Just SpiritualLatest News

Shiva : శివానుగ్రహం కోసం 108 దివ్య నామాలు..ఒత్తిడిని తగ్గించి ఆనందాన్నిచ్చే దివ్య స్తోత్రం

Shiva :ముఖ్యంగా సోమవారం, ప్రదోష కాలం, మాస శివ రాత్రి, మహా శివరాత్రి వంటి పవిత్ర సమయాల్లో 108 నామాలను పఠించడం వల్ల జాతకంలోని దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు.

Shiva

కైలాసవాసుడు, లయకారుడు అయిన ఆ మహాశివుడి అనుగ్రహం పొందడానికి భక్తులంతా.. అనుసరించే అత్యంత శక్తివంతమైన మార్గాలలో శివ (Shiva)అష్టోత్తర శత నామావళి ఒకటి అని తెలిసిందే. ప్రతీరోజూ అయినా లేదంటే కనీసం విశేష పర్వదినాల్లో అయినా పరమేశ్వరుని 108 నామాలతో పూజించడం వల్ల.. సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలలో వివరించారు.

ఈ నామ స్మరణ కేవలం దేవునికి చేసే ప్రార్థన మాత్రమే కాదు, అశాంతిగా ఉన్న మనసుకు ఒక అద్భుతమైన ఔషధంలా పని చేస్తుందని పండితులు చెబుతుంటారు. ఇప్పుడున్న డైలీ రొటీన్‌లో ఎదురయ్యే మెంటల్ టెన్షన్స్, భయాందోళనలు తొలగిపోవడంతో పాటు, ప్రశాంతంగా జీవించడానికి ఈ శివనామ స్మరణ దిక్సూచిగా నిలుస్తుంది.

ముఖ్యంగా సోమవారం, ప్రదోష కాలం, మాస శివ రాత్రి, మహా శివరాత్రి వంటి పవిత్ర సమయాల్లో ఈ 108 నామాలను పఠించడం వల్ల జాతకంలోని దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు. శివుడు(Shiva) భోళాశంకరుడు, భక్త సులభుడు. భక్తితో చేసే ప్రతి స్మరణను కూడా శివయ్య(Shiva) స్వీకరిస్తాడు. ఈ అష్టోత్తరాన్ని పఠించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ నశించి ఆనందంతో పాటు విజయం చేకూరుతాయి. ఆధ్యాత్మిక ఉన్నతిని కోరుకునే వారికి ఈ నామావళి ఒక మెట్టులా తోడ్పడుతుందని నమ్మకం.

Shiva
Shiva

ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం శూలపాణయే నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం అంబికానాథాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం శితికంఠాయ నమః
ఓం శివాప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కౌమారయే నమః
ఓం అంధకాసుర సూదనాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కృపానిధయే నమః
ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మృగపాణయే నమః
ఓం జటాధరాయ నమః
ఓం కైలాసవాసినే నమః
ఓం కవచినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషాంకాయ నమః
ఓం వృషభారూఢాయ నమః
ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః
ఓం సామప్రియాయ నమః
ఓం స్వరమయాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః
ఓం హవిషే నమః
ఓం యజ్ఞమయాయ నమః
ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాథాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం దుర్ధర్షాయ నమః
ఓం గిరీశాయ నమః
ఓం గిరిశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగ భూషణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వనే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం కృత్తివాససే నమః
ఓం పురారాతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమథాధిపాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహాసేన జనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం స్థాణవే నమః
ఓం అహిర్బుధ్న్యాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం సాత్త్వికాయ నమః
ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమోచకాయ నమః
ఓం మృడాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరయే నమః
ఓం పూషదంతభిదే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః
ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపదే నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః

ఇతి శ్రీశివాష్టోత్తరశతనామావళిః సమాప్తా

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button