస్తోంది. దీనిలో భాగంగా విజయ్ ఎన్డీయేలో చేరితే విజయ్‌కు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు.. 80 అసెంబ్లీ సీట్లు ఇచ్చేలా ఆఫర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ చర్చల కోసం బీజేపీ ముఖ్య నేతలతో పాటు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విజయ్‌తో టచ్‌లో ఉన్నారనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

పవన్ కళ్యాణ్ లాగే విజయ్ కూడా మూవీ గ్లామర్ నుంచి పాలిటిక్స్‌లోకి రావడమే కాక, యువతలో భారీ ఫాలోయింగ్ ఉండటంతో పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారం నడిపిస్తే వర్కౌట్ అవుతుందని భారతీయ జనతా పార్టీ అధిష్టానం భావిస్తోంది.
తమిళనాడులో ఎప్పుడు చూసినా గెలుపోటములు చాలా తక్కువ ఓట్ల తేడాతో మారుతుంటాయి. కేవలం 2 శాతం ఓట్లు అటు ఇటు అయినా ఫలితం తలకిందులవుతుంది.

Vijay
Vijay

ఇలాంటి సమయంలో విజయ్ వంటి స్టార్ హీరో ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలడంతో తమకు నష్టం జరుగుతుందని.. అదే తమతో కలిస్తే విజయం ఖాయమని బీజేపీ లెక్కలు వేస్తోంది. అన్నాడీఎంకేతో కలిసి విజయ్‌ను కూడా కూటమిలోకి చేర్చుకుంటే డీఎంకే కోటను బద్ధలు కొట్టొచ్చని బీజేపీ అంచనా వేస్తోంది.

మొదటి నుంచి విజయ్ మాత్రం తన లక్ష్యం సీఎం కుర్చీ అనే చెబుతున్నారు. ఎవరితోనూ పొత్తు ఉండదని, అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు. మరి ఇప్పుడు బీజేపీ ఇస్తున్న ఈ భారీ ఆఫర్ చూసి విజయ్ మనసు మారుతుందా లేదా అన్నదే తేలడం లేదు. ఒకవేళ ఆయనే గనుక ఈ ఆఫర్ ఒప్పుకుంటే తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇది ఒక పెద్ద మలుపే అవుతుంది.

కానీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తన సొంత ఇమేజ్ దెబ్బతింటుందని విజయ్ భావిస్తే మాత్రం ఒంటరి పోరుకే మొగ్గు చూపవచ్చు. ఏది ఏమైనా, ఈ మార్చి నెలలో తమిళ రాజకీయాల్లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ క్లైమాక్స్ కనిపించేలా ఉంది.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button