Just SpiritualLatest News

Gorintaku : గోరింటాకు పెట్టుకోవడం అందం కోసమా? ఆరోగ్యం కోసమా? ఆషాఢంలో గోరింటాకు వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఏంటి?

Gorintaku : ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకునే పద్ధతి వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు, ఆధ్యాత్మిక కోణాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Gorintaku

ఆషాఢం వచ్చిందంటే చాలు చాలామంది గోరింటాకు(Gorintaku) పేరునే జపిస్తారు. గోరింటాకు పెట్టుకుని మురిసిపోయే మహిళలు, యువతలు, బాలికలు ..చేతికి ఎర్రగా పండిన గోరింటాకును అందరికీ చూపిస్తూ తెగ సంతోష పడిపోతుంటారు.

మార్కెట్లోకి ఎన్ని రకాల మెహందీ కోన్‌లు వచ్చినా.. గోరింటాకు(Gorintaku) ఆకులను నూరి చేతులకు పెట్టుకుంటే వచ్చే ఆ అందం, సంతోషం ఎవరికైనా వేరుగా ఉంటుంది. అయితే కేవలం ఆచారం అనుకునే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకునే పద్ధతి వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు, ఆధ్యాత్మిక కోణాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

మన పెద్దలు ఏ ఆచారాన్ని పెట్టినా సరే  కచ్చితంగా దాని వెనుక సైన్స్ ఉంటుంది. ఆషాఢ మాసం ప్రారంభం అనగానే గ్రీష్మ రుతువు ముగిసి వర్ష రుతువు మొదలవుతుందనే అర్ధం. అంతవరకు ఎండల వల్ల శరీరం అంతా వేడిని కలిగి ఉంటుంది. వర్ష రుతువు రాకతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడేసరికి, వాతావరణ మార్పుల వల్ల మన శరీరంలోని వేడి ఒకేసారి బయటపడి రకరకాల జ్వరాలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

అయితే గోరింటాకుకు శరీరంలోని వేడిని లాగేసి చలవ చేసే అద్భుతమైన గుణం ఉంటుంది. వర్షాకాలంలో వచ్చే క్రిములను, బ్యాక్టీరియాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని గోరింటాకు పెంచుతుంది. అందుకే ఈ సీజన్లో వచ్చే అనారోగ్యాల నుంచి రక్షణ పొందడం కోసమే మన పెద్దలు గోరింటాకు పెట్టుకోవాలని నియమాన్ని పెట్టారు. అందుకే కొన్ని ప్రాంతాలలో మహిళలే కాకుండా చిన్నపిల్లలు,మగవాళ్లు కూడా గోరింటాకును పెట్టుకుంటారు.

Gorintaku
Gorintaku

ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే, హిందూ సంప్రదాయంలో గోరింటాకును ఐదోతనానికి, సౌభాగ్యానికి ప్రతీకగా చెబుతారు. ఆషాఢ మాసంలో ముత్తయిదువులు అరచేతుల్లో గోరింటాకును ధరించడం వల్ల వారి పసుపు కుంకుమలు పదిలంగా ఉంటాయని, భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడని పురాణాలు చెబుతుంటాయి.

మొత్తంగా చేతులకు ఎర్రగా పండే గోరింటాకు మహిళల జీవితాల్లో సరికొత్త సానుకూల శక్తిని, సంతోషాన్ని నింపుతుందనేది నిజం. అందుకే ఈ ఆషాఢంలో సాంప్రదాయాన్ని పాటిస్తూ, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Varahi Navaratri : శత్రు భయాన్ని పటాపంచలు చేసే వారాహి దేవి నవరాత్రులు ..పూజ ఎలా చేయాలి? ఏం చేయకూడదు?

Related Articles

Back to top button