Just PoliticalJust EntertainmentLatest News

Vijay Trisha: చరిత్ర సృష్టించిన విజయ్..ట్రెండింగ్ లో త్రిష

Vijay Trisha : తమిళనాడులో మాత్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రభంజనం సృష్టిస్తున్న టీవీకే చీఫ్ విజయ్ తో పాటు త్రిష పేరు ట్రెండింగ్ లో దూసుకుపోతోంది

Vijay Trisha

ఎన్నికల ఫలితాల వేళ సాధారణంగా రాజకీయ పార్టీల పేర్లు లేదా వాటి అధినేతల పేర్లు మాత్రమే ట్రెండింగ్ లో ఉంటాయి. కానీ తమిళనాడులో మాత్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రభంజనం సృష్టిస్తున్న టీవీకే చీఫ్ విజయ్(Vijay Trisha) తో పాటు త్రిష పేరు ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

గత కొంతకాలంగా విజయ్, త్రిష(Vijay Trisha) సన్నిహిత సంబంధం వ్యవహారం అందరికీ తెలుసు. విజయ్ భార్య విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం, పిటిషన్ లో ఆమె త్రిష పేరును నేరుగా చెప్పకుండా తీవ్ర ఆరోపణలు చేయడం వంటివి తీవ్ర దుమారాన్ని రేపాయి. ఎప్పటినుంచో త్రిషతో విజయ్ లవ్ లో ఉన్నాడనేది బహిరంగ రహస్యమే.

ఈ కారణంగానే విజయ్ భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. అటు తమిళనాడు ఎన్నికల పోలింగ్ కు ముందు ఓ బీజేపీ నేత సైతం త్రిషను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటి నుంచీ ఆమె అక్కడ హాట్ టాపిక్ గా మారారు. ఓ సందర్భంలో ఒక పెళ్లి వేడుకకు విజయ్ తో కలిసి త్రిష హాజరవడం కూడా చర్చనీయాంశమైంది.

తమ మధ్య ఉన్న బంధాన్ని చెప్పకనే చెప్పారంటూ కామెంట్లు వినిపించాయి. అయితే విజయ్ కానీ, ఇటు త్రిష కానీ ఎప్పుడూ తమ రిలేషన్ పై స్పందించలేదు. కానీ త్రిష మాత్రం సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడూ పరోక్షంగా చేసిన ట్వీట్లు వైరల్ గా మారాయి.

Vijay Trisha
Vijay Trisha

ఇప్పుడు ఎన్నికల ఫలితాల రోజునే తన పుట్టినరోజు కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ ట్రెండింగ్ లో నిలిచారు. బండ్ల గణేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నీ కల నిజమైందంటూ ట్వీట్ చేయడం మరింత వైరల్ అయింది. విజయ్ గెలుపును కోరుతూ తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసిందంటూ పలువురు వ్యాఖ్యానించారు.

అటు శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా విజయ్ ఇంటికెళ్లడం కూడా బాగా ట్రెండ్ అయింది. విజయ్ కు శ్రీవారి ప్రసాదం ఇచ్చి అభినందనలు తెలియజేసింది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచీ త్రిష పేరు ట్రెండింగ్ లోనే ఉండగా… విజయ్ టీవీకే పార్టీ గెలుపు ఖాయమైన తర్వాత ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది. భార్యతో విడాకుల వివాదం తేలిపోగానే విజయ్, త్రిష వివాహ బంధంతో ఒక్కటవుతారన్న ప్రచారం జరుగుతోంది.

West Bengal : బెంగాల్ లో కమల వికాసం..దీదీకి ఘోర పరాభవం

Related Articles

Back to top button